మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా: [ Crime journalist 30-01-2024 ] :-
నకిరేకల్ నియోజకవర్గం: కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి నకిరేకల్ ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ₹- 30.00 లక్షల వ్యయంతో నూతన నిర్మాణ చేపడుతున్న గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన చేసినన ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.
పాల్గొన్న స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు గ్రామస్తులు
ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పాటు ఎన్ని కష్టాలు వచ్చిన నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
ఈ గ్రామ పంచాయతీ భవన నిర్మాణాని విశాలంగా నిర్మాణం చేసుకుందాం,అయిటిపాముల గ్రామ చెరువులోకి త్వరలో నీరు అందిస్తా,ఈ గ్రామాని నుండి రసుల్ గూడెం, రామచంద్రాపల్లె రోడ్డు ను నిర్మాణం చేసుకుందాం,పానగల్ చెరువు నుండి అయిటిపాముల చెరువు వచ్చే కాలువను సిమెంట్ లైనింగ్ వేసుకుద్దాం,రానున్న ఎన్నికల్లో పార్లమెంటు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి తప్పకుండా ఈ గ్రామాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేను పరిష్కారం చేస్తా. ఈకార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య గౌడ్,ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య,మాజీ జడ్పీటీసీ&ఎంపీటీసీ టు మాద యాదగిరి,నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ ప్రతినిధి సుంకరబోయిన నర్సింహ్మ యాదవ్,ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ ( బాబు)సర్పంచ్లు, ఉపసర్పంచ్లు,వార్డ్ నెంబర్లు,అధికారులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Jan 31 2024, 17:34