న్యాయవాదుల ఉద్యమ త్యాగానికి మకిలి పట్టించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ ఒక వర్గ నేతలు
ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్
న్యాయవాదుల ఉద్యమ త్యాగానికి మకిలి పట్టించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక వర్గ నేతలు.
మేడా శ్రీనివాస్ , ఆరోపణ.
ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)
[Crime journalist 30-01-2024] :-
కొత్తగా ప్రవేశ పెట్టిన భూ హక్కు చట్టం రద్దుకై రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమస్తున్న న్యాయవాదుల ఉద్యమ త్యాగాలను రాజమండ్రి బార్ అసోసియేషన్ లో గల ఒక వర్గం లో కొంతమంది నేతలు వారి రాజకీయ స్వార్దానికి ఉపయోగించుకుంటున్నారని ఆలా ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ ఆపోయారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ప్రవేశ పెట్టిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి ప్రజల పక్షాణ రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులు విధులు భహిష్కరించి ఉద్యమాలు చేస్తున్నారు.
ఈ తరుణంలో న్యాయవాదుల ఉద్యమ త్యాగాలను అవమాన పరిచే విధంగా రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక వర్గానికి చెందిన కొంతమంది నేతలు సొంత ప్రయోజనాల కోసం రాజమండ్రి రూరల్ కాతేరు ప్రాంతంలో జరిగిన చంద్రబాబు నిర్వహించిన భహిరంగ సభకు రాజమండ్రి బార్ అసోసియేషన్ నుండి ఒక వర్గానికి చెందిన కొంతమంది నేతలు అత్యుత్సాహంగా భూ హక్కు చట్టం రద్దుకు సహకరించాలంటు చంద్రబాబు సభకు సంఘీభావంగా వెళ్లి కలవటం ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల ఉద్యమ త్యాగాలకు బ్రష్టు పట్టించారన్నారు . ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ వారి అనుమతి లేకుండా చంద్రబాబు ను కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయవాదులపై తప్పుడు సాంకేతాలు ఏర్పడే విధంగా రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక వర్గానికి చెందిన నేతల చర్యలు ఉండటం బాదాకరం. గతంలో న్యాయవాదుల హక్కుల పై గళ మెత్తిన కొంతమంది యువ న్యాయవాదులపై బార్ కౌన్సిల్ వారు క్రమ శిక్షణా చర్యలు క్రింద నోటీసులు జారి చేసారని అని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేస్తున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న నిరసన ఉద్యమానికి మకిలి ఏర్పడే విధంగా ప్రవర్తించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక(ఆ)వర్గం నేతల పై చర్యలు ఉంటాయా !
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రోజు వారి ఆధాయాలు కోల్పోతు నిజాయితీగా విధులు భహిస్కరిస్తు ఉద్యమిస్తుంటే రాజమండ్రి బార్ అసోసియేషన్ వారు ఉద్యమం చేస్తున్నట్టు గానే విధులు నిర్వహిస్తు రాష్ట్ర న్యాయవాదులను మోసాగిస్తున్నారనే అపవాద వుందన్నారు . భూ హక్కు చట్టం రద్దు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)తో పాటుగా అనేక మంది ఏపి హై కోర్టులో వాజ్యాలు దాఖలు చేసారని ఆయన తెలిపారు.ప్రస్తుతం విచారణలు సాగుతుండగా రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఆ వర్గం వారు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని ఒక ప్రక్కన హేళనగా మాట్లాడేది ఆ వర్గం వారే, చంద్రబాబు సభ కు భూ హక్కు చట్టం వంకతో వెళ్ళేది ఆ వర్గం వారే అని అనేక మంది న్యాయవాదులు గుస గుస లు వినిపిస్తున్నాయి.
రాజమండ్రి బార్ అసోసియేషన్ లో
ఆ వర్గం ప్రవర్తన కారణంగా న్యాయవాదులు రాజకీయ పార్టీల వారిగా విడిపోయి న్యాయవాదుల ఐక్యత దెబ్బ తినే ప్రమాదం ఉందని , రాజమండ్రి బార్ అసోసియేషన్ లో చంద్రబాబు ను కలిసిన ఆ వర్గం వారు భూ హక్కు చట్టం పై ఉద్యమం చేస్తున్నారో , రాజకియం చేస్తున్నారో రాజమండ్రి బార్ అసోసియేషన్ వారు వివరణ ఇవ్వాలని లేకుంటే రాజమండ్రి న్యాయవాదులు పై రాజకీయ ముద్ర పడే ప్రమాదం ఉందని ఆలా ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ తెలిపారు..
--మేడా శ్రీనివాస్,
ప్రధాన కార్యదర్శి,
ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)
Jan 30 2024, 20:02