న్యాయవాదుల ఉద్యమ త్యాగానికి మకిలి పట్టించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ ఒక వర్గ నేతలు

ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్

న్యాయవాదుల ఉద్యమ త్యాగానికి మకిలి పట్టించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక వర్గ నేతలు.

మేడా శ్రీనివాస్ , ఆరోపణ.

ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)

[Crime journalist 30-01-2024] :-

కొత్తగా ప్రవేశ పెట్టిన భూ హక్కు చట్టం రద్దుకై రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమస్తున్న న్యాయవాదుల ఉద్యమ త్యాగాలను రాజమండ్రి బార్ అసోసియేషన్ లో గల ఒక వర్గం లో కొంతమంది నేతలు వారి రాజకీయ స్వార్దానికి ఉపయోగించుకుంటున్నారని ఆలా ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ ఆపోయారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ప్రవేశ పెట్టిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి ప్రజల పక్షాణ రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులు విధులు భహిష్కరించి ఉద్యమాలు చేస్తున్నారు.

ఈ తరుణంలో న్యాయవాదుల ఉద్యమ త్యాగాలను అవమాన పరిచే విధంగా రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక వర్గానికి చెందిన కొంతమంది నేతలు సొంత ప్రయోజనాల కోసం రాజమండ్రి రూరల్ కాతేరు ప్రాంతంలో జరిగిన చంద్రబాబు నిర్వహించిన భహిరంగ సభకు రాజమండ్రి బార్ అసోసియేషన్ నుండి ఒక వర్గానికి చెందిన కొంతమంది నేతలు అత్యుత్సాహంగా భూ హక్కు చట్టం రద్దుకు సహకరించాలంటు చంద్రబాబు సభకు సంఘీభావంగా వెళ్లి కలవటం ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల ఉద్యమ త్యాగాలకు బ్రష్టు పట్టించారన్నారు . ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ వారి అనుమతి లేకుండా చంద్రబాబు ను కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయవాదులపై తప్పుడు సాంకేతాలు ఏర్పడే విధంగా రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక వర్గానికి చెందిన నేతల చర్యలు ఉండటం బాదాకరం. గతంలో న్యాయవాదుల హక్కుల పై గళ మెత్తిన కొంతమంది యువ న్యాయవాదులపై బార్ కౌన్సిల్ వారు క్రమ శిక్షణా చర్యలు క్రింద నోటీసులు జారి చేసారని అని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేస్తున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న నిరసన ఉద్యమానికి మకిలి ఏర్పడే విధంగా ప్రవర్తించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక(ఆ)వర్గం నేతల పై చర్యలు ఉంటాయా !

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రోజు వారి ఆధాయాలు కోల్పోతు నిజాయితీగా విధులు భహిస్కరిస్తు ఉద్యమిస్తుంటే రాజమండ్రి బార్ అసోసియేషన్ వారు ఉద్యమం చేస్తున్నట్టు గానే విధులు నిర్వహిస్తు రాష్ట్ర న్యాయవాదులను మోసాగిస్తున్నారనే అపవాద వుందన్నారు . భూ హక్కు చట్టం రద్దు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)తో పాటుగా అనేక మంది ఏపి హై కోర్టులో వాజ్యాలు దాఖలు చేసారని ఆయన తెలిపారు.ప్రస్తుతం విచారణలు సాగుతుండగా రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఆ వర్గం వారు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని ఒక ప్రక్కన హేళనగా మాట్లాడేది ఆ వర్గం వారే, చంద్రబాబు సభ కు భూ హక్కు చట్టం వంకతో వెళ్ళేది ఆ వర్గం వారే అని అనేక మంది న్యాయవాదులు గుస గుస లు వినిపిస్తున్నాయి.

రాజమండ్రి బార్ అసోసియేషన్ లో

ఆ వర్గం ప్రవర్తన కారణంగా న్యాయవాదులు రాజకీయ పార్టీల వారిగా విడిపోయి న్యాయవాదుల ఐక్యత దెబ్బ తినే ప్రమాదం ఉందని , రాజమండ్రి బార్ అసోసియేషన్ లో చంద్రబాబు ను కలిసిన ఆ వర్గం వారు భూ హక్కు చట్టం పై ఉద్యమం చేస్తున్నారో , రాజకియం చేస్తున్నారో రాజమండ్రి బార్ అసోసియేషన్ వారు వివరణ ఇవ్వాలని లేకుంటే రాజమండ్రి న్యాయవాదులు పై రాజకీయ ముద్ర పడే ప్రమాదం ఉందని ఆలా ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ తెలిపారు..

--మేడా శ్రీనివాస్,

  ప్రధాన కార్యదర్శి,

ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)

శాలివాహన సంఘ మండల అధ్యక్షులుగా మల్లవరపు మల్లేశ్వరరావు

శాలివాహన సంఘ మండల అధ్యక్షులుగా మల్లవరపుమల్లేశ్వరరావు

[Crime journalist ఆలమూరు 30-01-2024] :- ఆలమూరు మండల శాలివాహన కుమ్మరి సంఘ అధ్యక్షులుగా ఆలమూరుకు చెందిన శ్రీ మల్లవరపు మల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా పెనికేరుకు చెందిన శ్రీ పేరూరి త్రిమూర్తులు, ఉపాధ్యక్షులుగా పెనికేరుకు చెందిన పేరూరి రాజు, మోదుకూరుకు చెందిన పుల్లేటికుర్తి సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా చింతలూరుకు చెందిన పసలపూడి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా గుమ్మిలేరుకు చెందిన పాండ్రాకుల సత్తిబాబు, పినపళ్లకు చెందిన పాండ్రాకుల కాళీ కృష్ణలు ఎన్నికయ్యారు. కోశాధికారిగా చొప్పెళ్లకు చెందిన పాలకొల్లు పట్టాభిరామయ్య, ఆర్గనైజర్ గా ఆలమూరుకు చెందిన పాండ్రాకుల అమర్నాథ్, సభ్యులుగా జొన్నాడకు చెందిన పేరూరు శ్రీనివాసరావు, ఆలమూరుకు చెందిన వెల్ల వీర వెంకటరమణ, మండ ఫణీంద్ర, చొప్పెళ్లకు చెందిన ఆకేటి రామకృష్ణ,కలవచర్లకు చెందిన ర్యాలీ సాంబయ్యలు ఎన్నికయ్యారు. డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శాలివాహన కుమ్మరి సంఘ అధ్యక్షులు శ్రీ మానేపల్లి వీరబ్రహ్మం,

ప్రధాన కార్యదర్శి శ్రీ దాలిపర్తి భీమేశ్వరరావు, పరిశీలకుల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.సంఘ ఐక్యతకు, ఉన్నతికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మల్లవరపు మల్లేశ్వరరావు తెలిపారు.

కోడి కత్తి శ్రీను తల్లిని పరామర్శించిన అడ్వకేట్ విద్యాప్రసన్న

కోడి కత్తి శ్రీను తల్లిని పరామర్శించిన అడ్వకెట్ విద్యా ప్రసన్న.*

[Crime journalist ఆలమూరు 30-01-2014]


విజయవాడలో కోడికత్తి శ్రీను కేసు విషయంలో అతని తల్లిని, సోదరుడిని మంగళవారం ఆలమూరు బారాసోసియేషన్ ట్రెజరర్, ప్రముఖ న్యాయవాది, అసోసియేషన్ ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బూసి విద్యా ప్రసన్న కలిసి పరామర్శించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఈ కేసును మొదటి నుండి అడ్వకేట్ సలీంమ్ చూస్తుండగా గత నాలుగు నెలలుగా అసోసియేషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్(ఏపీసిఆర్) సహకరిస్తున్నట్లు ఏపీసిఆర్ ప్రెసిడెంట్, హైకోర్టు న్యాయవాది పిచ్చుకల శ్రీనివాస్ తెలిపారు అన్నారు. అలాగే ఏపీసిఆర్ దేశంలో 18 రాష్ట్రాల్లో పని చేస్తుందని,ఈ కేసు విషయంలో ఆర్గమెంట్స్ పూర్తయ్యాయని ఫిబ్రవరి మొదటి వారంలో జనిపల్లి శ్రీనివాస్ విడుదలయ్యే అవకాశం ఉందని తమ కుటుంబ సభ్యులకు తెలియజేసి భరోసా కల్పించామన్నారు._

పెనికేరు నుండి పలువురు యువత టీడీపీ లోకి చేరిక

పెనికేరు నుండి పలువురు యువత టీడీపీలోకి చేరిక

తూర్పుగోదావరి జిల్లా:

ఆలమూరు:

[30-01-2024] :- మండలంలోని పెనికేరు గ్రామం నుండి పలువురు యువత స్వచ్ఛందంగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జీ బండారు సత్యానందరావు నివాసానికి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు.వీరికి సత్యానందరావు పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరినవారు 

పల్లి నాగసాయి,పాక రాజు,పాక నవీన్,పల్లి నాని,పాక కార్తీక్

వార శ్రీను, కాయలబాలాజీ ఈకార్యక్రమంలో గొడవర్తి సూర్యభాస్కరరావు, కోనా శ్రీనివాస్(దత్తుడు) మొదలగువారు పాల్గొన్నారు.

ఆ మహాత్ముని ఈ రోజు స్మరించుకోవటం భారతీయులుగా మనందరి ధర్మం

ఆ మహాత్మునిని ఈరోజు స్మరించుకోవటం భారతీయులుగా మనందరి ధర్మం.

గుమ్మిలేరు సర్పంచ్ గుణ్ణం రాంబాబు

తూర్పు గోదావరి జిల్లా:

[ఆలమూరు 30-01-2024] :- మండలంలోని గుమ్మిలేరు గ్రామంలో ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి కావడంతో గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు మరియు గ్రామస్తులు నాయకులతో కలిసి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వజన "హితం నా మతం అంటరానితనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే నా ఆయువు అంకితం".ఆనాడు ఆయన చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు.జాతిపిత మహాత్మా గాంధీ ఆ మహాత్ముని ఈరోజు స్మరించుకోవటం భారతీయులుగా మనందరి ధర్మం అని తెలియజేశారు. మనదేశంలో ఉన్న ప్రజలకు యువతకు ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

ఆర్టీసీ బస్సులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడమా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమా

ఆర్టీసీ బస్సులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడమా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమా

నల్గొండ జిల్లా:

[చుండూరు 29-01-2024]:-

ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడమో పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారే తేల్చుకోవాలని కస్తాల సభలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి పార్లమెంటు ఎన్నికల్లోపు పంచాయతీలో వికలాంగుల వాటా తేల్చకుంటే రేవంత్ రెడ్డి సర్కార్తో రాజీలేని పోరాటం కొనసాగిస్తామని గిద్దె రాజేష్ ఉద్ఘటన

ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడమో పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారే తేల్చుకోవాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు సోమవారం నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామంలో నిర్వహించిన సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మీన మేసాలు లెక్కిస్తుందని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోపూ 76 ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేయకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ పై పంచాయతీలో వికలాంగుల వాటా తెల్చేంతవరకు రాత్రిలేని పోరాటం కొనసాగిస్తామని  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ వచ్చే ఫిబ్రవరి నెల నుంచే 6 వేలు ఇవ్వాలని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన మాదిరిగానే రేవంత్ రెడ్డి సర్కార్ వికలాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన మాదిరిగా రాష్ట్రంలో 21 రకాల వికలాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్రంలో వికలాంగుల హక్కుల చట్టం 2016 ను సమర్ధవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి డిజిపి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి చట్టాన్ని అన్ని పోలీస్ స్టేషన్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆసరా పింఛన్ వచ్చే ప్రతి వికలాంగునికి అంతోదయ కార్డులను మంజూరు చేయడంతోపాటు 10 లక్షల రూపాయలతో వికలాంగులకు అణువుగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వ ప్రవేట్ కార్యాలయాల్లోనూ షాపింగ్ కాంప్లెక్స్ ల్లో వికలాంగులకు అణువుగా ర్యాంపులు నిర్మించాలని స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగుల అందరికీ ఏలాంటి షరతులు లేకుండా పది లక్షల వరకు బ్యాంకు రుణాలను మంజూరు చేయడంతో పాటు వికలాంగుల విద్యార్థులు చదువుకునేందుకు అన్ని నూతన జిల్లా కేంద్రాల్లోనూ వికలాంగుల హాస్టల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు .కస్తాల గ్రామ శాఖ నూతన అధ్యక్షుడు దోనాల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో సంఘం మండల అధ్యక్షుడు ఆకారపు వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు రాష్ట్ర మహిళా నాయకురాలు నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుడిపల్లి సుమతి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ప్రత్యేక ఆహ్వాని గోగుల శేఖర్ రెడ్డి జిల్లా నాయకురాలు గండేబోయిన అలివేలు చుండూరు మండలం మహిళా అధ్యక్షులు కూడా మహిళా అధ్యక్షురాలు కారింగు రేణుక సంఘం మండల ఉపాధ్యక్షులు పల్లేగోని రవి మండల యూత్ అధ్యక్షుడు బొమ్మరగోని శ్రీకాంత్ మునుగోడు మండల ఉపాధ్యక్షులు వంటేపాక ముత్తయ్య మండల కార్యదర్శి ఈదా పరమేష్ సంఘం నాయకులు గంటేకంపు రాజశేఖర్ రాజశేఖర్ బండారి ఆంజనేయులు సరిపెల్లి రాములు సరిపెల్లి బిక్షం గంజీ విజయ మేకల కలమ్మ బరిగెల యాదయ్య ఎర్రజల్లి ఈరమ్మ కట్ట కృష్ణయ్య జి సిద్దు కట్ట లింగయ్య సోపరి ఎల్లమ్మ ఎర్రజెల్లి లింగమ్మ బోల్లం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ అడుగులు - యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి

ప్రజలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ అడుగులు - యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చింతల రాజ్ వీర్.

సిద్దిపేట జిల్లా (29-01-2024):- నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ మాట్లాడుతూ నారాయణరావుపేట మండలంలో అలాగే జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పాతతరం నాయకులను, కొత్త తరం నాయకులను అనుసంధానం చేస్తూ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ, అలాగే నామినేటెడ్ పదవుల్లో ముఖ్యంగా శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవస్థానం కమిటీ, మార్కెట్ కమిటీ లాంటి నామినేటెడ్ పదవుల గురించి చర్చించి, ఎవరైతే ఇన్ని రోజులు పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేశారో, కష్టపడ్డారో వారికి సముచిత స్థానం అందిస్తాం అని తేలియజేయడం జరిగింది.అలాగే జక్కాపూర్ గ్రామంలో వ్యవసాయనికి సంబంధించిన నీళ్ల విషయం గురించి, , కొన్ని చెరువులను నింపడం, కొన్ని చెరువులకు చిన్న కాలువలను ఏర్పాటు చేయడం గురించి అలాగే ప్రదానంగా శనిగకుంటా ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయం గురించి కూడా చర్చించారు. శనిగకుంటా రోడ్డులో ఉన్న వైన్స్ & పర్మిట్ ల వల్ల ఆ ప్రాంత మహిళలకు, విద్యార్థులకు, ఆడ పిల్లలకు కొన్ని బాధలు ఉన్నాయి అని శనిగకుంటా ప్రజలు మా దృష్టికి తేవడం జరిగింది, వాటి గురించి కూడా చర్చించి ఆలోచిస్తామని చెప్పారు.అలాగే గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు - అక్రమ పట్టాలకు సంబంధించిన విషయాలును కూడా గత కొంత కాలంగా ప్రజలు మా దృష్టికి తీసుకస్తున్నారు, వాటిపై కూడా విపులంగా చర్చించడం జరిగింది.అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఆరు గ్యారంటీలను అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూసేందుకు కాంగ్రెస్ నాయకులు ముందుండలని తెలియజేయడం జరిగింది.అలాగే జక్కాపూర్ గ్రామానికి సంబందించిన మైనారిటీల కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది, వాటిపై కూడా విపులంగా చర్చించడం జరిగింది, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తాం.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, రాగుల అశోక్, తీగల భాస్కర్, బోయిని బాలయ్య, పల్లె పర్శరాములు, జక్కుల కనకయ్యా, సారుగు హరికృష్ణ, సారుగు కనకయ్యా, గొడుగు దేవయ్య, గుండెల్లి వేణు, బొడ్డు బల్ రాజు, ఎండి హైమద్.... తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగ.సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఏఓ కు వినతి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ SFI అద్వర్యం లో కలెక్టర్ ఎదుట AO రెహ్మాన్ కు వినతి

సిద్దిపేట జిల్లా:

సిద్దిపేట కలెక్టరేట్ :- తెలంగాణ రాష్టంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్,ఎఫ్,ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో AO రెహమాన్ కు వినతిపత్రాన్ని అందజేశారు . అనంతరం ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్ని రంగాల్లో విద్యారంగం వెనుకబడి ఉందన్నారు. ఈ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే గతంలోనే నిర్ణయం తీసున్నా నిర్ణయాలలో కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగులో ఉన్నాయన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు కెజీబివిలు, ఆశ్రమ పాఠశాలలు, కళాశాల వసతిగృహాలకు మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని ఎస్టీ డిపార్ట్మెంట్ కళాశాల వసతి గృహాలకు జూన్ నుండి. ఎస్సీ డిపార్ట్మెంట్ లో సెప్టెంబర్ నుండి మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు ఇప్పటికీ ఇవ్వలేదు. 2018 నాటి ధరలకనుగుణంగా ఇంకా పాత మెనూ అమలు అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎస్సి. మరియు బి.సి. హాస్టల్స్ కు ఇస్తున్న కాస్మోటిక్ ఛార్జీలు విద్యార్థులకు 65/- రుపాయాలు, విద్యార్ధినీలకు 100/- సరిపోవడం లేదని ఎస్టీ హాస్టల్స్ కు ఇస్తున్న అయిల్, సబ్బులు కూడా సరిపోడవం లేదు వీటిని పెంచి ఇవ్వాలని కోరారు. అద్దె భవనల్లో నడుస్తున్న గురుకులాలు, హాస్టల్స్, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలి. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుండి 7,200 కోట్లకు పైగా స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయాలి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలి. యూనివర్శీటీల మెస్ బకాయిలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతున్నామని తెలిపారు.

1. పెరిగిన ధరలకు అనుగుణంగా వసతిగృహాలకు, గురుకులాలకు, రెజిబివిలకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి.

2. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న వెన్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి.

3. హస్టల్స్ రీపేర్ భాధ్యత గురుకులాల తరహాలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు ఇచ్చి అన్నింటీని రిపేర్ చేయించాలి. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా అమలు జరిపేలా నిధులు ఇచ్చి ప్రేమెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ. 2000/- పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు రూ. 4000/- వృతి విద్యా, యూనివర్శీటీల పద్యార్థులకు నెలకు రూ. 5000/- అందించాలి 

6. పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్యాలర్ షిప్స్ మరియు ఫీజురీయంబర్స్ మెంట్స్ తక్షణమే విడుదల చేయాలి.

7. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలి.

8 అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని గురుకుల కేజీబీవీ లకు స్వంత హాస్టళ్లు నిర్మించాలని 

9 సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ, లా కాలేజి, ఇంజనీరింగ్ కాలేజి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు 

ఈ కార్యక్రమంలో SFI జిల్లా సహాయ కార్యదర్శి చెప్యాల సంతోష్, జిల్లా నాయకులు తడూరి భరత్, పెండ్యాల రఘు, దుంపటి సంతోష్, హరీష్, గుండె పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి - బిఆర్ఎస్ యూత్ వింగ్ మరియు ఏ టూ జెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా

దేశానికే ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి - బిఆర్ఎస్ యూత్ వింగ్ & ఏటుజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా.

 

- డైనింగ్ హాల్ నిర్మాణానికి శంకుస్థపన -

సిద్దిపేట జిల్లా:

(ములుగు) :- ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని టిఆర్ఎస్ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు జుబైర్ పాషా అన్నారు. బుధవారం ములుగు మండల పరిధిలోని అచ్చాయపల్లిలో రూ 7.5లక్షల గడా నిధులతో మంజూరైన డైనింగ్ హాల్ నిర్మాణానికి సర్పంచ్ రామచంద్రంతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ యాత్ వింగ్ & ఏటుజెడ్ చైర్మన్ జుబైర్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడి దూసుకుపోతుంటే ప్రతిపక్ష నాయకులు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.గత 60 వేళ్ళతో జరుగని అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఏనుగు సవ్యశ్రీ రాజేందర్ రెడ్డి,నాయకులు భాస్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

వాతావరణం సహకరించకపోవడంతో 5కే రన్ వాయిదా - గజ్వేల్ ఏసిపి రమేష్

వాతావరణం సహకరించకపోవడంతో 5కే రన్ వాయిదా - గజ్వేల్ ఏసిపి రమేష్

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్):- ఆరోగ్య గజ్వేల్ లో భాగంగా గజ్వేల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం తేదీ 20 నాడు నిర్వహించే 5కే రన్ ను వాతావరణం సహకరించనందున  వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగిందని తదుపరి తేది మళ్లీ తెలియపరుస్తామని ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని మీడియా ప్రకటనలో తెలిపిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్.