ఆర్టీసీ బస్సులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడమా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమా
ఆర్టీసీ బస్సులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడమా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమా
నల్గొండ జిల్లా:
[చుండూరు 29-01-2024]:-
ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడమో పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారే తేల్చుకోవాలని కస్తాల సభలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి పార్లమెంటు ఎన్నికల్లోపు పంచాయతీలో వికలాంగుల వాటా తేల్చకుంటే రేవంత్ రెడ్డి సర్కార్తో రాజీలేని పోరాటం కొనసాగిస్తామని గిద్దె రాజేష్ ఉద్ఘటన
ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడమో పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారే తేల్చుకోవాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు సోమవారం నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామంలో నిర్వహించిన సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మీన మేసాలు లెక్కిస్తుందని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోపూ 76 ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేయకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ పై పంచాయతీలో వికలాంగుల వాటా తెల్చేంతవరకు రాత్రిలేని పోరాటం కొనసాగిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ వచ్చే ఫిబ్రవరి నెల నుంచే 6 వేలు ఇవ్వాలని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన మాదిరిగానే రేవంత్ రెడ్డి సర్కార్ వికలాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన మాదిరిగా రాష్ట్రంలో 21 రకాల వికలాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్రంలో వికలాంగుల హక్కుల చట్టం 2016 ను సమర్ధవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి డిజిపి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి చట్టాన్ని అన్ని పోలీస్ స్టేషన్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆసరా పింఛన్ వచ్చే ప్రతి వికలాంగునికి అంతోదయ కార్డులను మంజూరు చేయడంతోపాటు 10 లక్షల రూపాయలతో వికలాంగులకు అణువుగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వ ప్రవేట్ కార్యాలయాల్లోనూ షాపింగ్ కాంప్లెక్స్ ల్లో వికలాంగులకు అణువుగా ర్యాంపులు నిర్మించాలని స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగుల అందరికీ ఏలాంటి షరతులు లేకుండా పది లక్షల వరకు బ్యాంకు రుణాలను మంజూరు చేయడంతో పాటు వికలాంగుల విద్యార్థులు చదువుకునేందుకు అన్ని నూతన జిల్లా కేంద్రాల్లోనూ వికలాంగుల హాస్టల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు .కస్తాల గ్రామ శాఖ నూతన అధ్యక్షుడు దోనాల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో సంఘం మండల అధ్యక్షుడు ఆకారపు వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు రాష్ట్ర మహిళా నాయకురాలు నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుడిపల్లి సుమతి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ప్రత్యేక ఆహ్వాని గోగుల శేఖర్ రెడ్డి జిల్లా నాయకురాలు గండేబోయిన అలివేలు చుండూరు మండలం మహిళా అధ్యక్షులు కూడా మహిళా అధ్యక్షురాలు కారింగు రేణుక సంఘం మండల ఉపాధ్యక్షులు పల్లేగోని రవి మండల యూత్ అధ్యక్షుడు బొమ్మరగోని శ్రీకాంత్ మునుగోడు మండల ఉపాధ్యక్షులు వంటేపాక ముత్తయ్య మండల కార్యదర్శి ఈదా పరమేష్ సంఘం నాయకులు గంటేకంపు రాజశేఖర్ రాజశేఖర్ బండారి ఆంజనేయులు సరిపెల్లి రాములు సరిపెల్లి బిక్షం గంజీ విజయ మేకల కలమ్మ బరిగెల యాదయ్య ఎర్రజల్లి ఈరమ్మ కట్ట కృష్ణయ్య జి సిద్దు కట్ట లింగయ్య సోపరి ఎల్లమ్మ ఎర్రజెల్లి లింగమ్మ బోల్లం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Jan 30 2024, 16:50