వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ, సర్పంచ్, వైస్ ఎంపీపీ..
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ , తదితరులు ‘యల్లనూరు’లో వైసీపీకి షాక్ *వైసీపీ మాజీ జడ్పీటీసీ టీడీపీలో* *చేరిక* *శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ కొత్తమిద్దె వెంకట రమణ, యల్లనూరు మాజీ సర్పంచ్ ఓబులేసు, వైస్ ఎంపీపీ సావిత్రి, వైస్ సర్పంచ్ సూర్య నారాయణతో పాటు వైసీపీకి చెందిన పలువురు నాయకులు, వారి అనుచరవర్గం శనివారం ఉరవకొండలో జరిగిన సభలో టీడీపీలో చేరారు*. చంద్రబాబునాయుడు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. KV రమణ 2019 ఎన్నికల్లో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపు కోసం కృషి చేశారు... యల్లనూరు మండలంలో కేతిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న రమణ వైసీపీ అన్నీ తానై వ్యవహరించారు... వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేతిరెడ్డి స్వలాభం చూసుకోవడంతో గత కొన్ని ఏళ్లుగా స్థబ్ధుగా ఉన్న రమణ నిన్నటి రోజున చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేశారు... వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీడియాకు తెలిపారు...
Jan 30 2024, 13:52