ప్రజలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ అడుగులు - యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రజలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ అడుగులు - యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చింతల రాజ్ వీర్.
సిద్దిపేట జిల్లా (29-01-2024):- నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ మాట్లాడుతూ నారాయణరావుపేట మండలంలో అలాగే జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పాతతరం నాయకులను, కొత్త తరం నాయకులను అనుసంధానం చేస్తూ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ, అలాగే నామినేటెడ్ పదవుల్లో ముఖ్యంగా శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవస్థానం కమిటీ, మార్కెట్ కమిటీ లాంటి నామినేటెడ్ పదవుల గురించి చర్చించి, ఎవరైతే ఇన్ని రోజులు పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేశారో, కష్టపడ్డారో వారికి సముచిత స్థానం అందిస్తాం అని తేలియజేయడం జరిగింది.అలాగే జక్కాపూర్ గ్రామంలో వ్యవసాయనికి సంబంధించిన నీళ్ల విషయం గురించి, , కొన్ని చెరువులను నింపడం, కొన్ని చెరువులకు చిన్న కాలువలను ఏర్పాటు చేయడం గురించి అలాగే ప్రదానంగా శనిగకుంటా ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయం గురించి కూడా చర్చించారు. శనిగకుంటా రోడ్డులో ఉన్న వైన్స్ & పర్మిట్ ల వల్ల ఆ ప్రాంత మహిళలకు, విద్యార్థులకు, ఆడ పిల్లలకు కొన్ని బాధలు ఉన్నాయి అని శనిగకుంటా ప్రజలు మా దృష్టికి తేవడం జరిగింది, వాటి గురించి కూడా చర్చించి ఆలోచిస్తామని చెప్పారు.అలాగే గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు - అక్రమ పట్టాలకు సంబంధించిన విషయాలును కూడా గత కొంత కాలంగా ప్రజలు మా దృష్టికి తీసుకస్తున్నారు, వాటిపై కూడా విపులంగా చర్చించడం జరిగింది.అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఆరు గ్యారంటీలను అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూసేందుకు కాంగ్రెస్ నాయకులు ముందుండలని తెలియజేయడం జరిగింది.అలాగే జక్కాపూర్ గ్రామానికి సంబందించిన మైనారిటీల కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది, వాటిపై కూడా విపులంగా చర్చించడం జరిగింది, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తాం.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, రాగుల అశోక్, తీగల భాస్కర్, బోయిని బాలయ్య, పల్లె పర్శరాములు, జక్కుల కనకయ్యా, సారుగు హరికృష్ణ, సారుగు కనకయ్యా, గొడుగు దేవయ్య, గుండెల్లి వేణు, బొడ్డు బల్ రాజు, ఎండి హైమద్.... తదితరులు పాల్గొన్నారు.
Jan 29 2024, 22:15