ప్రజలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ అడుగులు - యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి

ప్రజలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ అడుగులు - యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చింతల రాజ్ వీర్.

సిద్దిపేట జిల్లా (29-01-2024):- నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ మాట్లాడుతూ నారాయణరావుపేట మండలంలో అలాగే జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పాతతరం నాయకులను, కొత్త తరం నాయకులను అనుసంధానం చేస్తూ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ, అలాగే నామినేటెడ్ పదవుల్లో ముఖ్యంగా శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవస్థానం కమిటీ, మార్కెట్ కమిటీ లాంటి నామినేటెడ్ పదవుల గురించి చర్చించి, ఎవరైతే ఇన్ని రోజులు పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేశారో, కష్టపడ్డారో వారికి సముచిత స్థానం అందిస్తాం అని తేలియజేయడం జరిగింది.అలాగే జక్కాపూర్ గ్రామంలో వ్యవసాయనికి సంబంధించిన నీళ్ల విషయం గురించి, , కొన్ని చెరువులను నింపడం, కొన్ని చెరువులకు చిన్న కాలువలను ఏర్పాటు చేయడం గురించి అలాగే ప్రదానంగా శనిగకుంటా ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయం గురించి కూడా చర్చించారు. శనిగకుంటా రోడ్డులో ఉన్న వైన్స్ & పర్మిట్ ల వల్ల ఆ ప్రాంత మహిళలకు, విద్యార్థులకు, ఆడ పిల్లలకు కొన్ని బాధలు ఉన్నాయి అని శనిగకుంటా ప్రజలు మా దృష్టికి తేవడం జరిగింది, వాటి గురించి కూడా చర్చించి ఆలోచిస్తామని చెప్పారు.అలాగే గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు - అక్రమ పట్టాలకు సంబంధించిన విషయాలును కూడా గత కొంత కాలంగా ప్రజలు మా దృష్టికి తీసుకస్తున్నారు, వాటిపై కూడా విపులంగా చర్చించడం జరిగింది.అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఆరు గ్యారంటీలను అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూసేందుకు కాంగ్రెస్ నాయకులు ముందుండలని తెలియజేయడం జరిగింది.అలాగే జక్కాపూర్ గ్రామానికి సంబందించిన మైనారిటీల కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది, వాటిపై కూడా విపులంగా చర్చించడం జరిగింది, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తాం.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, రాగుల అశోక్, తీగల భాస్కర్, బోయిని బాలయ్య, పల్లె పర్శరాములు, జక్కుల కనకయ్యా, సారుగు హరికృష్ణ, సారుగు కనకయ్యా, గొడుగు దేవయ్య, గుండెల్లి వేణు, బొడ్డు బల్ రాజు, ఎండి హైమద్.... తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగ.సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఏఓ కు వినతి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ SFI అద్వర్యం లో కలెక్టర్ ఎదుట AO రెహ్మాన్ కు వినతి

సిద్దిపేట జిల్లా:

సిద్దిపేట కలెక్టరేట్ :- తెలంగాణ రాష్టంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్,ఎఫ్,ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో AO రెహమాన్ కు వినతిపత్రాన్ని అందజేశారు . అనంతరం ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్ని రంగాల్లో విద్యారంగం వెనుకబడి ఉందన్నారు. ఈ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే గతంలోనే నిర్ణయం తీసున్నా నిర్ణయాలలో కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగులో ఉన్నాయన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు కెజీబివిలు, ఆశ్రమ పాఠశాలలు, కళాశాల వసతిగృహాలకు మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని ఎస్టీ డిపార్ట్మెంట్ కళాశాల వసతి గృహాలకు జూన్ నుండి. ఎస్సీ డిపార్ట్మెంట్ లో సెప్టెంబర్ నుండి మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు ఇప్పటికీ ఇవ్వలేదు. 2018 నాటి ధరలకనుగుణంగా ఇంకా పాత మెనూ అమలు అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎస్సి. మరియు బి.సి. హాస్టల్స్ కు ఇస్తున్న కాస్మోటిక్ ఛార్జీలు విద్యార్థులకు 65/- రుపాయాలు, విద్యార్ధినీలకు 100/- సరిపోవడం లేదని ఎస్టీ హాస్టల్స్ కు ఇస్తున్న అయిల్, సబ్బులు కూడా సరిపోడవం లేదు వీటిని పెంచి ఇవ్వాలని కోరారు. అద్దె భవనల్లో నడుస్తున్న గురుకులాలు, హాస్టల్స్, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలి. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుండి 7,200 కోట్లకు పైగా స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయాలి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలి. యూనివర్శీటీల మెస్ బకాయిలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతున్నామని తెలిపారు.

1. పెరిగిన ధరలకు అనుగుణంగా వసతిగృహాలకు, గురుకులాలకు, రెజిబివిలకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి.

2. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న వెన్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి.

3. హస్టల్స్ రీపేర్ భాధ్యత గురుకులాల తరహాలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు ఇచ్చి అన్నింటీని రిపేర్ చేయించాలి. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా అమలు జరిపేలా నిధులు ఇచ్చి ప్రేమెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ. 2000/- పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు రూ. 4000/- వృతి విద్యా, యూనివర్శీటీల పద్యార్థులకు నెలకు రూ. 5000/- అందించాలి 

6. పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్యాలర్ షిప్స్ మరియు ఫీజురీయంబర్స్ మెంట్స్ తక్షణమే విడుదల చేయాలి.

7. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలి.

8 అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని గురుకుల కేజీబీవీ లకు స్వంత హాస్టళ్లు నిర్మించాలని 

9 సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ, లా కాలేజి, ఇంజనీరింగ్ కాలేజి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు 

ఈ కార్యక్రమంలో SFI జిల్లా సహాయ కార్యదర్శి చెప్యాల సంతోష్, జిల్లా నాయకులు తడూరి భరత్, పెండ్యాల రఘు, దుంపటి సంతోష్, హరీష్, గుండె పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి - బిఆర్ఎస్ యూత్ వింగ్ మరియు ఏ టూ జెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా

దేశానికే ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి - బిఆర్ఎస్ యూత్ వింగ్ & ఏటుజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా.

 

- డైనింగ్ హాల్ నిర్మాణానికి శంకుస్థపన -

సిద్దిపేట జిల్లా:

(ములుగు) :- ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని టిఆర్ఎస్ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు జుబైర్ పాషా అన్నారు. బుధవారం ములుగు మండల పరిధిలోని అచ్చాయపల్లిలో రూ 7.5లక్షల గడా నిధులతో మంజూరైన డైనింగ్ హాల్ నిర్మాణానికి సర్పంచ్ రామచంద్రంతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ యాత్ వింగ్ & ఏటుజెడ్ చైర్మన్ జుబైర్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడి దూసుకుపోతుంటే ప్రతిపక్ష నాయకులు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.గత 60 వేళ్ళతో జరుగని అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఏనుగు సవ్యశ్రీ రాజేందర్ రెడ్డి,నాయకులు భాస్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

వాతావరణం సహకరించకపోవడంతో 5కే రన్ వాయిదా - గజ్వేల్ ఏసిపి రమేష్

వాతావరణం సహకరించకపోవడంతో 5కే రన్ వాయిదా - గజ్వేల్ ఏసిపి రమేష్

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్):- ఆరోగ్య గజ్వేల్ లో భాగంగా గజ్వేల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం తేదీ 20 నాడు నిర్వహించే 5కే రన్ ను వాతావరణం సహకరించనందున  వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగిందని తదుపరి తేది మళ్లీ తెలియపరుస్తామని ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని మీడియా ప్రకటనలో తెలిపిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్.

భారీ వర్షాల దృశ్య నియోజకవర్గ రైతులు అప్రమత్తంగా ఉండాలి - సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ అక్రమ్

భారీ వర్షాల దృశ్య నియోజకవర్గ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి - సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ 

(గజ్వేల్):- హైదరాబాద్ వాతావరణ శాఖ వారు చెప్పిన సమాచారం ప్రకారం 24 గంటలలో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృశ్య సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ అక్రమ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ మన సిద్దిపేట జిల్లా మరియు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎట్టిపరిస్థితుల్లోనూ లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదు, విద్యుత్ స్తంభాలను తాకవద్దని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోకుండా వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని,రైతులు కూడా తమ తమ వ్యవసాయ పనులు త్వరగా ముగించుకుని తమతమ ఇండ్లకు చేరుకుని ఇంటివద్దనే ఉండాలని కోరారు.మన జిల్లా లో భారీ వర్ష సూచన ఉన్నందున నియోజకవర్గ ప్రజలు రైతులు అప్రమతంగా ఉండాలని,అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ అక్రమ్ తెలిపారు.

రామ నామము విశ్వజనీయమైనది - గజ్వేల్ ఎసిపి రమేష్


రామనామాన్ని విస్తరింప జేస్తున్న రామకోటి రామరాజు అభినందనీయుడు

(గజ్వేల్ ) :- సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ కృష్ణ దేవాలయం వద్ద గల రామాలయం ప్రాంగణం లో సోమవారం రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు భద్రాచలం నుండి తీసుకు వచ్చిన కోటి గోటి తలంబ్రాలు గజ్వేల్ చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ రమేష్ ముందుగా శ్రీ కృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారాముల కళ్యాణం లో ఉపయోగించిన గోటితో ఒలిచిన తలంబ్రాలను శ్రీ కృష్ణ ఆలయం కమిటీకి రామకోటి రామరాజు తో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఎసిపి రమేష్ మాట్లాడుతూ రామ నామం విశ్వజనీయమైనదని, రామ తత్వం అనుసరణీయమైనదని గజ్వేల్ లో రామకోటి రామరాజు ప్రజలకు రామనామాన్ని చేరువ చేస్తూ పండితుల నుండి పామరుల వరకు రామకోటి నామాన్ని లిఖింప జేస్తు, సీతారాముల కళ్యాణం కోసం దాదాపు నెల రోజులు ఈ ప్రాంతంలో వడ్లని గోటితో వలచి భద్రాచలానికి పంపించడం, మళ్లీ భద్రాచలం నుండి తలంబ్రాలు తీసుకువచ్చి ఇక్కడ భక్తులకు అందజేసే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన రామకోటి రామరాజు అభినందనీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నరేష్ బాబు,శ్రీ కృష్ణ దేవాలయం కమిటీ అధ్యక్షులు, ఎలగందుల రామచంద్రం, ఉప్పల వెంకటేశం, శివ కుమార్, మెట్ రాములు, ధార రామచంద్రం, బండి వెంకట్ నర్సయ్య, అత్తెల్లి లక్ష్మయ్య,శ్రీనివాస్,ఆంజనేయులు, కనకచారి,కృష్ణ, తదితరులు పాల్గొన్నారు

ప్రజాస్వామ్యం లో ప్రాముఖ్యత


రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాగ్మారే అభిషేక్

ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి ఆ దేశాలలో ఏ దేశం లేదా పేరు కీర్తించబడుతుందో ఆ దేశం లేదా ఆ దేశం మన దేశం భారతదేశం. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అధిక జనాభా ఉన్నప్పటికీ మన దేశ పాలన ప్రజాస్వామ్య సూత్రాలపై నడుస్తుంది. అందుకే భారతదేశానికి ప్రత్యేక ఉంది? ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తే ప్రజాప్రతినిధులు సమస్యలు ఇచ్చే ఓటు ఆధారంగానే ఎన్నికవుతారు. అధికారం ఎవరి చేతుల్లోకి వస్తుందో ఓటింగ్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనం ప్రజా సమయంలో ఓటు యొక్క ప్రాముఖ్యత చర్చిస్తాము. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రత్యేకం పెద్దల వద్ద కూడా అధికారంలోకి రావడానికి ఆయుధం ఉంది. అహంకార నాయకులకు అధికారం నుంచి దిగిపోవడానికి ఆయుధం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే రహస్యం ఓటు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యం. పదం నుండి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి ప్రశ్న మనకెప్పుడైనా వచ్చిందా. ఓటు అనే భావన ఎలా వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజల చేత నడిచే ప్రభుత్వం. ప్రజాస్వామ్యం యొక్క ఈ నిర్వచనం ప్రకారం మనమందరం మన వ్యవస్థను మరియు పరిపాలనను నిర్వహించడానికి కొంతమంది వ్యక్తులకు లేదా వ్యక్తులకు బాధ్యతలను అప్పగించడమే ప్రజాస్వామ్యం. మరియు ఈ బాధ్యతను ఎవరు సరిగా నిర్వహించగలరు అంచనా వేయడానికి పోలింగ్ అవసరం. ఓటు వేస్తున్నారు. ఎప్పుడు ఎవరికి సేవ చేసే అవకాశం ఇవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే ఓటరు లేదా ఓటరు ప్రత్యేక ఉంది. అందుకే ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాముఖ్యత ఉంది. భారతదేశ పౌరుడు మరియు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. వ్యక్తి ఇచ్చే ఓటు ఒకటే ఆయన ఒక్క ఓటుతో మన దేశాన్ని ఎవరు నడిపిస్తారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారు... కానీ అంత మందిలో అవగాహన కల్పించడం లేదు. చాలామంది పోలింగ్ రోజును సరదాగా గడిపేందుకు సెలవు దినంగా వినియోగించుకుంటున్నారు. ఇది మన దేశం మరియు మన ప్రజాస్వామ్యం యొక్క దౌర్భాగ్యం. అలా అయితే దేశాన్ని నడవడానికి సమర్ధులైన వ్యక్తులకు అది ఎలా సహాయపడుతుంది. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా. ప్రజాస్వామ్యంలో ఓటుకు అంత ప్రధాన్యం ఉన్నప్పటికీ చాలా ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే 60 శాతానికి మించి రావడం లేదు. మన ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా పటిష్టంగా మార్చుకోవాలంటే వంద శాతం ఓటింగ్ అనేది ఎప్పుడు అవశ్యకంగా మారింది. ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో... ఎవరి చేతులలో ఉంటుందో ఓటర్ల చేతిలోనే ఉంది. అందుకు ఓటింగ్ శాతాన్ని పెంచడం చాలా ముఖ్యం. ఓటు వేయడం మన బాధ్యత. అది మన ప్రాథమిక కర్తవ్యం. అలాంటి పాత్రాలను మనం తీసుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యం పటిష్టం దిశగా పయనిస్తొందని చెప్పవచ్చు. ఒక మాటలు చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఓటు తప్పనిసరి నేడు మన దేశంలో లేదా మన తెలంగాణ రాష్ట్రంలో మనం అనుభావిస్తున్న పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మీరు ఓటేసిన పార్టీ ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే. మన ప్రజాస్వామ్యం ఎలా కొనసాగుతుంది? ఎదిరించిన వారే కలసి అధికారం లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే... రాజకీయాలలో తత్వం ఎక్కడ మిగులుతుంది... ఇలా ఉండకూడదు దీనికోసం ఓటేసేటప్పుడు చాలా ఆలోచించి. మన అభిప్రాయమే ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాం... ప్రజాస్వామ్యంలో ఓటు పాత్ర ఇదే కావాలి. ఎవరు చెప్పినట్లు అలాంటివాడికి నేనెందుకు ఓటేశాను. అప్పుడు అతను నా సంబంధం. ఈ పాత్రతో ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే ఉంటుంది. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెయ్యాలి. నేడు ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాముఖ్యతపై ఈ తెలుగు వ్యాసం నీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. ప్రస్తుతం రాజకీయాలలో తలెత్తిన ఆస్థిరత అందుకే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యం. దీని గురించి మీకు ఒక ఆలోచన ఇవ్వడానికి ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాముఖ్యత

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాగ్మారే అభిషేక్ ఫోన్ నెంబర్ 8688652941

గోమాసే శ్రీనివాస్ పై దాడిని ఖండించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్


గవ్వల శ్రీకాంత్

Street Buzz news తెలంగాణ రాష్ట్రం:

(కరీంనగర్ జిల్లా):- దళిత బహుజన నాయకులు నేతకాని మహర్ జాతీయ ఆధ్యక్షులు అణగారిన కులాల ఐక్య వేదిక జాతీయ ఆధ్యక్షులు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోమాసే శ్రీనివాస్ పై దాడి చేయడం చాల దురదృష్టకరమని గవ్వల శ్రీకాంత్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఏదైన సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కాని దాడులు చేయడం ఏమిటని ఇది ప్రజాస్వామ్యామ లేకుంటే రౌడీల రాజ్యమా అని ప్రశ్నించారు. బహిరంగంగా గోమాసే శ్రీనివాస్ గారికి క్షేమాపణలు చెప్పాలని తెలంగాణ ఎస్ సి, ఎస్ టి, బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ జాతీయ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

బహుజన రాజ్యంలోనే అభివృద్ధి సాధ్యం


 _మతోన్మాద బిజెపి మద్దతిచ్చే బీఆర్ఎస్ లను గద్దెదింపుతాం_

 _వంచిత్ బహుజన అఘాడి రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయ్ కుమార్_

Street Buzz news జగిత్యాల:

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరికి మేలు జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్న బహుజన రాజ్యంలోనే సాధ్యమవుతుందని వంచిత్ బహుజన అఘాడి రాష్ట్ర కో ఆర్డినేటర్ డా,, బండి విజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో బహుజనులు ఎక్కువగా ఉన్నారని ఏండ్లు గడుస్తున్నా బహుజనుల్లో అభివృద్ధి లేదన్నారు. బహుజనుల ప్రయోజనాలకోసం అంబేద్కర్ కుటుంబ పార్టీ అవసరం ఇక్కడ ఉందని గుర్తించారన్నారు. మహారాష్ట్రలో శివసేన ఉద్దోవ్ తక్రితో పొత్తు కొనసాగిస్తున్నామని తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. దాదాపు 60 సీట్లలో విబిఏ అభ్యర్యులు బరిలో ఉంటారన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోందని రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెప్పే బి.ఆర్.ఎస్. మతోన్మాదాన్ని అనచిన దాఖలాలు లేవన్నారు. త్వరలో నిజాం గ్రౌండ్ లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి బహుజనుల్లో ఐక్యతను చాటుతమన్నారు. రాష్ట్రంలో దేశంలో బడుగు, బలహీన మైనార్టీ, షెడ్యూల్ కులాలను కేవలం ఓటు బ్యాంకుగా, చిన్న పతకాలకు లబ్ధిదారులుగా ప్రభుత్వాలు మార్చుతున్నాయని విజయ్ కుమార్ అన్నారు. ఆచరణలో ఎక్కడను అంబేద్కర్ విధానాలు అమలు కావడం లేదని దేశంలో, రాష్ట్రంలో పరిపాలనలో ముఖ్యమైన పోస్టుల్లో దళిత ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టింగులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 ఏండ్ల కాలంలో దళితులు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారని, దళితులకు 3 ఎకరాల భూమి భూటకమన్నారు. అగ్రకుల ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు ఇస్తూ దళితబందుకు నిధుల కొరత పెట్టారన్నారు. ఎస్సి, ఎస్టీ చట్టం నిర్వీర్యం అయ్యిందని, ఎస్సి కార్పొరేషన్ బిసి కార్పొరేషన్ ట్రైబల్ వేల్పర్ ఉనికి కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు లేవన్నారు. రాష్ట్రం తీరు ఇలావుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తూ మనుధర్మ శాస్త్రం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో రిజర్వేషన్లు లేకుండా చేస్తూ బడుగు, బలహీన, దళిత, మైనార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాలని చేస్తోందన్నారు. ఉన్న పరిశ్రమలను మూసివేసి నిరుద్యోగన్ని పెంక్సహిపోచిస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతు మనువాదుల గర్శలు నింపుకుంటున్నారని ప్రవేట్ పరం చేయడం వలన బిసి లకు ఎస్ సి లకు ఎస్ టి లకు రిజర్వేషన్ లేకుండ చేసిందన్నారు మనువాద పార్టీలను గద్దె దించడం బాబాసాహెబ్ అంబేడ్కర్ కుటుంభంతోనే సాధ్యమవుతుందని వంచిత్ బహుజన్ అఘాడి పార్టీని బలోపేతం చేయాలని వంచిత్ బహుజన్ అఘాడి రాష్ట్ర కో ఆర్డినేటర్ డా,, బండి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ గవ్వల శ్రీకాంత్, జగిత్యాల నియోజకవర్గ ఆధ్యక్షులు తీగల శేఖర్, పట్టణ ఆధ్యక్షులు దాసరి వెంకటి, జిల్లా నాయకులు జే భూమ్ రాజ్, కే మహేందర్ తదితరులు పాల్గొన్నారు

కేసీఆర్ రాక్షస పాలనలో మనుషులను కుక్కలు పీక్కుతింటున్నాయి - రేవంత్ రెడ్డి

Street Buzz news తెలంగాణ రాష్ట్రం:

మ‌నుషుల‌ను వీధికుక్కలు పీక్కుతినే స్థాయి అధ్వాన పాల‌న రాష్ట్రంలో కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజ‌మెత్తారు. ఐదేళ్ల చిన్నారిని హైద‌రాబాద్‌లో కుక్కలు క‌రిచి చంపేస్తే కుక్కలకు ఆకలేసింద‌ని అక్కడి మేయ‌ర్ చెప్పడం సిగ్గుచేట‌న్నారు. ఈ ప్రభుత్వానికి మాన‌వ‌త్వం లేద‌ని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారన్నారు. బాధిత కుటుంబానికి న‌ష్ట ప‌రిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకున్న ఘ‌నత ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి ద‌క్కింద‌న‌నారు. బాధిత కుటుంబంపై కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇద‌ని దుయ్యబ‌ట్టారు. కేటీఆర్ భూపాలపల్లి పర్యటనకుముందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 14వ రోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండ‌లంలోని కోటంచ‌లోని ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి ఆల‌యంలో స్వామి వారిని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సీత‌క్క, నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర స‌త్యనారాయ‌ణ‌ రావుతో క‌లిసి ద‌ర్శించుకున్నారు. అనంత‌రం రేవంత్ రెడ్డి ఆల‌యం ఎదుట విలేక‌రుల‌తో మాట్లాడారు. న‌క్సలైట్లు ఎర్రజెండాలు పాతి పేద‌ల‌కు పంచి పెట్టిన భూముల‌ను మ‌ళ్లీ గండ్ర ర‌మ‌ణారెడ్డి ఆక్రమించుకుంటున్నాడ‌ని ఆరోపించారు. దోపిడీకి ధ‌ర‌ణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని వంద‌ల ఎక‌రాలను ఆక్రమించుకుంటున్నారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో పాల‌కుర్తికి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, భూపాల‌ప‌ల్లికి ర‌మ‌ణారెడ్డిని, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యే విన‌య్‌ భాస్కర్‌ను, వ‌రంగ‌ల్ తూర్పుకు న‌న్నపునేని న‌రేంద‌ర్‌ల‌ను సామంత రాజులుగా నియ‌మించుకుని మంత్రి కేటీఆర్ దోపిడీకి పాల్పడుతున్నాడ‌ని ధ్వజ‌మెత్తారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో బీఆర్ఎస్ నేత‌లు గుండాలుగా మారిపోయార‌న్నారు. ప్రజ‌ల ఆస్తుల‌కు, భూముల‌కు ర‌క్షణ లేకుండాపోయింద‌ని అన్నారు. భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర గండ్ర వెంక‌ట‌ ర‌మ‌ణారెడ్డి భూముల ఆక్రమణ‌ల‌పై విచారణకు డ్రామారావు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి స‌వాల్ విసిరారు. ఎమ్మెల్యే గండ్ర ర‌మ‌ణారెడ్డి చేస్తున్న దందాలు, అక్రమాలు, భూ ఆక్రమ‌ణ‌ల్లో కేటీఆర్‌కు వాటాలు లేకుంటే.. విచారణకు అదేశించాల‌ని డిమాండ్ చేశారు. గండ్ర ర‌మ‌ణారెడ్డి చేస్తున్న దందాల్లో, అక్రమాల్లో కేటీఆర్‌కు భాగ‌స్వామ్యం ఉంద‌ని నిరూపించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాను బీఆర్ఎస్ గుండాలు ఆక్రమించుకున్నారని అన్నారు. పార్టీ ఫిరాయించిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదని, సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దివాలకోరు రాజకీయాలు చేస్తున్నాడ‌ని మండిపడ్డారు.  అనంత‌రం చిట్యాల మండ‌లం చ‌ల్లగ‌రిగేకు వాహ‌నంలో చేరుకున్న రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో గ్రామానికి చెందిన‌ ప‌లువురు బీఆర్ఎస్‌కు చెందిన నాయ‌కులు, కార్యక‌ర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. అనంత‌రం ఇదే మండ‌లంలోని తిరుమలాపూర్ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు రూ. 5 లక్షల రూపాయలను కేటాయిస్తామని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, మహిళలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామని, రూ. 500 లకే వంట గ్యాస్ ను అందిస్తామని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, మొగుళ్లపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీల రాజు కురుమ, నాయకులు మండ రవీందర్ గౌడ్, క్యాతరాజు రమేష్, నీరటి మహేందర్, నడిగోటి రాము, ఎండి రఫీ, బండారి కుమారస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.