విద్యారంగ.సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఏఓ కు వినతి
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ SFI అద్వర్యం లో కలెక్టర్ ఎదుట AO రెహ్మాన్ కు వినతి
సిద్దిపేట జిల్లా:
సిద్దిపేట కలెక్టరేట్ :- తెలంగాణ రాష్టంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్,ఎఫ్,ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో AO రెహమాన్ కు వినతిపత్రాన్ని అందజేశారు . అనంతరం ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్ని రంగాల్లో విద్యారంగం వెనుకబడి ఉందన్నారు. ఈ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే గతంలోనే నిర్ణయం తీసున్నా నిర్ణయాలలో కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగులో ఉన్నాయన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు కెజీబివిలు, ఆశ్రమ పాఠశాలలు, కళాశాల వసతిగృహాలకు మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని ఎస్టీ డిపార్ట్మెంట్ కళాశాల వసతి గృహాలకు జూన్ నుండి. ఎస్సీ డిపార్ట్మెంట్ లో సెప్టెంబర్ నుండి మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు ఇప్పటికీ ఇవ్వలేదు. 2018 నాటి ధరలకనుగుణంగా ఇంకా పాత మెనూ అమలు అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎస్సి. మరియు బి.సి. హాస్టల్స్ కు ఇస్తున్న కాస్మోటిక్ ఛార్జీలు విద్యార్థులకు 65/- రుపాయాలు, విద్యార్ధినీలకు 100/- సరిపోవడం లేదని ఎస్టీ హాస్టల్స్ కు ఇస్తున్న అయిల్, సబ్బులు కూడా సరిపోడవం లేదు వీటిని పెంచి ఇవ్వాలని కోరారు. అద్దె భవనల్లో నడుస్తున్న గురుకులాలు, హాస్టల్స్, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలి. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుండి 7,200 కోట్లకు పైగా స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయాలి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలి. యూనివర్శీటీల మెస్ బకాయిలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతున్నామని తెలిపారు.
1. పెరిగిన ధరలకు అనుగుణంగా వసతిగృహాలకు, గురుకులాలకు, రెజిబివిలకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి.
2. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న వెన్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి.
3. హస్టల్స్ రీపేర్ భాధ్యత గురుకులాల తరహాలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు ఇచ్చి అన్నింటీని రిపేర్ చేయించాలి. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా అమలు జరిపేలా నిధులు ఇచ్చి ప్రేమెట్రిక్ విద్యార్థులకు నెలకు రూ. 2000/- పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు రూ. 4000/- వృతి విద్యా, యూనివర్శీటీల పద్యార్థులకు నెలకు రూ. 5000/- అందించాలి
6. పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్యాలర్ షిప్స్ మరియు ఫీజురీయంబర్స్ మెంట్స్ తక్షణమే విడుదల చేయాలి.
7. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలి.
8 అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని గురుకుల కేజీబీవీ లకు స్వంత హాస్టళ్లు నిర్మించాలని
9 సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ, లా కాలేజి, ఇంజనీరింగ్ కాలేజి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో SFI జిల్లా సహాయ కార్యదర్శి చెప్యాల సంతోష్, జిల్లా నాయకులు తడూరి భరత్, పెండ్యాల రఘు, దుంపటి సంతోష్, హరీష్, గుండె పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Jan 29 2024, 20:42