చంద్రబాబు నెల్లూరు పర్యటనకు బయలుదేరిన సందర్బంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర కార్యదర్శి శింగనమల దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు

రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన ముగించుకొని నెల్లూరు పర్యటనకు బయలుదేరిన సందర్బంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర కార్యదర్శి శింగనమల దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు..

కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి..
కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి! పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవష్యత్తుకు గ్యారంటీ'కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జి కన్నా లక్ష్మీనారాయణపై ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి దిగారు. పథకం ప్రకారం లైట్లు ఆర్పివేసి భవనాలపై నుంచి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక సమావేశం..

స్థానిక జిల్లా సబ్ జైళ్ల ఆపీసు ఆవరణం లో అనంతపురం జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది ఈ కార్యక్రమం లో శ్రీ ఫరూక్ అలీ ఖాన్ గారు శ్రీ ఫాజుళక్ గారు కొండప్ప గారు మరియు జిల్లా జైలు పర్యవేక్షణ అధికారి శ్రీ రహమాన్ గారు శ్రీ పక్కిరప్ప గారు శ్రీ రామ సుబ్బయ్య గారు రవీంద్ర కుమార్ గారు పాల్గొన్నారు

భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక..

బుక్కరాయసముద్రం మండలం దండువారి పల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక . జరిగింది శాఖ కాలనీ సెక్రటరీగా ఎట్టి కృష్ణమూర్తి. బీసీ కాలనీ సెక్రటరీగా తలారి రంగయ్య ఎంపిక చేయడం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో సిపిఐ పార్టీ చేసిన సేవలు దండువారి పల్లి కి అనేకంగా సేవలందించడం జరిగింది ప్రజల సమస్యల మీద సిపిఐ పార్టీగా ముందుండి ప్రజల సమస్యలను తీర్చడంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారుడు పూజారి కిష్ట మండల కార్యవర్గ సభ్యులు సాకే రాజకుల్లాయప్ప మండల రైతు సంఘం కార్యదర్శి సాకే భాస్కర్ రంగనాయకులు. బ్యాంకుఅంజి సూర్యనారాయణ. పూజారి రామకృష్ణ.హీరు నాయక్ భాష చాకలి రాము మహిళలు తదితరులు పాల్గొన్నారు

అనంతపురము లో ఉన్న రేవతి పర్టిలైజర్స్ లైసెన్స్ రద్దు చేసి.. నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్షరూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి.. ఎపి రైతుసంఘం డిమాండ్..

నాసిరకం కళింగర విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎకరాకు లక్షరూపాయలు పరిహారం ఇవ్వాలి ---ఎపి రైతుసంఘం డిమాండ్ నార్పలమండలం బండ్లపల్లి గ్రామంలో నాసిరకం కళింగర విత్తనాలతో దిగుబడిరాక నష్టపోయిన రైతులతో కలిసి ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి పోలాలు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బండ్లపల్లి గ్రామంలో 10 మంది రైతులు 25 ఎకరాలలో అప్పులు చేసి అనంతపురములో ఉన్న రేవతి పర్టిలైజర్స్ షాపులో కళింగర విత్తనాలు తెచ్చుకొని పంటలు సాగు చేశారు నార్పల మండలంలో ఉన్న పర్టిలైజర్స్ షాపులలో పురుగుమందులు అప్పు తెచ్చి పిచికారి చేశారు 60రోజులలో పంట కోతకు రావాలి 80 రోజులు దాటినా దిగుబడి రాకపోవడం వచ్చిన కొంత మేర కాయలు నాణ్యత లేక పోవడంతో రైతులు విత్తనాలు నాణ్యత లేకపోవడంతో మనం త్రీవంగా నష్టపోయామని దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పొలాలు పరిశీలించి మీకు ఇచ్చిన రేవతి పర్టిలైజర్స్ వారు నాసిరకం కళింగర విత్తనాలతో దిగుబడి రాలేదు అని చెప్పారు దీంతో దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉంది. ఎకరాకు లక్షరూపాయలు పెట్టుబడి పెడితే ఎకరాకు 20 టన్నులు పైగా దిగుబడి రావాలసిఉంటే కనీసం 2నుండి 5 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో అని దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఉన్నారు. కావున వ్యవసాయ ఉద్యానశాఖ అధికారులు నాసిరకం , ఎక్స్ ఫైర్ అయిన విత్తనాలు అమ్మిన అనంతపురము లో ఉన్న రేవతి పర్టిలైజర్స్ లైసెన్స్ రద్దు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్షరూపాయలు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాధిత రైతులు వెంకటనారాయణ రెడ్డి మల్లేశ్వరమ్మ లక్ష్మినారాయణ మధుసూధన్ రెడ్డి మల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ, సర్పంచ్, వైస్ ఎంపీపీ..

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ , తదితరులు ‘యల్లనూరు’లో వైసీపీకి షాక్ *వైసీపీ మాజీ జడ్పీటీసీ టీడీపీలో* *చేరిక* *శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ కొత్తమిద్దె వెంకట రమణ, యల్లనూరు మాజీ సర్పంచ్ ఓబులేసు, వైస్ ఎంపీపీ సావిత్రి, వైస్ సర్పంచ్ సూర్య నారాయణతో పాటు వైసీపీకి చెందిన పలువురు నాయకులు, వారి అనుచరవర్గం శనివారం ఉరవకొండలో జరిగిన సభలో టీడీపీలో చేరారు*. చంద్రబాబునాయుడు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. KV రమణ 2019 ఎన్నికల్లో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపు కోసం కృషి చేశారు... యల్లనూరు మండలంలో కేతిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న రమణ వైసీపీ అన్నీ తానై వ్యవహరించారు... వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేతిరెడ్డి స్వలాభం చూసుకోవడంతో గత కొన్ని ఏళ్లుగా స్థబ్ధుగా ఉన్న రమణ నిన్నటి రోజున చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేశారు... వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీడియాకు తెలిపారు...

శ్రీనారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసి ఘన స్వాగతం పలికిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు

ఉరవకొండ బహిరంగ సభలో టీడీపి అధినేత "నారా చంద్రబాబునాయుడు" గారిని గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసి ఘన స్వాగతం పలికిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు.

శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని గౌరవపూర్వకంగా కలసి ఘనంగా సత్కరించిన టిడిపి SC సెల్ అధ్యక్షులు MSరాజు,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు..

ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రా.. కదలిరా. బహిరంగ సభలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని గౌరవపూర్వకంగా కలసిన ఘనంగా సత్కరించి స్వాగతం పలికిన టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు MSరాజు మరియు సింగనమల నియోజకవర్గం టిడిపి ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు.. అనంతరం జిల్లా తెదేపా నేతలతో కలిసి రా.. కదలిరా.. బహిరంగ సభలో పాల్గొన్న MSరాజు గారు, ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు

జెసిఎస్ మండల కన్వీనర్ పసులూరు బయప రెడ్డి గారి తండ్రిని హాస్పిటల్ కి వెళ్లి పమర్శించిన జడ్పిటిసి నీలం భాస్కర్ మండల ఇన్చార్జ్ ఆలూరు రమణారెడ్డి..

బుక్కరాయసముద్రం జెసిఎస్ మండల కన్వీనర్ పసులూరు బయప రెడ్డి గారి తండ్రి నారాయణ రెడ్డి గారు.. అనారోగ్యంతో మాధవి హాస్పిటల్ నందు అడ్మిట్ చేయడం జరిగింది... విషయం తెలుసుకున్న బుక్కరాయసముద్రం మండల జడ్పీటీసీ నీలం భాస్కర్ మరియు మండల ఇంచార్జ్ ఆలూరి రమణారెడ్డి గారు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా రమణారెడ్డి గారు మాట్లాడుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెదుల్ల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, జంతులూరు సర్పంచ్ లక్ష్మిరెడ్డి , వైస్ ఎంపీపీ సాకే లక్ష్మీనారాయణ జంతులూరు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

ఎంతకాలం చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాల సమీపాన విలేకరులు కూర్చోవాలి, ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలి నిర్మాణాన్ని చేపట్టాలి..సి.పి.యం. పార్టీ

ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలి నిర్మాణాన్ని చేపట్టాలి అధికార పార్టీ, ప్రతి పక్ష నాయకులను కోరిన సిపిఎం పార్టీ.

ప్రెస్ క్లబ్ ఏర్పాటు అయ్యేనా? 

విలేకరుల బాధలు తీరేనా.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు గ్రహణం పట్టిందా 

అధికార పార్టీకి ప్రెస్ క్లబ్ ఏర్పాటు పట్ల స్పందన ఏది.

ఎంతకాలం చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాల సమీపాన విలేకరులు కూర్చోవాలి.

 ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలము కేటాయించడానికి అధికార పార్టీ నాయకులు అధికారులతో మాట్లాడడానికి తీరిక లేదా

అవినీతి అక్రమాలు రుజువులతో సహా ఇచ్చిన పత్రికలలోనూ ఛానల్ లోనూ రానివ్వకుండా చేయడానికి ఉన్న తాపత్రయం ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ఎందుకు ఉండడం లేదు.

దేశ,విదేశాల్లో తమ నాయకుల ప్రచారానికి పత్రికలలో, చానల్లో రాయించడానికి, చూపించడానికి తాపత్రయం పడే అధికార పార్టీ ఎందుకని విలేకరుల సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించదు.

రాజ్యాంగంలో నాలుగో సింహం గా ఉన్న సమాజానికి సేవ చేసే కార్యక్రమంలో ప్రచార సాధనాలలో ముఖ్యమైనది.

మీడియా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడానికి సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇతర రుగ్మతలను ప్రపంచానికి తెలియజేసి సమాజ సేవలో కీలకంగా పత్రిక మరియు ఎలక్ట్రానిక్స్ మీడియా చేస్తున్నది.

సింగనమల నియోజకవర్గం లో ని 6 మండలాలలో ఎక్కడ కూడా విలేకరులు కూర్చోవడానికి సేద తీర్చుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి ప్రెస్ క్లబ్ లేదు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడం నిజం.

 ప్రెస్ క్లబ్ గురించి ఆర్భాటపు ప్రచారాలు చేయడం ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటి

అధికార పార్టీకి చెందిన నాయకులు ఎంత విలువైన భవనాలను నిర్మించుకున్నారు. నిర్మించుకుంటున్నారన్న సంగతి అందరికీ తెలుసు.

సమాజానికి సేవ చేసే విలేకరుల సమావేశ మందిరం ఏర్పాటుకు కనీసం స్థలమును కేటాయించడానికి అధికారులతో మాట్లాడే ధైర్యం ఎందుకని చేయడం లేదు.

ఒకవైపున అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను అక్రమిస్తూ ఉంటే వాటి మీద అధికారులు చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తుండగా రెండవ వైపున విలేకరుల సమావేశం మందిరానికి స్థలం కేటాయించలేకపోవడం దురదృష్టకరం.

ఈ కాలంలో కొత్త కొత్త పత్రికలు కొత్త కొత్త ఛానల్స్ పదుల సంఖ్యలో విలేకరులు వస్తున్నారు వీటికి తోడు వెబ్ ఛానల్ కూడా వస్తున్నాయి.

వీరందరూ కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి సేద తీర్చుకోవడానికి ఎలాంటి భవనం లేదు.

 అలాగే వివిధ రాజకీయ పార్టీలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు విలేకరుల సమావేశం మందిరంలో ఏర్పాటు చేయడం లేదా ఆయా రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలలో విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేయడం సహజము.

 కానీ బుక్కరాయసముద్రం మండలంలో విలేకరుల సమావేశం మందిరం లేకపోవడం వలన విలేకరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు

 వీరు ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఉన్న చెట్ల కింద, బండల మీద కూర్చుంటున్నారు.

కనీసం నీళ్లు ఇవ్వడానికి అంతంత మాత్రమే ఉంది.

విలేకరులు ధైర్యం చేసి సమావేశ మందిరం కోసం స్థలం కేటాయించమని అధికార పార్టీని అడగలేని దీనస్థితిలో ఉన్నారు.

అధికారులు అధికార పార్టీ కనుసన్నలలో నడుస్తున్నారే తప్ప విలేకరులు కూడా సమాజంలో ఒక భాగము అనే భావన లేదు.

 మరొకవైపున అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తమ నాయకులు దేశ విదేశాల్లో ప్రయాణాలు చేసినప్పుడు సమావేశాలకు వెళ్ళినప్పుడు వివిధ సందర్భాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాల్గొన్నప్పుడు పాల్గొన్న ప్రాంతాల నుండి ఫోటోలను వీడియోలను తమ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల ద్వారా విలేకరులకు పెట్టించి పత్రికలలోనూ చానల్స్ లోను వచ్చే విధంగా వెంటపడే అధికార పార్టీ వారు విలేకరుల సమావేశ మందిరానికి స్థలము కేటాయించడానికి అధికారులపై ఎందుకని చేయడం లేదో అర్థం కావడం లేదు.

అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను, భూ కబ్జాలకు, అక్రమ మైనింగ్ లను సిపిఎం,వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలను పత్రికలలోనూ, ఛానల్ లోనూ రానివ్వకుండా విలేకరుల మీద ఒత్తిడి పెంచే నాయకులు విలేకరుల సమావేశం మందిరం స్థలం కు ఎందుకు శ్రద్ధ చూపడం లేదు.

ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు విలేకరుల సమావేశ మందిరం కోసం స్థలాన్ని కేటాయించాలని ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని అధికార పార్టీ నాయకులు చొరవ తీసుకోవాలని సహకరించాలని సిపిఎం పార్టీ కోరుతున్నదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ. నల్లప్ప మండల కార్యదర్శి ఆర్.కుల్లాయప్ప లు కోరారు.