ఎంతకాలం చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాల సమీపాన విలేకరులు కూర్చోవాలి, ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలి నిర్మాణాన్ని చేపట్టాలి..సి.పి.యం. పార్టీ
ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలి నిర్మాణాన్ని చేపట్టాలి అధికార పార్టీ, ప్రతి పక్ష నాయకులను కోరిన సిపిఎం పార్టీ.
ప్రెస్ క్లబ్ ఏర్పాటు అయ్యేనా?
విలేకరుల బాధలు తీరేనా.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు గ్రహణం పట్టిందా
అధికార పార్టీకి ప్రెస్ క్లబ్ ఏర్పాటు పట్ల స్పందన ఏది.
ఎంతకాలం చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాల సమీపాన విలేకరులు కూర్చోవాలి.
ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలము కేటాయించడానికి అధికార పార్టీ నాయకులు అధికారులతో మాట్లాడడానికి తీరిక లేదా
అవినీతి అక్రమాలు రుజువులతో సహా ఇచ్చిన పత్రికలలోనూ ఛానల్ లోనూ రానివ్వకుండా చేయడానికి ఉన్న తాపత్రయం ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ఎందుకు ఉండడం లేదు.
దేశ,విదేశాల్లో తమ నాయకుల ప్రచారానికి పత్రికలలో, చానల్లో రాయించడానికి, చూపించడానికి తాపత్రయం పడే అధికార పార్టీ ఎందుకని విలేకరుల సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించదు.
రాజ్యాంగంలో నాలుగో సింహం గా ఉన్న సమాజానికి సేవ చేసే కార్యక్రమంలో ప్రచార సాధనాలలో ముఖ్యమైనది.
మీడియా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడానికి సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇతర రుగ్మతలను ప్రపంచానికి తెలియజేసి సమాజ సేవలో కీలకంగా పత్రిక మరియు ఎలక్ట్రానిక్స్ మీడియా చేస్తున్నది.
సింగనమల నియోజకవర్గం లో ని 6 మండలాలలో ఎక్కడ కూడా విలేకరులు కూర్చోవడానికి సేద తీర్చుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి ప్రెస్ క్లబ్ లేదు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడం నిజం.
ప్రెస్ క్లబ్ గురించి ఆర్భాటపు ప్రచారాలు చేయడం ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటి
అధికార పార్టీకి చెందిన నాయకులు ఎంత విలువైన భవనాలను నిర్మించుకున్నారు. నిర్మించుకుంటున్నారన్న సంగతి అందరికీ తెలుసు.
సమాజానికి సేవ చేసే విలేకరుల సమావేశ మందిరం ఏర్పాటుకు కనీసం స్థలమును కేటాయించడానికి అధికారులతో మాట్లాడే ధైర్యం ఎందుకని చేయడం లేదు.
ఒకవైపున అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను అక్రమిస్తూ ఉంటే వాటి మీద అధికారులు చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తుండగా రెండవ వైపున విలేకరుల సమావేశం మందిరానికి స్థలం కేటాయించలేకపోవడం దురదృష్టకరం.
ఈ కాలంలో కొత్త కొత్త పత్రికలు కొత్త కొత్త ఛానల్స్ పదుల సంఖ్యలో విలేకరులు వస్తున్నారు వీటికి తోడు వెబ్ ఛానల్ కూడా వస్తున్నాయి.
వీరందరూ కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి సేద తీర్చుకోవడానికి ఎలాంటి భవనం లేదు.
అలాగే వివిధ రాజకీయ పార్టీలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు విలేకరుల సమావేశం మందిరంలో ఏర్పాటు చేయడం లేదా ఆయా రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలలో విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేయడం సహజము.
కానీ బుక్కరాయసముద్రం మండలంలో విలేకరుల సమావేశం మందిరం లేకపోవడం వలన విలేకరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు
వీరు ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఉన్న చెట్ల కింద, బండల మీద కూర్చుంటున్నారు.
కనీసం నీళ్లు ఇవ్వడానికి అంతంత మాత్రమే ఉంది.
విలేకరులు ధైర్యం చేసి సమావేశ మందిరం కోసం స్థలం కేటాయించమని అధికార పార్టీని అడగలేని దీనస్థితిలో ఉన్నారు.
అధికారులు అధికార పార్టీ కనుసన్నలలో నడుస్తున్నారే తప్ప విలేకరులు కూడా సమాజంలో ఒక భాగము అనే భావన లేదు.
మరొకవైపున అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తమ నాయకులు దేశ విదేశాల్లో ప్రయాణాలు చేసినప్పుడు సమావేశాలకు వెళ్ళినప్పుడు వివిధ సందర్భాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాల్గొన్నప్పుడు పాల్గొన్న ప్రాంతాల నుండి ఫోటోలను వీడియోలను తమ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల ద్వారా విలేకరులకు పెట్టించి పత్రికలలోనూ చానల్స్ లోను వచ్చే విధంగా వెంటపడే అధికార పార్టీ వారు విలేకరుల సమావేశ మందిరానికి స్థలము కేటాయించడానికి అధికారులపై ఎందుకని చేయడం లేదో అర్థం కావడం లేదు.
అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను, భూ కబ్జాలకు, అక్రమ మైనింగ్ లను సిపిఎం,వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలను పత్రికలలోనూ, ఛానల్ లోనూ రానివ్వకుండా విలేకరుల మీద ఒత్తిడి పెంచే నాయకులు విలేకరుల సమావేశం మందిరం స్థలం కు ఎందుకు శ్రద్ధ చూపడం లేదు.
ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు విలేకరుల సమావేశ మందిరం కోసం స్థలాన్ని కేటాయించాలని ప్రెస్ క్లబ్ నిర్మాణాన్ని అధికార పార్టీ నాయకులు చొరవ తీసుకోవాలని సహకరించాలని సిపిఎం పార్టీ కోరుతున్నదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ. నల్లప్ప మండల కార్యదర్శి ఆర్.కుల్లాయప్ప లు కోరారు.
Jan 28 2024, 07:20