రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ళలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించా లని కోరారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 30 ఫీట్లు మాత్రమే ఉంది.

రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు.

అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగిం చారు.

నేడు ఉదయం ఆర్‌అండ్‌బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో అలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు

అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు.

నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు

అయితే ఎమ్మెల్యే ఇంటినుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు వెడల్పులో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. దాంతో ఆయన స్పందనపై ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు

కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లా మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ECE రెండవ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఈరోజు మరణించినట్లు సమాచారం

చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని గా సమాచారం.

కళాశాల లోపలికి వెళ్ళిన పోలీసులు యాజమాన్యం కళాశాలకు సెలవును ప్రకటించడంతో బలపడు తున్న అనుమానాలు

మీడియాని లోపలికి అనుమతించని సెక్యూరిటీ

 సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

విద్యాధరపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంపులో ఉచితంగా కంటి,గుండె,ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల

మెడికల్ క్యాంపులో ఉచితంగా కంటి,గుండె,ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

మెగా మెడికల్ క్యాంపుకు భారీగా స్పందన

ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు కాండ్రేకుల రవీంద్ర ప్రారంభించారు

పెద్దఎత్తున తరలివస్తున్న పేదప్రజలు

ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తి నాగేశ్వరరావు, ఎద్దు పార్టీ రామయ్య, కేఎస్ఆర్ ఆర్ శర్మ, పీవీ సుబ్బయ్య, సురభి బాలు, రాంబాబు, యువి శివాజీ ,పల్లె కిరణ, ఆదిత్యా కిరణ్, పెద్ది సతీష్, ముదిగొండ శివ, గుండు సుధా, కామా దేవరాజ్, పితాని పద్మ, మొవ్వ విజయ, వల్లభనేని ప్రసన్నలక్ష్మి, బ్రదర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లోని జల్లి గ్రామ తండాలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది

భర్త వేధింపులు తాళలేక భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తండాకు చెందిన జర్పుల ప్రవీణ్ కి స్వరూపతో 24 సంవత్స రాల క్రితం వివాహామైంది.

ప్రవీణ్ పెండ్లి అయినప్పటి నుండి స్వరూప ను ఇష్టానుసారంగా కొట్టేవాడు. అతని వేధింపులతో గతంలోనే భార్య రెండు సార్లు చావడానికి ప్రయత్నం చేసింది. ఎన్నోసార్లు పెద్దమనుషులు పంచాయతీలు చేసి భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేశారు

వీరి కుమారుడు ఇటీవలే చేసుకున్న వివాహం విషయంలోనూ స్వరూపను ప్రవీణ్ నువ్వే కారణ మంటూ కొట్టాడు. బుధవారం సాయంత్రం మధ్యం మత్తులో ఇంటికి వచ్చి స్వరూపను తీవ్రంగా కొట్టి, ఏదైనా మందు తాగి చావు అని బెదిరించాడు

దీంతో భర్త టార్చర్ భరించలేక స్వరూప బుధవారం రాత్రి పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయింది

మృతురాలి తల్లి భూక్య మల్లికాంబ ఫిర్యాదు మేరకు ప్రవీణ్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ పి.శ్రీనివాస్ తెలిపారు

యాదాద్రి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై అవిశ్వాసం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై ఈరోజు కౌన్సిలర్లు అవిశ్వాసం తెలిపారు

ఈ మేరకు అవిశ్వాస తీర్మాన పత్రాలను కలెక్టర్‌ హనుమంతుకు ఇచ్చారు. తీర్మానంపై ఐదుగురు బీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సంతకాలు చేశారు

దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళ

దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళగా ఇటీవల జులేఖా దావూద్‌ వార్తల్లో నిలిచారు.

ఫోర్బ్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ టాప్‌ 100 ఇండియన్‌ లీడర్స్‌ ఇన్‌ యూఏఈ’లో చోటు దక్కించుకున్నారు

84 ఏళ్ల జులేఖా ప్రస్తుతం రూ.3632 కోట్ల రెవెన్యూతో ఆ దేశంలో అగ్రస్థానంలో నిలిచారు.

1964లో ప్రాక్టీస్‌ కోసం యూఏఈ వెళ్లిన తొలి భారత మహిళా వైద్యురాలి గా రికార్డుల కెక్కారు

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసు కున్నాయి

ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయి స్టులు ఉన్నారు

ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

మెదక్ జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది

రామాయంపేట మండలం కోనాపూర్ చెరువు వద్ద ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. మృతుడు జోగిపేటకు చెందిన చాకలి మల్లేశంగా గుర్తించారు

గుర్తు తెలియని వ్యక్తులు చాకలి మల్లేశంను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది

లండన్ లో బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

లండన్ లో బీఆర్ఎస్ నేతలపై ఈరోజు సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు

బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతు న్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

చంద్రబాబు హెలికాప్టర్‌‎లో సమన్వయ లోపం

ఈ రోజు విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్‌‎లో సమన్వయ లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం ఏర్పడింది

నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో ప్రయాణించిన హెలికాప్టర్‌‎. పైలట్ రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు హెచ్చరించిన ఏటీసీ అధికారులు. ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్‌ వెనుదిరిగింది

కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది.తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు

గత రెండు రోజుల క్రితం గుడివాడలో సభ జరుగగా శనివారం అరకులో పార్లమెంటర్ నియోజక వర్గంలో సభను నిర్వహిం చారు. ఈ సభకు హాజర య్యే క్రమంలో విశాఖ నుంచి అరకు బయలు దేరారు.ఈ క్రమంలోనే ఈఘటన తలెత్తింది