రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందాం...కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓనల్లప్ప..
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందాం
కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ ఈరోజు మండల కేంద్రమైన బుక్కరాయసముద్రం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ప్రవేశికను సంఘ నాయకులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓనల్లప్ప రైతు సంఘం జిల్లా నాయకులు ఆరు కుల్లాయప్ప సంజీవరెడ్డి సిఐటియు నాయకులు నాగేంద్ర నెట్టికంటయ్య
వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పుల్లయ్య ఎర్రన్న చేతివృత్తిదాల సంఘ నాయకులు అంకాలు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చిన్న ఆంజనేయులు ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటాపురం చంద్ర ఓబులేసు మల్లేషు కాశప్ప తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప మాట్లాడుతూ
2024 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. రాజ్యాంగ పరిషత్ దాదాపు మూడేళ్ల పాటు కృషి చేసి రూపొందించిన రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొంది, 1950 జనవరి 26న అమలులోకి రావడంతో ‘గణతంత్ర’ (రిపబ్లిక్) దినోత్సవంగా ప్రకటించుకున్నాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వాన ముసాయిదా కమిటీ 60 రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ‘రాజ్యాంగ పీఠిక’లో రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ పేర్కొన్నది. రాజ్యాంగ మౌలిక స్వరూప అంశాలుగా సమాఖ్య విధానం, లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు మొదలగు వాటిని న్యాయమూర్తులు పేర్కొన్నారు. గత 74 ఏళ్లుగా భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలబడి, ‘భిన్నత్వం’ గల భారత దేశాన్ని సమైక్యంగా ముందుకు తీసుకువెళ్లటానికి దోహదపడినది. దాదాపు 105కు పైగా రాజ్యాంగ సవరణలు జరిగినప్పటికి రాజ్యాంగ మౌలిక స్వరూపం కొనసాగుతూనే ఉన్నది. కాని 2014 నుంచి ఇప్పటి వరకు భారత రాజ్యాంగం ‘మౌలిక స్వరూపమే’ కోల్పోయే విధంగా దాడులు ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి బయట పడాలంటే ప్రజాచైతన్యం, ప్రజాభిప్రాయమే ప్రధాన మార్గం.
భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. అన్ని వ్యవస్థలు, సంస్థలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాలి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 1949 నవంబర్ 26న కింది విధంగా పేర్కొన్నారు. ‘ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా, గొప్పదైనా కావచ్చు, కాని దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లయితే అది పనిచేయదు’ అని చెప్పారు. 1975లో భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి విధింపు రూపంలో ఒక దాడిని ఎదుర్కొన్నది. భారత ప్రజలు 1977లో దానిని విజయవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వ రూపంలో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై, రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలపై దాడి జరుగుతున్నది. రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ సవాళ్లు ఎదుర్కొనటానికి విస్తృతమైన ప్రజా మద్దతు అవసరం. ఆధునిక భారత రాజ్యాంగ లక్ష్యాల స్థానంలో ప్రాచీన మనుస్మృతి లక్ష్యాలను ప్రతిష్టించటానికి సంఘ పరివార్ వ్యూహాత్మక ఎత్తుగడలతో పనిచేస్తున్నది. ఈ ఎత్తుగడలను ఓడించడానికి ప్రజాభిప్రాయం, ప్రజా చైతన్యమే ఏకైక మార్గం. భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని ఈ కృషి కొనసాగాలి.
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కార్పొరేట్ రాజకీయాలు, క్రోనీ కాపిటలిజమ్ రాజ్యాంగ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అండతో అదానీ నేడు 11 లక్షల కోట్లకు అధిపతిగా మారారు. కేంద్రంలోను అనేక రాష్ట్రాలలోను మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ కంపెనీలు, బొగ్గు మొదలైన రంగాలన్నీ అదానీ, అంబానీల నియంత్రణలోనే ఉన్నాయి. వీరు రాజకీయ రంగాన్ని నియంత్రణ చేస్తూ తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వీరికి పూర్తిగా సహకరిస్తున్నది.
భారతదేశానికి గల భిన్నత్వం దృష్ట్యా రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య విధానాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఉపయోగించనప్పటికీ, 1వ నిబంధనలో భారతదేశాన్ని ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని చెప్పారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించారు. అనేక సందర్భాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలలో మార్పుల కోసం నియమించి వాటి సిఫార్సుల ఆధారంగా రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాఖ్య విధానంపై దాడి ప్రారంభించి రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జి.యస్.టి రాష్ట్రాల ఆర్థిక వనరులను దెబ్బతీశాయి. పెద్ద నోట్ల రద్దు జి.యస్.టి వలన రాష్ట్రాలకు లక్ష కోట్లు నష్టం జరిగింది. 3 వ్యవసాయ చట్టాలు సమాఖ్య విధానానికి పూర్తి విరుద్ధం. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా, కేంద్రం ఈ చట్టాలను చేసింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. విద్యారంగంలో ప్రధాన నిర్ణయాలు చేయాలంటే రాష్ట్రాలతో సంప్రదించాలి. కాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2020 జులైలో రాష్ట్రాలతో సంప్రదించకుండానే ‘జాతీయ విద్యావిధానం-2020’ ప్రకటించడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ప్రజాతంత్ర వాదులందరూ ఐక్యమై రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
Jan 27 2024, 09:55