రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందాం...కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓనల్లప్ప..

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందాం

కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ ఈరోజు మండల కేంద్రమైన బుక్కరాయసముద్రం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ప్రవేశికను సంఘ నాయకులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓనల్లప్ప రైతు సంఘం జిల్లా నాయకులు ఆరు కుల్లాయప్ప సంజీవరెడ్డి సిఐటియు నాయకులు నాగేంద్ర నెట్టికంటయ్య

వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పుల్లయ్య ఎర్రన్న చేతివృత్తిదాల సంఘ నాయకులు అంకాలు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చిన్న ఆంజనేయులు ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటాపురం చంద్ర ఓబులేసు మల్లేషు కాశప్ప తదితరులు పాల్గొన్నారు 

ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప మాట్లాడుతూ

2024 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. రాజ్యాంగ పరిషత్‌ దాదాపు మూడేళ్ల పాటు కృషి చేసి రూపొందించిన రాజ్యాంగం 1949 నవంబర్‌ 26న ఆమోదం పొంది, 1950 జనవరి 26న అమలులోకి రావడంతో ‘గణతంత్ర’ (రిపబ్లిక్‌) దినోత్సవంగా ప్రకటించుకున్నాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ నాయకత్వాన ముసాయిదా కమిటీ 60 రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ‘రాజ్యాంగ పీఠిక’లో రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ పేర్కొన్నది. రాజ్యాంగ మౌలిక స్వరూప అంశాలుగా సమాఖ్య విధానం, లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు మొదలగు వాటిని న్యాయమూర్తులు పేర్కొన్నారు. గత 74 ఏళ్లుగా భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలబడి, ‘భిన్నత్వం’ గల భారత దేశాన్ని సమైక్యంగా ముందుకు తీసుకువెళ్లటానికి దోహదపడినది. దాదాపు 105కు పైగా రాజ్యాంగ సవరణలు జరిగినప్పటికి రాజ్యాంగ మౌలిక స్వరూపం కొనసాగుతూనే ఉన్నది. కాని 2014 నుంచి ఇప్పటి వరకు భారత రాజ్యాంగం ‘మౌలిక స్వరూపమే’ కోల్పోయే విధంగా దాడులు ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి బయట పడాలంటే ప్రజాచైతన్యం, ప్రజాభిప్రాయమే ప్రధాన మార్గం.

భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. అన్ని వ్యవస్థలు, సంస్థలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాలి. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 26న కింది విధంగా పేర్కొన్నారు. ‘ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా, గొప్పదైనా కావచ్చు, కాని దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లయితే అది పనిచేయదు’ అని చెప్పారు. 1975లో భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి విధింపు రూపంలో ఒక దాడిని ఎదుర్కొన్నది. భారత ప్రజలు 1977లో దానిని విజయవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వ రూపంలో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై, రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలపై దాడి జరుగుతున్నది. రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ సవాళ్లు ఎదుర్కొనటానికి విస్తృతమైన ప్రజా మద్దతు అవసరం. ఆధునిక భారత రాజ్యాంగ లక్ష్యాల స్థానంలో ప్రాచీన మనుస్మృతి లక్ష్యాలను ప్రతిష్టించటానికి సంఘ పరివార్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో పనిచేస్తున్నది. ఈ ఎత్తుగడలను ఓడించడానికి ప్రజాభిప్రాయం, ప్రజా చైతన్యమే ఏకైక మార్గం. భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని ఈ కృషి కొనసాగాలి.

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కార్పొరేట్‌ రాజకీయాలు, క్రోనీ కాపిటలిజమ్‌ రాజ్యాంగ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అండతో అదానీ నేడు 11 లక్షల కోట్లకు అధిపతిగా మారారు. కేంద్రంలోను అనేక రాష్ట్రాలలోను మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్‌ కంపెనీలు, బొగ్గు మొదలైన రంగాలన్నీ అదానీ, అంబానీల నియంత్రణలోనే ఉన్నాయి. వీరు రాజకీయ రంగాన్ని నియంత్రణ చేస్తూ తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వీరికి పూర్తిగా సహకరిస్తున్నది.

భారతదేశానికి గల భిన్నత్వం దృష్ట్యా రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య విధానాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఉపయోగించనప్పటికీ, 1వ నిబంధనలో భారతదేశాన్ని ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని చెప్పారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించారు. అనేక సందర్భాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలలో మార్పుల కోసం నియమించి వాటి సిఫార్సుల ఆధారంగా రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాఖ్య విధానంపై దాడి ప్రారంభించి రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జి.యస్‌.టి రాష్ట్రాల ఆర్థిక వనరులను దెబ్బతీశాయి. పెద్ద నోట్ల రద్దు జి.యస్‌.టి వలన రాష్ట్రాలకు లక్ష కోట్లు నష్టం జరిగింది. 3 వ్యవసాయ చట్టాలు సమాఖ్య విధానానికి పూర్తి విరుద్ధం. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా, కేంద్రం ఈ చట్టాలను చేసింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. విద్యారంగంలో ప్రధాన నిర్ణయాలు చేయాలంటే రాష్ట్రాలతో సంప్రదించాలి. కాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2020 జులైలో రాష్ట్రాలతో సంప్రదించకుండానే ‘జాతీయ విద్యావిధానం-2020’ ప్రకటించడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ప్రజాతంత్ర వాదులందరూ ఐక్యమై రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఉరవకొండలో జరగబోయే రా కదిలిరా కార్యక్రమంకు విచ్చేయుచున్నా నారా చంద్రబాబునాయుడు గారి పర్యటనను విజయవంతం చేద్దాం.. మాజీజడ్పీటీసీ కె రామలింగారెడ్డి

ఉరవకొండలో జరగబోయే రా కదిలిరా కార్యక్రమంకు విచ్చేయుచున్నా నారా చంద్రబాబునాయుడు గారి పర్యటనను విజయవంతం చేద్దాం.. మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి

రేపు అనగా (27-01-2024) శనివారం నాడు మధ్యాహ్నం 1గంటకు జరయబోయే రా కదిలిరా కార్యక్రమంకు విచయుచున్న నారా చంద్రబాబు నాయుడు గారి భారీ బహిరంగ సభ కార్యక్రమంను ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం నుంచి పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేయవల్సిందిగా కోరుచున్నాము.

      మీ కాటప్పగారి రామలింగారెడ్డి మాజీజడ్పీటీసీ

జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు

శింగనమల నియోజకవర్గం

CCC కదిరికి 28న షర్మిల రాక..

CCC కదిరికి 28న షర్మిల రాక..

కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ వైరా షర్మిల ఈ నెల 28న శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి రానున్నారు. ఆమె రాక సందర్బంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

పసులూరు గ్రామంలో జరుగు పెద్దమ్మ ఊరిదేవరకు నియోజవర్గ టిడిపి శ్రేణులను ఘనంగా ఆహ్వానించిన గ్రామ టిడిపి నాయకులు

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలో జరుగు పెద్దమ్మ ఊరిదేవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారిని, శింగనమల నియోజకవర్గం ట్యూమన్ కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారిని, ముంటిమడుగు కేశవ రెడ్డి గారిని, మరియు నియోజకవర్గం నాయకులను దేవరకు ఆహ్వానించిన పసులూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు

తెలుగుదేశం పార్టీ జోనల్ ఇంచార్జ్ బీద రవిచంద్ర కామెంట్స్ సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి లేరు..

తెలుగుదేశం పార్టీ జోనల్ ఇంచార్జ్ బీద రవిచంద్ర కామెంట్స్ సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి లేరు.. టిడిపి అభ్యర్థి గా ఎవరిని ఇంతవరకు ప్రకటించలేదు 

ద్వి సభ్య కమిటీ సభ్యుల ఆలం నర్స నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి పర్యవేక్షణలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి

టిడిపి జోనల్ ఇన్చార్జి బీద రవిచంద్ర యాదవ్

ఉరవకొండ నియోజకవర్గం లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేద్దాం : సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ నియోజకవర్గం లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేద్దాం : సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు

శింగనమల : శింగనమల నియోజకవర్గం రేపు ఉదయం10.30 గంటలకు 6 మండలాల నుంచి అత్యధికంగా తరలి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారి ఉరవకొండలో జరుగు "రా... కదిలిరా బహిరంగ సభను" విజయవంతం చేద్దామని దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం పార్లమెంట్ ఉరవకొండ నియోజకవర్గం లో రా కదలిరా బహిరంగసభకు శింగనమల నియోజకవర్గ 6 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు బయలుదేరి విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.

   ఇట్లు 

 ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు 

 శింగనమల నియోజకవర్గం దిసభ్య కమిటీ సభ్యులు

ఆస్పత్రి అభివృద్ధి చైర్మన్ గౌరవ ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారి ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి సమావేశము..

బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆసుపత్రి అభివృద్ధి సమావేశము , ఆస్పత్రి అభివృద్ధి చైర్మన్ గౌరవ ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మండల వైద్యాధికారులు, ఎంపీడీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ గారు, ఎమ్మార్వో ఆఫీస్ నుంచి సీనియర్ అసిస్టెంట్ గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పబ్లిక్ హెల్త్ నర్స్, సెక్టర్ సూపర్వైజర్స్ హాజరవ్వడం జరిగింది. ఎంపీపీ గారు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆస్పత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించి ఆసుపత్రి కి కావలసిన కనీస అవసరాలను ఈ సమావేశంలో తీర్మానం చేసి వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా ఈ సమావేశంలో నిర్వహించడం జరుగుతుంది ఈసారి ఆసుపత్రికి ఇన్వర్టర్ మరియు బ్యాటరీ కొరకు తీర్మానం చేయడం జరిగింది , చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాలని వారు సమావేశంలో తెలియజేశారు, వైద్యాధికారి మాట్లాడుతూ తరచూ కరెంటు పోవడం వల్ల చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్ కీ ఇబ్బంది కలుగుతూ ఉండటం వల్ల ఇన్వర్టర్ ఉంటే ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీపీ గారిని కోరడం వల్ల వారు ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసులూరు సర్పంచ్ కల్పలత రెడ్డి గారు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మన్నేరు కొండమ్మ గారు, వైద్యాధికారిని స్వాతి లక్ష్మి గారు, డాక్టర్ తహీరున్నిస గారు, సిహెచ్ఓ మోహన్ రావు గారు, పిహెచ్ఎన్ చే న్నమ్మ, హనుమంత్ రెడ్డి ఎంపీడీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ సునీత , ఎమ్మార్వో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ , సూపర్వైజర్లు హెల్త్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది

సర్పంచు కొండన్న మృతి తీరని లోటు.. ఆలూరు సాంబ శివారెడ్డి..

సర్పంచు కొండన్న మృతి తీరని లోటు.. ఆలూరు సాంబ శివారెడ్డి.. బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామ పంచాయతీ సర్పంచు జి.కొండన్న(49) మృతి పార్టీకి తీరని లోటని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కొండన్న బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తెల్లవారుజామున మృతి చెందారు. సాంబశివారెడ్డి, వైఎస్ఆర్సీపీ శింగనమల ఇంచార్జ్ వీరాంజనేయులు పూలమాలలు వేసి కొండన్నకు నివాళులర్పించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సాంబ శివారెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గువ్వల రాజశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ నీలం భాస్కర్, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

YSRCP పంచాయతీ సర్పంచు G. కొండన్న అనారోగ్యంతో బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి..

బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం YSRCP గ్రామ పంచాయతీ సర్పంచు G. కొండన్న అనారోగ్యంతో బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి. రాజకీయాలను నమ్ముకుని స్థాయికి మించిన అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పనులు చేయించి బిల్లులు రాక మనస్థాపానికి లోనై అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ చివరికి మృత్యువాత పడ్డాడు. పెద్దలున్నట్లు దాని నమ్ముకుని ధర్మారం పోతే అది బుక్కపట్నం చేరింది.. ఇదే జరిగింది మన సర్పంచ్ కొండన్న విషయంలో.. అన్న ఆత్మ శాంతి కలగాలని దేవుని కోరుకుంటూ...

శ్రీ పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి వేడుకలు..

స్వర్గీయ మాజీమంత్రివర్యులు శ్రీ పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి సందర్బంగా వెంకటాపురంలో కీ.శే.శ్రీ పరిటాల రవీంద్ర గారి ఘాట్ ను సందర్శంచి పులమాలను వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులు పరిటాల సునీతమ్మ గారిని, పరిటాల శ్రీరామ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ టీడీపీ నేతలు.ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారు, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బి కె పార్థసారథి గారు, *శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు మరియు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు* మరియు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.