YSRCP పంచాయతీ సర్పంచు G. కొండన్న అనారోగ్యంతో బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి..

బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం YSRCP గ్రామ పంచాయతీ సర్పంచు G. కొండన్న అనారోగ్యంతో బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి. రాజకీయాలను నమ్ముకుని స్థాయికి మించిన అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పనులు చేయించి బిల్లులు రాక మనస్థాపానికి లోనై అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ చివరికి మృత్యువాత పడ్డాడు. పెద్దలున్నట్లు దాని నమ్ముకుని ధర్మారం పోతే అది బుక్కపట్నం చేరింది.. ఇదే జరిగింది మన సర్పంచ్ కొండన్న విషయంలో.. అన్న ఆత్మ శాంతి కలగాలని దేవుని కోరుకుంటూ...

శ్రీ పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి వేడుకలు..

స్వర్గీయ మాజీమంత్రివర్యులు శ్రీ పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి సందర్బంగా వెంకటాపురంలో కీ.శే.శ్రీ పరిటాల రవీంద్ర గారి ఘాట్ ను సందర్శంచి పులమాలను వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులు పరిటాల సునీతమ్మ గారిని, పరిటాల శ్రీరామ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ టీడీపీ నేతలు.ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారు, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బి కె పార్థసారథి గారు, *శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు మరియు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు* మరియు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

తాహసిల్దార్ యోగేశ్వరి దేవినీ సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ..

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఇంచార్జి బత్తల పల్లి తాహసిల్దార్ యోగేశ్వరి దేవినీ సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ ఎస్సీ ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టరాజ్యంగా కట్టబెట్టిందని తహశీల్దార్ పై అవినీతి,అరోపణలు. సమగ్ర విచారణ అనంతరం తహశీల్దార్ యోగేశ్వరి దేవి సస్పెన్షన్.

గూగూడు కుళాయి స్వామి సన్నిధిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు* నార్పల మండలం గూగూడు గ్రామం లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ,యువగళం పాదయాత్ర రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు *టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారి* అధ్వర్యంలో గ్రామంలోని జంట దేవాలయాలు కుళ్ళాయిస్వామి,ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* జనసేన మండల కన్వీనర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎ కష్టమొచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే నాయకుడు ఉండడం మనకు చాలా గర్వ కారణం యువగళం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గారు ఆంధ్రప్రదేశ్ యువతను భాగస్వామ్యం చేసేందుకు, రాష్ట్ర రాజకీయ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, నిర్భయంగా తమ గళాన్ని వినిపించేందుకు యువగళం పాదయాత్రను చేపట్టారు.విద్యార్థులకు నిరుద్యోగులకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతేనే. ముఖ్యంగా యువగళo పేరుతో నారా లోకేష్ గారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా లోకేష్ బాబు గారు ముందుకు వెళ్లడం జరుగుతోంది కాబట్టి ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలనీ భవిష్యత్తు లో ఉన్నతమైన పదవుల చేపట్టాలని ఆయన ఆలోచనలు రాష్ట్రానినికి అవసరం అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు, బూత్ ఇంచార్జ్ లు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ లు పాల్గొన్నారు

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు..

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ద్విసభ్యకమిటి సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, మరియు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దఎత్తున టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బుక్కరాయసముద్రం మండల టీడీపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్ , మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ,S.నారాయణ స్వామి, కేశన్న, మల్లేసు,మాజీఎంపీటీసీ నారాయణ స్వామి,బాబయ్య, చిత్తంబారి తదితర బుక్కరాయసముద్రం టీడీపి మండల నాయకులు మరియు పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ఆలూరు సాంబ శివారెడ్డి, శింగణమల నియోజకవర్గ సమన్వకర్త వీరాంజినేయులు

నిదనవాడ పెద్దమ్మ గుడి నిర్మాణానికి 50,000/ రూ. లు విరాళం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..

నిదనవాడ పెద్దమ్మ గుడి నిర్మాణానికి 50,000/యాభైవేల రూపాయలు విరాళం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు* శింగనమల : శింగనమల మండలం నిదనవాడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి *శ్రీ పెద్దమ్మ దేవాలయానికి నిర్మాణానికి 50వేల రూపాయలు విరాళం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు నిదనవాడ గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి ఎస్వి నారాయణరెడ్డి, ప్రతాప్ రెడ్డి జి.అమర్నాథ్ రెడ్డి చెన్నకేశవులు రవీంద్రారెడ్డి నారాయణరెడ్డి,* ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు *దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, శింగనమల మండల తెలుగు యువత అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, ప్రసాద్ నాయక్,వడ్డే పవన్,* తదితరులు పాల్గొన్నారు

YSRCP లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి

నష్టపోయినా అరటి రైతుని పరామర్శించిన -యం.యస్ రాజు..

నష్టపోయినా అరటి రైతుని పరామర్శించిన -యం.యస్ రాజు..

శిoగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కుమ్మనమల గ్రామం మాజీ డీలర్ ఓబన్న తోటలో 523 అరటి గోలలు గుర్తు తెలియని వ్యక్తులు 19-01-2024 తేదీన నరికివేశారు. ఈ రోజు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు* అరటి గోలలను నరికివేతకు గురైన తోటను పరిశీలించారు. కన్న బిడ్డల్లా పెంచుకున్న అరటి చెట్లను నరికి వేయడం చాలా దారుణం అన్నారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలాన్నారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు మండల కన్వినర్ బాల రంగయ్య,జిల్లా కార్యదర్శి సుదర్శన్ నాయుడు,శింగనమల నియోజకవర్గం సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు జంగంపల్లి కుళ్లాయప్ప,గాండ్లపాడు శ్రీనివాస్ రెడ్డి, కోమటికుంట్ల భాస్కర్, అశోక్, కడవకల్లు నాగేశ్వర్ రెడ్డి, sc సెల్ పెద్దయ్య, సురేపల్లి రామనాయుడు, భక్తవచలనాయుడు ,కొడవండ్లపల్లి సురేంద్ర,కోడుమూర్తి తిరుపతి నాయుడు, కూచువారిపల్లి వేణుగోపాల్ నాయుడు, కూచువారిపల్లి ప్రసాద్ నాయుడు, పురుషోత్తం నాయుడు, సందీప్ నాయుడు, రంగరాజుకుంట ఆదినారాయణ రెడ్డి, లక్ష్మయ్య,జంగం పల్లి శివ నాయుడు,బోడపాటి ఆదినరసింహులు రాగే పరుశురాము,,భాస్కర్ నాయుడు, సుధాకర్ నాయుడు, నరసాపురం భాస్కర్, మాడుగుపల్లి మారుతీ నాయుడు, జనగాంరెడ్డిపేట గుత్త శివనాయుడు,మాజీ ఎంపీటీసీ వేణు, బాలనాగీ నరేష్, బింగి విజయ్, రంగాపురం నరేంద్రనాయుడు,దిలీప్ కుమార్,ఆంజనప్ప,కుమ్మనమల పెద్దిరాజు,చంద్ర,sc సెల్ రామాంజి,ఉమేష్

అమ్మవారిపేట గ్రామ గుజ్జల తేజస్వరూప్ 14 సం.ల బాలుడు ఉదయం 07.30 గ.లకు మిస్సింగ్..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం అమ్మవారి పేట గ్రామం నందు ఉదయం 7:30 గంటల సమయంలో గుజ్జల తేజ్ స్వరూప్ S/o గుజ్జల నాగేంద్ర 14 సంవత్సరం వయసు గల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు బాలుడు ధరించిన దుస్తులు బ్లాక్ & రెడ్ కలర్ మంకీ క్యాప్ టి షర్ట్ లోయరు ధరించాడు ప్రస్తుతం మాంటిస్సోర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు ఆచూకీ తెలిసినవారు ఈ సెల్ నెంబర్ కు 9963396191 సమాచారం ఇవ్వగలరు