గూగూడు కుళాయి స్వామి సన్నిధిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు* నార్పల మండలం గూగూడు గ్రామం లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ,యువగళం పాదయాత్ర రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు *టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారి* అధ్వర్యంలో గ్రామంలోని జంట దేవాలయాలు కుళ్ళాయిస్వామి,ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* జనసేన మండల కన్వీనర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎ కష్టమొచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే నాయకుడు ఉండడం మనకు చాలా గర్వ కారణం యువగళం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గారు ఆంధ్రప్రదేశ్ యువతను భాగస్వామ్యం చేసేందుకు, రాష్ట్ర రాజకీయ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, నిర్భయంగా తమ గళాన్ని వినిపించేందుకు యువగళం పాదయాత్రను చేపట్టారు.విద్యార్థులకు నిరుద్యోగులకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతేనే. ముఖ్యంగా యువగళo పేరుతో నారా లోకేష్ గారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా లోకేష్ బాబు గారు ముందుకు వెళ్లడం జరుగుతోంది కాబట్టి ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలనీ భవిష్యత్తు లో ఉన్నతమైన పదవుల చేపట్టాలని ఆయన ఆలోచనలు రాష్ట్రానినికి అవసరం అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు, బూత్ ఇంచార్జ్ లు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ లు పాల్గొన్నారు

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు..

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ద్విసభ్యకమిటి సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, మరియు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దఎత్తున టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బుక్కరాయసముద్రం మండల టీడీపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్ , మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ,S.నారాయణ స్వామి, కేశన్న, మల్లేసు,మాజీఎంపీటీసీ నారాయణ స్వామి,బాబయ్య, చిత్తంబారి తదితర బుక్కరాయసముద్రం టీడీపి మండల నాయకులు మరియు పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ఆలూరు సాంబ శివారెడ్డి, శింగణమల నియోజకవర్గ సమన్వకర్త వీరాంజినేయులు

నిదనవాడ పెద్దమ్మ గుడి నిర్మాణానికి 50,000/ రూ. లు విరాళం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..

నిదనవాడ పెద్దమ్మ గుడి నిర్మాణానికి 50,000/యాభైవేల రూపాయలు విరాళం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు* శింగనమల : శింగనమల మండలం నిదనవాడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి *శ్రీ పెద్దమ్మ దేవాలయానికి నిర్మాణానికి 50వేల రూపాయలు విరాళం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు నిదనవాడ గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి ఎస్వి నారాయణరెడ్డి, ప్రతాప్ రెడ్డి జి.అమర్నాథ్ రెడ్డి చెన్నకేశవులు రవీంద్రారెడ్డి నారాయణరెడ్డి,* ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు *దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, శింగనమల మండల తెలుగు యువత అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, ప్రసాద్ నాయక్,వడ్డే పవన్,* తదితరులు పాల్గొన్నారు

YSRCP లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి

నష్టపోయినా అరటి రైతుని పరామర్శించిన -యం.యస్ రాజు..

నష్టపోయినా అరటి రైతుని పరామర్శించిన -యం.యస్ రాజు..

శిoగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కుమ్మనమల గ్రామం మాజీ డీలర్ ఓబన్న తోటలో 523 అరటి గోలలు గుర్తు తెలియని వ్యక్తులు 19-01-2024 తేదీన నరికివేశారు. ఈ రోజు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు* అరటి గోలలను నరికివేతకు గురైన తోటను పరిశీలించారు. కన్న బిడ్డల్లా పెంచుకున్న అరటి చెట్లను నరికి వేయడం చాలా దారుణం అన్నారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలాన్నారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు మండల కన్వినర్ బాల రంగయ్య,జిల్లా కార్యదర్శి సుదర్శన్ నాయుడు,శింగనమల నియోజకవర్గం సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు జంగంపల్లి కుళ్లాయప్ప,గాండ్లపాడు శ్రీనివాస్ రెడ్డి, కోమటికుంట్ల భాస్కర్, అశోక్, కడవకల్లు నాగేశ్వర్ రెడ్డి, sc సెల్ పెద్దయ్య, సురేపల్లి రామనాయుడు, భక్తవచలనాయుడు ,కొడవండ్లపల్లి సురేంద్ర,కోడుమూర్తి తిరుపతి నాయుడు, కూచువారిపల్లి వేణుగోపాల్ నాయుడు, కూచువారిపల్లి ప్రసాద్ నాయుడు, పురుషోత్తం నాయుడు, సందీప్ నాయుడు, రంగరాజుకుంట ఆదినారాయణ రెడ్డి, లక్ష్మయ్య,జంగం పల్లి శివ నాయుడు,బోడపాటి ఆదినరసింహులు రాగే పరుశురాము,,భాస్కర్ నాయుడు, సుధాకర్ నాయుడు, నరసాపురం భాస్కర్, మాడుగుపల్లి మారుతీ నాయుడు, జనగాంరెడ్డిపేట గుత్త శివనాయుడు,మాజీ ఎంపీటీసీ వేణు, బాలనాగీ నరేష్, బింగి విజయ్, రంగాపురం నరేంద్రనాయుడు,దిలీప్ కుమార్,ఆంజనప్ప,కుమ్మనమల పెద్దిరాజు,చంద్ర,sc సెల్ రామాంజి,ఉమేష్

అమ్మవారిపేట గ్రామ గుజ్జల తేజస్వరూప్ 14 సం.ల బాలుడు ఉదయం 07.30 గ.లకు మిస్సింగ్..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం అమ్మవారి పేట గ్రామం నందు ఉదయం 7:30 గంటల సమయంలో గుజ్జల తేజ్ స్వరూప్ S/o గుజ్జల నాగేంద్ర 14 సంవత్సరం వయసు గల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు బాలుడు ధరించిన దుస్తులు బ్లాక్ & రెడ్ కలర్ మంకీ క్యాప్ టి షర్ట్ లోయరు ధరించాడు ప్రస్తుతం మాంటిస్సోర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు ఆచూకీ తెలిసినవారు ఈ సెల్ నెంబర్ కు 9963396191 సమాచారం ఇవ్వగలరు

శింగనమల నియోజకవర్గ నూతన ఇన్చార్జిగా నియమితులైన వీరాంజనేయులుకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు..

శింగనమల నియోజకవర్గ సోదర సోదరీమణులకు నమస్కారం, మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ నూతన ఇన్చార్జిగా నియమితులైన వీరాంజనేయులు గారికి ముందుగా శుభాకాంక్షలు. రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రమీల గారి భర్తగా ఆయన మీకు సుపరిచితమే.

వీరిది శింగనమల మండలం బండమీద పల్లి గ్రామం. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సామాజిక సమీకరణలకు, బడుగుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి ఇది న్యాయం కూడా. ఇందులో భాగంగానే మన నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలనే సదుద్దేశంతో జగనన్న ఈరోజు మాదిగ సామాజిక వర్గానికే చెందిన వీరాంజనేయులు గారిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు.

మనమంతా మొదట పార్టీ కార్యకర్తలం, సైనికులం ఆ తర్వాతే ఏదైనా. మన అధినాయకుడి మాట శిరోధార్యం. దీనికి తిరుగేలేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు 2024 ఎన్నికలు మన పార్టీకే కాక ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కూడా చాలా కీలకం. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని, మీడియాని, కులాలని, అవసరాన్ని బట్టి పార్టీలని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలను తన గుప్పిట్లో పెట్టుకొని ఏదైనా చేయగల, దేనికైనా దిగజార గల వెయ్యి తలల రాక్షసుడితో జగనన్న యుద్ధం చేస్తున్నారు. ఈ రాష్ట్రం మళ్ళీ పెత్తందారుల చేతుల్లోకి పోకుండా ఉండాలంటే ఈ రాష్ట్ర ప్రజలను భ్రమల్లో ఉంచి అడ్డంగా దోచుకునే వారి పడగ నీడన పడకుండా ఉండాలంటే ఈ రాష్ట్రంలోని పేదలంతా జగనన్న నీడలో సుభిక్షంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో బడులు ఆసుపత్రులు పోర్టులు పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రాన్ని చూసి దేశం మొత్తం గర్వించాలంటే మళ్లీ జగనన్నే కావాలి మళ్లీ జగనన్నే రావాలి సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయాన్ని అద్భుతమైన సమతుల్యతతో ముందుకు తీసుకెళుతున్న జగనన్న అడుగులో అడుగై మనందరం ముందుకు కదులుదాం. మన నియోజకవర్గం గురించి వస్తే, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు, నేను జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన కోసం మా వంతు పని చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు అనేక కార్యక్రమాల పేరుతో మేము నియోజకవర్గమంతా తిరిగాము. ఇక్కడి ప్రజల కన్నీటి కష్టాలను కళ్లారా చూశాము. అందుకే పద్మావతి గారు ఎన్నికల్లో శింగనమల చెరువు లోకలైజేషన్ మొదలుకొని నీటి సమస్యనే ప్రధాన హామీగా ఇచ్చారు. ఈ క్రమంలోనే నీటికి సంబంధించి శక్తికి మించిన విజయాలను సాధించారు. * శింగనమల చెరువు లోకలైజేషన్ * హంద్రీనీవా నుంచి నియోజకవర్గంలోని చెరువులకు నీటి కేటాయింపు * జి ఎన్ ఎస్ ఎస్ నుంచి పుట్లూరు, సుబ్బరాయ సాగర్, కోమటికుంట్లకు రూ. 450 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ * నార్పల కూతలేరు బ్రిడ్జి * కొర్రపాడులో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల * ఈస్ట్ నరసాపురంలో బీసీ బాలికల గురుకుల పాఠశాల * ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న శింగనమల-గార్లదిన్నె రోడ్డు, నాయన పల్లి క్రాస్ - బొందలవాడ రోడ్డు, మరెన్నో గ్రామాలకు రోడ్లు * అనుమతుల దశలో ఉన్న సింగవరం దగ్గర హై లెవెల్ బ్రిడ్జి, చింతకాయ మంద, చిలమకూరు, శింగనమల మరువ వంకర దగ్గర బ్రిడ్జులు * రూ. 2 కోట్ల వరకు సీఎంఆర్ఎఫ్ * శింగనమల, పుట్లూరుకు కొత్త సర్కిల్ స్టేషన్ల ఏర్పాటు * నియోజకవర్గం మొత్తాన్ని ఒకే డీఎస్పీ పరిధిలోకి తీసుకురావడం మొదలైనవి. ఇవి కాక వ్యక్తిగతంగా మంచినీటి ప్లాంట్ల ఏర్పాటు, చేతనైనంత ఆర్థిక సహాయాలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ చాలా గ్రామాలకు రోడ్లు వేయాల్సి ఉంది, ఇంకా పలు సమస్యలు ఉన్నాయి. అయితే ఐదేళ్లలో అద్భుతాలు చేయడం ఎవరి చేతాకాదు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యే పద్మావతి గారు శక్తినంతా నీటి మీదే కేంద్రీకరించారు. చాలావరకు విజయం సాధించారు. రాబోయే ఐదేళ్లలో, రాబోయే జగనన్న ప్రభుత్వంలో సమిష్టిగా మిగిలిన వాటి మీద దృష్టి పెడదాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపుదాం. అందుకే మనకు బాగా పరిచితుడైన, మన పార్టీలో చురుగ్గా ఉన్న వీరాంజనేయులు గారికి మనమంతా సహకరిద్దాం. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనందరి బాధ్యత రెట్టింపు అయింది. మనమంతా ఇంతకుముందు కంటే ఎక్కువగా కష్టపడాలి, ఇంతకుముందు కంటే ఎక్కువగా కలిసికట్టుగా పోరాడాలి. మన ధ్యేయం ఒక్కటే మన లక్ష్యం ఒక్కటే అది జగనన్న గెలుపు జై జగన్ జోహార్ వైయస్సార్ ధన్యవాదాలతో మీ ఆలూరు సాంబశివారెడ్డి ప్రభుత్వ విద్యా సలహాదారు

వడియపేట గ్రామం లో పైలేరియా ( బోదకాలు) నైట్ బ్లడ్ సర్వే కార్యక్రమము..
బుక్కరాయసముద్రం ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వడియపేట గ్రామం లో పైలేరియా ( బోదకాలు) నైట్ బ్లడ్ సర్వే కార్యక్రమము బుక్కరాయసముద్రం వైద్య సిబ్బంది చేత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిహెచ్ మోహన్ రావు గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మలేరియా సబ్ యూనిట్ ఆఫీస్ నుంచి సబ్ యూనిట్ అధికారి మద్దయ్య గారు, సబ్ యూనిట్ సూపర్వైజర్ శ్రీధర్ మూర్తి నూర్ భాషా గారు హాజరవ్వడం జరిగింది, ఈ సర్వేకు బుక్కరాయసముద్రం ఆరోగ్య కేంద్రం నుంచి ఆరు టీములను ఏర్పాటు చేసి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ రక్తపూతల సేకరణ నిర్వహించడం జరుగుతుంది. వడియం పేట గ్రామంలో సుమారు 300 మందికి రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ రక్త పూతల సేకరణ తర్వాత స్లైట్స్ను జిల్లా పైలేరియా కార్యాలయానికి పంపించడం జరిగింది, అలాగే ప్రతి సంవత్సరము పైలేరియా సర్వేలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జనవరి నెలలో నిర్వహించడం జరుగుతుంది, ఈ బోధకాల వ్యాధి వల్ల ఒక కాలు లావుగా ఉండి మనిషి తను నిర్వహించే రోజువారి కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేకపోవడం, ఈ ఫైలేరియా అనేది క్యూలెక్స్ దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుందని వారు తెలియజేయడం జరిగింది, ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పీహెచ్ఎం చెన్నమ్మ గారు, సూపర్వైజర్ లో జానీ రాజు ,ఈశ్వరమ్మ, హెల్త్ అసిస్టెంట్లు ధనుంజయ శివానంద నాగరాజు ఆనంద్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ గౌతమి శ్రీజ మంజు భార్గవి జ్యోతి యామిని, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు రాజేశ్వరి అంజనమ్మ బొజ్జమ్మ నాగేంద్రమ్మ లక్ష్మీదేవి, నందిని, మరియు ఆశా కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
మండల స్థాయి శిక్షణా కార్యక్రమానికి హాజరై నమండల అధ్యక్షులు గౌరవ శ్రీమతి దాసరి సునీత

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక 2024-25 సంవత్సరం లో చేపట్టబోవు ప్రాధాన్యత గల పనుల వివరములు గురించి

ప్రణాళిక తయారీ గురించి మండల స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు గౌరవ శ్రీమతి దాసరి సునీత గారు, మండల ప్రత్యేక అధికారి శ్రీమతి B.N శ్రీదేవి గారు , గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, EOPR&RD శ్రీమతి దామోదరమ్మ గారు,పరిపాలనధికారి

శ్రీమతి A.శ్రీవాణి గారు, మండల స్థాయి అధికారులు,పంచాయితీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ , ఎకాలాజికల్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ శివశంకర్ గారు రిసోర్స్ పర్సన్ శ్రీ సుబ్బరాయుడు గారు హాజరైనారు.