యాదాద్రి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై అవిశ్వాసం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై ఈరోజు కౌన్సిలర్లు అవిశ్వాసం తెలిపారు

ఈ మేరకు అవిశ్వాస తీర్మాన పత్రాలను కలెక్టర్‌ హనుమంతుకు ఇచ్చారు. తీర్మానంపై ఐదుగురు బీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సంతకాలు చేశారు

దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళ

దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళగా ఇటీవల జులేఖా దావూద్‌ వార్తల్లో నిలిచారు.

ఫోర్బ్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ టాప్‌ 100 ఇండియన్‌ లీడర్స్‌ ఇన్‌ యూఏఈ’లో చోటు దక్కించుకున్నారు

84 ఏళ్ల జులేఖా ప్రస్తుతం రూ.3632 కోట్ల రెవెన్యూతో ఆ దేశంలో అగ్రస్థానంలో నిలిచారు.

1964లో ప్రాక్టీస్‌ కోసం యూఏఈ వెళ్లిన తొలి భారత మహిళా వైద్యురాలి గా రికార్డుల కెక్కారు

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసు కున్నాయి

ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయి స్టులు ఉన్నారు

ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

మెదక్ జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది

రామాయంపేట మండలం కోనాపూర్ చెరువు వద్ద ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. మృతుడు జోగిపేటకు చెందిన చాకలి మల్లేశంగా గుర్తించారు

గుర్తు తెలియని వ్యక్తులు చాకలి మల్లేశంను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది

లండన్ లో బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

లండన్ లో బీఆర్ఎస్ నేతలపై ఈరోజు సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు

బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతు న్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

చంద్రబాబు హెలికాప్టర్‌‎లో సమన్వయ లోపం

ఈ రోజు విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్‌‎లో సమన్వయ లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం ఏర్పడింది

నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో ప్రయాణించిన హెలికాప్టర్‌‎. పైలట్ రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు హెచ్చరించిన ఏటీసీ అధికారులు. ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్‌ వెనుదిరిగింది

కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది.తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు

గత రెండు రోజుల క్రితం గుడివాడలో సభ జరుగగా శనివారం అరకులో పార్లమెంటర్ నియోజక వర్గంలో సభను నిర్వహిం చారు. ఈ సభకు హాజర య్యే క్రమంలో విశాఖ నుంచి అరకు బయలు దేరారు.ఈ క్రమంలోనే ఈఘటన తలెత్తింది

రెండో పెళ్లికి సిద్ధపడిన షోయబ్ మాలిక్

పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ షాక్‌ ఇచ్చాడు. తన భార్య టీమిండియా టెన్నిస్‌ క్రీడాకారిణీ సానియా మీర్జాతో దూరంగా ఉంటోన్న అతను మరోసారి పెళ్లి పీటలెక్కాడు.

పాకిస్తాన్‌కే చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌తో కలిసి శనివారం నిఖా చేసుకున్నాడు. గత కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే సమయంలో సానియాతో షోయబ్‌ విడాకులు తీసుకుంటు న్నట్లు ప్రచారం జరిగింది. అయితే వీటిపై ఎవరూ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ సడెన్‌గా మరోసారి పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చాడు.

షోయబ్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలను షోయబ్‌ నే ట్విట్టర్‌ లో షేర్‌ చేసుకోవడం గమనార్హం. సానియాతో విడాకుల ప్రచారం సాగుతుండగానే షోయబ్‌ సనాల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి

సానియా షోయబ్‌లది కూడా ప్రేమ వివాహం. ఇద్దరూ 2010లో హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో వలీమా వేడుక చేసుకున్నారు.

మాలిక్ సానియా మీర్జాలకు 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు

అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత చంద్రబాబుకు లేదుమంత్రి రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా చంద్ర‌బాబు పై ఈరోజు మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తారు.

100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని దుయ్యాబ‌ట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు

ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అన్న చంద్రబాబుకు నైతిక అర్హత లేదని చెప్పారు. అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేశారని రోజా కొనియాడారు

అంబేద్కర్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సామాజిక న్యాయాన్ని జగన్ చేస్తున్నారని అన్నారు.

జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోందని దుయ్యబట్టారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న శ్యామల దేవి

దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయా ల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

శనివారం కృష్ణంరాజు జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాట్లను శ్యామలాదేవి చూసుకుంటున్నారు.

జయంతి వేడుకలు,హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందిస్తానని తెలిపారు.

వైసీపీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శ్యామలా దేవి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది

అండర్ 19 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ తో ఇండియా తొలి పోరు

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ లో శనివారం బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఢీకొట్టనుంది.

మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఉదయ్ సహరన్ నేతృత్వంలో టీమిండియా బరిలోకి దిగుతోంది.

అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ దశలో పాయింట్ల పట్టిక ఆధారంగా 12 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ నుంచి నాలుగు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు 41 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఫిబ్రవరి 11న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఐసిసి మెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా హవా కొనుసాగినట్లే అండర్ 19 వన్డే ప్రపంచకప్‌లలో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

అండర్ 19 వన్డే వరల్డ్ లో టీమిండియాలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ కైఫ్ వంటి ఆటగాళ్లు అండర్ 19 నుంచి టీమిండియాలోకి వచ్చారు.