చంద్రబాబు హెలికాప్టర్‌‎లో సమన్వయ లోపం

ఈ రోజు విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్‌‎లో సమన్వయ లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం ఏర్పడింది

నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో ప్రయాణించిన హెలికాప్టర్‌‎. పైలట్ రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు హెచ్చరించిన ఏటీసీ అధికారులు. ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్‌ వెనుదిరిగింది

కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది.తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు

గత రెండు రోజుల క్రితం గుడివాడలో సభ జరుగగా శనివారం అరకులో పార్లమెంటర్ నియోజక వర్గంలో సభను నిర్వహిం చారు. ఈ సభకు హాజర య్యే క్రమంలో విశాఖ నుంచి అరకు బయలు దేరారు.ఈ క్రమంలోనే ఈఘటన తలెత్తింది

రెండో పెళ్లికి సిద్ధపడిన షోయబ్ మాలిక్

పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ షాక్‌ ఇచ్చాడు. తన భార్య టీమిండియా టెన్నిస్‌ క్రీడాకారిణీ సానియా మీర్జాతో దూరంగా ఉంటోన్న అతను మరోసారి పెళ్లి పీటలెక్కాడు.

పాకిస్తాన్‌కే చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌తో కలిసి శనివారం నిఖా చేసుకున్నాడు. గత కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే సమయంలో సానియాతో షోయబ్‌ విడాకులు తీసుకుంటు న్నట్లు ప్రచారం జరిగింది. అయితే వీటిపై ఎవరూ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ సడెన్‌గా మరోసారి పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చాడు.

షోయబ్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలను షోయబ్‌ నే ట్విట్టర్‌ లో షేర్‌ చేసుకోవడం గమనార్హం. సానియాతో విడాకుల ప్రచారం సాగుతుండగానే షోయబ్‌ సనాల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి

సానియా షోయబ్‌లది కూడా ప్రేమ వివాహం. ఇద్దరూ 2010లో హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో వలీమా వేడుక చేసుకున్నారు.

మాలిక్ సానియా మీర్జాలకు 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు

అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత చంద్రబాబుకు లేదుమంత్రి రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా చంద్ర‌బాబు పై ఈరోజు మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తారు.

100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని దుయ్యాబ‌ట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు

ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అన్న చంద్రబాబుకు నైతిక అర్హత లేదని చెప్పారు. అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేశారని రోజా కొనియాడారు

అంబేద్కర్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సామాజిక న్యాయాన్ని జగన్ చేస్తున్నారని అన్నారు.

జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోందని దుయ్యబట్టారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న శ్యామల దేవి

దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయా ల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

శనివారం కృష్ణంరాజు జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాట్లను శ్యామలాదేవి చూసుకుంటున్నారు.

జయంతి వేడుకలు,హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందిస్తానని తెలిపారు.

వైసీపీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శ్యామలా దేవి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది

అండర్ 19 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ తో ఇండియా తొలి పోరు

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ లో శనివారం బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఢీకొట్టనుంది.

మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఉదయ్ సహరన్ నేతృత్వంలో టీమిండియా బరిలోకి దిగుతోంది.

అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ దశలో పాయింట్ల పట్టిక ఆధారంగా 12 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ నుంచి నాలుగు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు 41 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఫిబ్రవరి 11న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఐసిసి మెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా హవా కొనుసాగినట్లే అండర్ 19 వన్డే ప్రపంచకప్‌లలో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

అండర్ 19 వన్డే వరల్డ్ లో టీమిండియాలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ కైఫ్ వంటి ఆటగాళ్లు అండర్ 19 నుంచి టీమిండియాలోకి వచ్చారు.

Gidugu Rudraraja: అందుకే ఏపీసీసీ పదవికి రాజీనామా చేశా

హైదరాబాద్: సామాన్య కార్యకర్తగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్థాయివరకు తీసుకువచ్చిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఎన్ఎస్‌సీలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత యువజన కాంగ్రెస్, నలుగురు పీసీసీ అధ్యక్షులవద్ద ప్రధాన కార్యదర్శిగా పని చేశానని, ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశానని, ప్రధానంగా దివంగత రాజశేఖర్ రెడ్డికి అనుంగశిష్యుడిగా పని చేసిన అవకాశం లభించిందని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీగా పని చేశానని, 23 నవంబర్, 2022న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని రుద్రరాజు తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలు ముఖ్యంగా భావించి పీసీసీ పదవికి రాజీనామా చేశానన్నారు. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయితే ఏపీలో కాంగ్రెస్ లబ్ది చేకూరుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయం కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినప్పుడు చెప్పానన్నారు. ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని వైఎస్ఆర్ కోరికని వైఎస్ తనయగా ఆ కోరికను తీర్చేందుకు కాంగ్రెస్‌లో పనిచేసేందుకు షర్మిల వస్తున్నారని, అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాలు ముఖ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అందరం కలిసి సమిష్టిగా పని చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో.. ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వైఎస్ షర్మిల రాకతో కొత్త ఉత్సాహం వస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. దివంగత వైఎస్సార్ కుమార్తె కావడంతో ఆమె చేరిక కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీని వీడిన పలువురు నేతలు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు

Chandrababu: కనీసం మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా చంద్రబాబు

అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు

గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని వెళ్లడం దురదృష్టకరమని.. ఇలాంటి దుస్థితి రాకూడదనే గతంలో ఫీడర్‌ అంబులెన్సులు తీసుకొచ్చినట్లు చెప్పారు. వాటిని పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

తల్లి, బిడ్డ చనిపోయేందుకు కారణం ప్రభుత్వ అలసత్వం కాదా కనీసం మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనిఘటనపై విచారణ జరిపించాలి. చిట్టంపాడు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని చంద్రబాబు తెలిపారు.

భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది.

ఎస్ కోట మండలం చిట్టెంపాడుకి చెందిన మాదల గంగన్న, గంగమ్మ లకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. అకస్మాత్తుగా వారి కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు.

దీంతో చికిత్స నిమిత్తం స్వగ్రామం చిట్టెంపాడు గిరిశిఖర గ్రామం నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అతి కష్టం మీద కుమారు డిని డోలిలో క్రిందకి చేర్చి అక్కడ నుండి విశాఖ ఆస్పత్రికి తరలించారు.

అయితే గంగన్న కుమా రుడు చికిత్స పొందుతూనే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి లోనే మృతి చెందాడు. కుమారుడు మృతి విషయం తెలుసుకున్న తల్లి గంగమ్మ తీవ్ర మనస్థాపానికి గురై ఆమె కూడా అనారో గ్యానికి గురైంది.

దీంతో వెంటనే గంగన్న తన భార్యను తీసుకొని కావడి సహాయంతోనే చిట్టెంపాడు నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు చేర్చి అక్కడ నుండి విశాఖ ఆసుపత్రికి తరలించారు.

గంగమ్మ కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించింది. వారం రోజుల వ్యవధిలో భార్యతో పాటు ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటంతో కన్నీరు మున్నీరుగా రోదించాడు.గంగన్న. ఇక చేసేదిలేక గంగమ్మ మృతదేహాన్ని విశాఖ ప్రైవేట్ ఆస్పత్రి నుండి స్వగ్రామానికి తరలిం చేందుకు సిద్ధమయ్యాడు.

అందుకోసం ఎస్ కోట వరకు ఆటోలో తీసుకెళ్ళాడు. అలా మృతదేహాన్ని ఎస్ కోటలో దించి అక్కడ నుండి ఆటో డ్రైవర్ వెనుతిరిగాడు. అయితే ఎస్ కోట నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు మరో ఆటోలో తరలించేందుకు గంగన్న వద్ద డబ్బులు లేవు. దీంతో స్నేహితుడి బైక్ పైనే కూర్చోబెట్టి నానా అవస్థలు పడుతూ కొండ దిగువన ఉన్న దబ్బగుంటకి మృతదేహాన్ని తరలిం చాడు.

అనంతరం అక్కడ నుండి కొండ మీద ఉన్న తన స్వగ్రామమైన చిట్టెంపాడుకి కావడి సహాయంతోనే సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర రాళ్లు రప్పల మధ్య అనేక అగచాట్లు పడి భార్య గంగమ్మ మృతదేహాన్ని ఇంటికి తరలించాడు.

గంగన్న కష్టాన్ని చూసిన స్థానికులకు ఏడుపు ఆగలేదు. గంగన్న భార్య మృతదేహాన్ని బైక్ పై తరలిస్తుంటే స్థానికులం దరూ ప్రేక్షక పాత్ర పోషించా రే తప్పా ఏ ఒక్కరూ మాన వత్వంతో సహాయం చేసేం దుకు ముందుకు రాలేదు.

మూగ సైగలతో వాదించిన మహిళా న్యాయవాది

సుప్రీంకోర్టులో సైగల భాషతో వాదించిన మహిళా న్యాయ వాది,ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో సైగల భాషతో వాదించి సారా సన్నీ అనే మహిళా న్యాయవాది వార్తల్లో నిలిచారు.

బధిరురాలు అయిన ఈమె కర్ణాటక బార్‌ కౌన్సిల్‌లో సభ్యురాలు. సైన్‌ లాంగ్వేజ్‌లో వాదనలు జరగటం దేశంలో ఇదే మొదటిసారి.

ఈమె వాదనను ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ వ్యాఖ్యాత సౌరవ్‌ రామ్‌ చౌదరి అనువదించారు.

ప్రముఖ మలయాళ నటుని కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని

ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న మోదీ కోచ్చిలో రోడ్డు షో నిర్వహించిన అనంతరం నేరుగా ఆలయానికి వచ్చి, వధూవరులను ఆశీర్వదిం చారు.

వారిద్దరికీ స్వయంగా మోదీ వరమాలలు అందించారు. అదే ఆలయంలో వివాహం జరుపుకుంటున్న మరో 30 జంటలకు కూడా మోదీ ఆశీర్వచనాలు అంద జేశారు.

ప్రముఖ నటుడు మోహన్ లాల్ తోపాటు మలయాళ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు కూడా సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి హాజరయ్యారు.