శింగనమల నియోజకవర్గ నూతన ఇన్చార్జిగా నియమితులైన వీరాంజనేయులుకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు..
శింగనమల నియోజకవర్గ సోదర సోదరీమణులకు నమస్కారం, మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ నూతన ఇన్చార్జిగా నియమితులైన వీరాంజనేయులు గారికి ముందుగా శుభాకాంక్షలు. రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రమీల గారి భర్తగా ఆయన మీకు సుపరిచితమే.
వీరిది శింగనమల మండలం బండమీద పల్లి గ్రామం. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సామాజిక సమీకరణలకు, బడుగుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి ఇది న్యాయం కూడా. ఇందులో భాగంగానే మన నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలనే సదుద్దేశంతో జగనన్న ఈరోజు మాదిగ సామాజిక వర్గానికే చెందిన వీరాంజనేయులు గారిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు.
మనమంతా మొదట పార్టీ కార్యకర్తలం, సైనికులం ఆ తర్వాతే ఏదైనా. మన అధినాయకుడి మాట శిరోధార్యం. దీనికి తిరుగేలేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు 2024 ఎన్నికలు మన పార్టీకే కాక ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కూడా చాలా కీలకం. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని, మీడియాని, కులాలని, అవసరాన్ని బట్టి పార్టీలని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలను తన గుప్పిట్లో పెట్టుకొని ఏదైనా చేయగల, దేనికైనా దిగజార గల వెయ్యి తలల రాక్షసుడితో జగనన్న యుద్ధం చేస్తున్నారు. ఈ రాష్ట్రం మళ్ళీ పెత్తందారుల చేతుల్లోకి పోకుండా ఉండాలంటే ఈ రాష్ట్ర ప్రజలను భ్రమల్లో ఉంచి అడ్డంగా దోచుకునే వారి పడగ నీడన పడకుండా ఉండాలంటే ఈ రాష్ట్రంలోని పేదలంతా జగనన్న నీడలో సుభిక్షంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో బడులు ఆసుపత్రులు పోర్టులు పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రాన్ని చూసి దేశం మొత్తం గర్వించాలంటే మళ్లీ జగనన్నే కావాలి మళ్లీ జగనన్నే రావాలి సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయాన్ని అద్భుతమైన సమతుల్యతతో ముందుకు తీసుకెళుతున్న జగనన్న అడుగులో అడుగై మనందరం ముందుకు కదులుదాం. మన నియోజకవర్గం గురించి వస్తే, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు, నేను జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన కోసం మా వంతు పని చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు అనేక కార్యక్రమాల పేరుతో మేము నియోజకవర్గమంతా తిరిగాము. ఇక్కడి ప్రజల కన్నీటి కష్టాలను కళ్లారా చూశాము. అందుకే పద్మావతి గారు ఎన్నికల్లో శింగనమల చెరువు లోకలైజేషన్ మొదలుకొని నీటి సమస్యనే ప్రధాన హామీగా ఇచ్చారు. ఈ క్రమంలోనే నీటికి సంబంధించి శక్తికి మించిన విజయాలను సాధించారు. * శింగనమల చెరువు లోకలైజేషన్ * హంద్రీనీవా నుంచి నియోజకవర్గంలోని చెరువులకు నీటి కేటాయింపు * జి ఎన్ ఎస్ ఎస్ నుంచి పుట్లూరు, సుబ్బరాయ సాగర్, కోమటికుంట్లకు రూ. 450 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ * నార్పల కూతలేరు బ్రిడ్జి * కొర్రపాడులో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల * ఈస్ట్ నరసాపురంలో బీసీ బాలికల గురుకుల పాఠశాల * ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న శింగనమల-గార్లదిన్నె రోడ్డు, నాయన పల్లి క్రాస్ - బొందలవాడ రోడ్డు, మరెన్నో గ్రామాలకు రోడ్లు * అనుమతుల దశలో ఉన్న సింగవరం దగ్గర హై లెవెల్ బ్రిడ్జి, చింతకాయ మంద, చిలమకూరు, శింగనమల మరువ వంకర దగ్గర బ్రిడ్జులు * రూ. 2 కోట్ల వరకు సీఎంఆర్ఎఫ్ * శింగనమల, పుట్లూరుకు కొత్త సర్కిల్ స్టేషన్ల ఏర్పాటు * నియోజకవర్గం మొత్తాన్ని ఒకే డీఎస్పీ పరిధిలోకి తీసుకురావడం మొదలైనవి. ఇవి కాక వ్యక్తిగతంగా మంచినీటి ప్లాంట్ల ఏర్పాటు, చేతనైనంత ఆర్థిక సహాయాలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ చాలా గ్రామాలకు రోడ్లు వేయాల్సి ఉంది, ఇంకా పలు సమస్యలు ఉన్నాయి. అయితే ఐదేళ్లలో అద్భుతాలు చేయడం ఎవరి చేతాకాదు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యే పద్మావతి గారు శక్తినంతా నీటి మీదే కేంద్రీకరించారు. చాలావరకు విజయం సాధించారు. రాబోయే ఐదేళ్లలో, రాబోయే జగనన్న ప్రభుత్వంలో సమిష్టిగా మిగిలిన వాటి మీద దృష్టి పెడదాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపుదాం. అందుకే మనకు బాగా పరిచితుడైన, మన పార్టీలో చురుగ్గా ఉన్న వీరాంజనేయులు గారికి మనమంతా సహకరిద్దాం. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనందరి బాధ్యత రెట్టింపు అయింది. మనమంతా ఇంతకుముందు కంటే ఎక్కువగా కష్టపడాలి, ఇంతకుముందు కంటే ఎక్కువగా కలిసికట్టుగా పోరాడాలి. మన ధ్యేయం ఒక్కటే మన లక్ష్యం ఒక్కటే అది జగనన్న గెలుపు జై జగన్ జోహార్ వైయస్సార్ ధన్యవాదాలతో మీ ఆలూరు సాంబశివారెడ్డి ప్రభుత్వ విద్యా సలహాదారు
Jan 20 2024, 06:19