భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది.

ఎస్ కోట మండలం చిట్టెంపాడుకి చెందిన మాదల గంగన్న, గంగమ్మ లకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. అకస్మాత్తుగా వారి కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు.

దీంతో చికిత్స నిమిత్తం స్వగ్రామం చిట్టెంపాడు గిరిశిఖర గ్రామం నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అతి కష్టం మీద కుమారు డిని డోలిలో క్రిందకి చేర్చి అక్కడ నుండి విశాఖ ఆస్పత్రికి తరలించారు.

అయితే గంగన్న కుమా రుడు చికిత్స పొందుతూనే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి లోనే మృతి చెందాడు. కుమారుడు మృతి విషయం తెలుసుకున్న తల్లి గంగమ్మ తీవ్ర మనస్థాపానికి గురై ఆమె కూడా అనారో గ్యానికి గురైంది.

దీంతో వెంటనే గంగన్న తన భార్యను తీసుకొని కావడి సహాయంతోనే చిట్టెంపాడు నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు చేర్చి అక్కడ నుండి విశాఖ ఆసుపత్రికి తరలించారు.

గంగమ్మ కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించింది. వారం రోజుల వ్యవధిలో భార్యతో పాటు ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటంతో కన్నీరు మున్నీరుగా రోదించాడు.గంగన్న. ఇక చేసేదిలేక గంగమ్మ మృతదేహాన్ని విశాఖ ప్రైవేట్ ఆస్పత్రి నుండి స్వగ్రామానికి తరలిం చేందుకు సిద్ధమయ్యాడు.

అందుకోసం ఎస్ కోట వరకు ఆటోలో తీసుకెళ్ళాడు. అలా మృతదేహాన్ని ఎస్ కోటలో దించి అక్కడ నుండి ఆటో డ్రైవర్ వెనుతిరిగాడు. అయితే ఎస్ కోట నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు మరో ఆటోలో తరలించేందుకు గంగన్న వద్ద డబ్బులు లేవు. దీంతో స్నేహితుడి బైక్ పైనే కూర్చోబెట్టి నానా అవస్థలు పడుతూ కొండ దిగువన ఉన్న దబ్బగుంటకి మృతదేహాన్ని తరలిం చాడు.

అనంతరం అక్కడ నుండి కొండ మీద ఉన్న తన స్వగ్రామమైన చిట్టెంపాడుకి కావడి సహాయంతోనే సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర రాళ్లు రప్పల మధ్య అనేక అగచాట్లు పడి భార్య గంగమ్మ మృతదేహాన్ని ఇంటికి తరలించాడు.

గంగన్న కష్టాన్ని చూసిన స్థానికులకు ఏడుపు ఆగలేదు. గంగన్న భార్య మృతదేహాన్ని బైక్ పై తరలిస్తుంటే స్థానికులం దరూ ప్రేక్షక పాత్ర పోషించా రే తప్పా ఏ ఒక్కరూ మాన వత్వంతో సహాయం చేసేం దుకు ముందుకు రాలేదు.

మూగ సైగలతో వాదించిన మహిళా న్యాయవాది

సుప్రీంకోర్టులో సైగల భాషతో వాదించిన మహిళా న్యాయ వాది,ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో సైగల భాషతో వాదించి సారా సన్నీ అనే మహిళా న్యాయవాది వార్తల్లో నిలిచారు.

బధిరురాలు అయిన ఈమె కర్ణాటక బార్‌ కౌన్సిల్‌లో సభ్యురాలు. సైన్‌ లాంగ్వేజ్‌లో వాదనలు జరగటం దేశంలో ఇదే మొదటిసారి.

ఈమె వాదనను ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ వ్యాఖ్యాత సౌరవ్‌ రామ్‌ చౌదరి అనువదించారు.

ప్రముఖ మలయాళ నటుని కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని

ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న మోదీ కోచ్చిలో రోడ్డు షో నిర్వహించిన అనంతరం నేరుగా ఆలయానికి వచ్చి, వధూవరులను ఆశీర్వదిం చారు.

వారిద్దరికీ స్వయంగా మోదీ వరమాలలు అందించారు. అదే ఆలయంలో వివాహం జరుపుకుంటున్న మరో 30 జంటలకు కూడా మోదీ ఆశీర్వచనాలు అంద జేశారు.

ప్రముఖ నటుడు మోహన్ లాల్ తోపాటు మలయాళ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు కూడా సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి హాజరయ్యారు.

యాదాద్రి జిల్లాలో గుండెపోటుతో గౌడ్ మృతి

భువ‌న‌గిరి జిల్లా మోత్కూర్ ప‌రిధిలోని రాజ‌న్న‌గూడెంలో బుధవారం విషాదం నెల‌కొంది.

తాటి చెట్టుపైనే గుండెపోటుతో గీత కార్మికుడు మృతి చెందాడు. గీత కార్మికుడి డెడ్‌బాడీని తాటి చెట్టుపై నుంచి కింద‌కు దించారు పోలీసులు.

ల‌క్ష్మ‌య్య‌(68) అనే గీత కార్మికుడు క‌ల్లు గీసేందుకు బుధ‌వారం ఉద‌యం తాటి చెట్టు ఎక్కాడు. క‌ల్లు గీస్తుండ‌గానే ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చింది. దీంతో చెట్టుపైనే ల‌క్ష్మ‌య్య ప్రాణాలొదిలాడు.

స్థానిక రైతులు ల‌క్ష్మ‌య్య‌ను గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. మృత‌దేహాన్ని కింద‌కు దించారు.

ల‌క్ష్మ‌య్య మృతితో ఆయ‌న కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగి పోయారు. గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ లు

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐపిఎస్ లు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయికిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిలను తెలంగాణ క్యాడ‌ర్ కు కేటాయించింది.

నేడు మేడారం జాతరను పర్యవేక్షించునున్న మంత్రులు సీతక్క కొండ సురేఖ

ములుగు జిల్లాలో నేడు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్కపర్యటించ నున్నారు. తాడ్వాయి మండలం మేడారంలో మేడారం మహా జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ నున్నారు.

కాగా, ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21న బుధవారం.. కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు.

అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దలపైకి పూజారులు తీసుకొస్తారు. 22న గురువారం.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి.. గద్దెపై ప్రతిష్టిస్తారు.

23న శుక్రవారం.. వన దేవతలు గద్దెలపై కొలువు దీరుతారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు కేటాయించి సమీక్షలు నిర్వహించినా ఇంకా కొన్ని పనులు పూర్తి కాలేదు.

జాతరకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రులు మరోసారి ఏర్పాట్లపై సమీక్షించను న్నారు.

తెలంగాణలో ఆదాని గ్రూప్స్ భారీగా పెట్టుబడులు

అదానీ గ్రూప్ తెలంగాణలో అధిక వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ డబ్ల్యూఈఎఫ్ లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమా వేశ మయ్యారు.తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు ఎంవోయూలను కుదుర్చు కుంది.

హైదరాబాద్‌లో ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం, అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడానికి రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

చందనవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీకాన్ఎక్స్ డేటా సెంటర్ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో (MTPA) సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌లో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

అలాగే తెలంగాణలోని హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్‌లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు లకు అవసరమైన సౌక ర్యాలు, మౌలిక సదుపా యాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

KTR: జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య

ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు

జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు

ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్ గుంటూరు టీడీపీలో ముసలం

గుంటూరు టీడీపీలో ముసలం మొదలైనట్లు కనపడుతోంది. మాజీమంత్రి ఆలపాటి రాజా తన నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది..

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ కు సీటు కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది.

నాదెండ్లకు సీటు కేటాయిస్తే పార్టీ కేడర్ తలోదారి వెళ్తారని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. దీంతో ఆలపాటి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, అధిష్టానం చెప్పే వరకు వేచి చూడాలంటున్నారు ఆలపాటి రాజా..

వారం రోజుల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు మాజీమంత్రి ఆలపాటి రాజాతో భేటీ అవుతున్నారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తే కనుక అక్కడి నుంచి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఆలపాటి రాజా గత మూడుసార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనుభవం ఉన్న నాయకుడు కూడా. దాదాపుగా 15 సంవత్సరాలుగా కేడర్ పని చేస్తోంది. ఆలపాటికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం తలోదారి వెళ్తామని కేడర్ చెబుతోంది. దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయి. తాజాగా ఆలపాటి రాజా నివాసంలో భేటీ జరిగింది.

తెనాలి నియోజకవర్గంలో మళ్లీ టీడీపీనే పోటీ చేయాలని, ఆలపాటి రాజాకే కచ్చితంగా టికెట్ ఇవ్వాలని కేడర్ కోరుతోంది. అలా కాదని పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తే, నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తే.. ఆయనకు మేము సహకరించేది లేదని స్థానిక నాయకులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా తెనాలి టికెట్ ను జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒకింత ఆందోళన చెందుతున్నారు

అయితే, అప్పుడే తొందరపడొద్దని, టీడీపీ హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూద్దామని కార్యకర్తలతో మాజీమంత్రి ఆలపాటి రాజా చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆలపాటి రాజాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాల్సిందే అని ఆయనపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్‌

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది..

ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం సమాచారమిచ్చింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 18 చివరి తేదీ. 29న ఎన్నికలు జరగనున్నాయి