PM Modi పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది: మోదీ

మన పన్నుల వ్యవస్థ సరళంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌)ను ప్రధాని మంగళవారం ప్రారంభించారు..

అనంతరం ఆయన మాట్లాడుతూ...''వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నాసిన్‌ ఏర్పాటు చేశాం. ఇది ప్రముఖ శిక్షణా సంస్థగా, సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారనుంది. సత్యసాయిబాబా స్వస్థలం పుట్టపర్తి కూడా ఈ జిల్లాలోనే ఉంది. గాంధీజీ అనేక సార్లు రామరాజ్యం గురించి ప్రస్తావించారు. రామరాజ్యంలో అందినట్లు ప్రజలకు సుపరిపాలన అందాలని ఆయన చెప్పారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలి.

జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చాం

నాసిన్‌ దేశంలో ఆధునిక ఎకో సిస్టంగా మారనుంది. ఇక్కడ జరిగే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఎంతో ప్రయోజనం. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేది. భూమి నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్టు పన్నుల విధానం ఉండాలి. జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చాం. ఆదాయపన్ను చెల్లింపు విధానాన్నీ సులభతరం చేశాం. మేం వచ్చాక ఆదాయపన్ను పరిమితి పెంచాం. పన్ను చెల్లించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పన్నులు వసూలవుతున్నాయి. వచ్చే ఆదాయంతో దేశంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పదేళ్లుగా పన్ను రాబడి పెరిగింది. ఆ మొత్తంతో పెండింగ్‌లో ఉన్న అనేక పనులను పూర్తి చేశాం

25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం

పేదలు రైతులు మహిళలు యువత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం వారి కోసం పదేళ్లుగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం మా పథకాలు కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. తొమ్మిదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం పేదల సమస్యలు తొలగించడమే ప్రభుత్వ ప్రాధాన్యం కావాలి వారి జీవితాలు బాగుపడ్డాయనే విషయం నీతిఆయోగ్‌ చెప్పింది వివిధ ఉపాధి అవకాశాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చాం అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతోంది పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది మేం వచ్చాక వాణిజ్య విధానాన్ని సులభతరం చేశాం అని వివరించారు

ప్రొఫెసర్ కోదండరామ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన 25 ఏళ్ల పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో భేటీ అయ్యారు.

ఇవాళ హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ కోదండారమ్ నివాసంలో ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, జాన్సీ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు

ఈ సందర్భంగా వారిని కోదండరామ్ శాలువాతో సన్మానించారు. అనంతరం తాజా రాజకీయాలపై చర్చించారు. నియోజవర్గం అభివృద్ధి కోసం తమ సలాహాలు సూచనలు అవసరమని ప్రొఫెసర్ కోదండరామ్ ని కోరారు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు..

ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా, ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

బోగీ సంబ‌రాల‌లో జ‌గ‌న్ దంప‌తులు

తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి వేడుకల్లో పాల్గొదంప‌తుల

సాంప్రదాయ దుస్తుల్లో జగన్ దంపతులు భోగి మంటలు వేయడంతో పాటు పండుగ సంబురా లను మొదలు పెట్టారు.

అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. వేదపండి తులు సీఎం జగన్‌ దంప తులకు ఆశీర్వాదం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

ఏలూరు జిల్లాలో భోగి పండుగ పూట విషాదం

ఏపీలో భోగీ పండుగ పూట ఆదివారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది.

ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని కానుకొల్లు గ్రామంలో ముగ్గు వేస్తున్న ఇద్దరు అక్క, చెల్లెలిని వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(17) అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పో యింది.మరో యువతి పల్లవిదుర్గ(18)కి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో లారీ డ్రైవర్ పరిపోగా.. మరో వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. గాయ పడిన పల్లవిదుర్గను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టుకున్న వ్యక్తిని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ట్లు పోలీసులు చెప్పారు.

ఆలయం ఆవరణలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం

మేడ్చల్ జిల్లా సూరారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపుతోంది.

శివాలయం వద్దనున్న ఖాళీ స్థలంలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృత దేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు.

ఆదివారం భోగి పండుగ సందర్బంగా ఆలయానికి వచ్చిన భక్తులకు దుర్వాసన రావడంతో పరిసరాలను పరిశీలించగా మృతదేహం కనిపించింది.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బస్సులపై RTA స్పెషల్ డ్రైవ్

విశాఖలో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఆగనంపూడి టోల్‌ప్లాజా దగ్గర అధికారులు తనిఖీలు చేశారు.

ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని 20 బస్సులపై జరిమానా విధించారు.

కాగా బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజ మాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కాయి.

రూల్స్ పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరి స్తున్నారు.

అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయట పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది.

శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిమ్మనపల్లి నుండి పెద్ద కలువలకు వెళ్తున్న టీ ఎస్ 10 ఈఎల్ 2029 అనే నంబర్ గల నెక్సా కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకు వెళ్ళింది.

ఈ ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడి కక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న గాదె అఖిల్, అల్లం బాల అనురోహిత్ రెడ్డి, సాయిలు బావిలో నుండి పైపు ద్వారా బయ టికి వచ్చి క్షేమంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ సంఘటన స్థలాన్ని పరి శీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ యూనివర్సిటీలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.

నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నా మని, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు.

జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు శుక్రవారం వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయం లో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

5 వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొనగా 6500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు

AP Govt: అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీలను చర్చలకు పిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌తో చర్చలు జరపనున్నారు..

ఈ సమావేశానికి అంగన్వాడి వర్కర్ల కార్మిక సంఘాలు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికీ 32 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో ఐదు సార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలు జరపనున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు.. సమ్మె విరమించుకోమని తేల్చి చెబుతున్నారు అంగన్వాడీలు