జగనన్నకు చెబుదాం " అనే ప్రోగ్రాంలో ప్రజా సమస్యలపై ఆర్డీవో గారికి వినతి పత్రం అందజేసిన సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు తరిమేల రామాంజనేయులు..
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ద్వారా శింగణమాల మండలంలోని తాసిల్దార్ కార్యాలయం వద్దజరుగుతున్న "జగనన్నకు చెబుదాం " అనే ప్రోగ్రాంలో ప్రజా సమస్యలపై ఆర్డీవో గారికి వినతి పత్రం! సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు తరిమేల రామాంజనేయులు.. మాట్లాడుతూ! ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం వర్షాలు లేక పెట్టిన పంట ఎండిపోయి రైతుల అప్పుల ఊబిలో కూరాకు పోతున్నారు. ప్రభుత్వమే జిల్లాలో 31 మండలాలు ఉంటే 28 మండలాల్లో కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయ చర్యలు చేయి పట్టకపోవడం దారుణం, వెంటనే పంట ఏసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అలాగే వర్షాలు లేక పంట సాగు చేయని వారికి కూడా ప్రభుత్వ ఆదుకోవాలి, అలాగే బ్యాంకులో ఉన్నా క్రాప్ రుణాలను రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలి. వలసలు నివారించి వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు పెంచి రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీలో కంపచెట్లతో వనములాగ తయారైనది. ఇల్లు లేని నిరుపేదలకు జగనన్న ఇండ్లు అందని ద్రాక్ష లాగా తయారైనది. వెంటనే ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు కట్టించాలి. మండల వ్యాప్తంగా రీ సర్వే పేరుతో ప్రభుత్వం రైతులకున్న భూమి సక్రమంగా కొలవకుండా తక్కువ కొలిచి రికార్డు కన్నా తక్కువ భూమిని చూపిస్తూ రైతుల మధ్య వైరుధ్యం పెంచుతున్నది. కావున మరోసారి రి సర్వే చేసి వారి పట్టా పాస్ పుస్తకం లో ఎంత ఉంటే అంత భూమిని చూపించాలి అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ద్వారాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. పాల్గొన్నవారు:-కొరివిపల్లి, సలకంచెరువు,చిన్నమాట్లగొంది,ఇరువేందల, ఉల్లికళ్ళు,తరిమేల, గ్రామ ప్రజలు, లక్ష్మిరంగయ్య,శివశంకర,నాగరాజు,రామదాసు,శ్రీరాములు, రమణ,నరేష్,ప్రసాద్ తదితరులు
Dec 14 2023, 16:39