దిశా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డి.ఎస్.పి వరప్రసాద్( 60 )గుండెపోటుతో మృతి..
శ్రీ సత్యసాయి జిల్లా... పుట్టపర్తిలో జిల్లా దిశా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డి.ఎస్.పి వరప్రసాద్( 60 )గుండెపోటుతో మృతి . పుట్టపర్తి మూడవ క్రాస్ లోని సాయి ప్లాజా అపార్ట్ మెంట్ లో మృతి చెందిన డిఎస్పీ. 1991 బ్యాచ్ కి చెందిన అధికారి.
జగనన్నకు చెబుదాం " అనే ప్రోగ్రాంలో ప్రజా సమస్యలపై ఆర్డీవో గారికి వినతి పత్రం అందజేసిన సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు తరిమేల రామాంజనేయులు..

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ద్వారా శింగణమాల మండలంలోని తాసిల్దార్ కార్యాలయం వద్దజరుగుతున్న "జగనన్నకు చెబుదాం " అనే ప్రోగ్రాంలో ప్రజా సమస్యలపై ఆర్డీవో గారికి వినతి పత్రం! సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు తరిమేల రామాంజనేయులు.. మాట్లాడుతూ! ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం వర్షాలు లేక పెట్టిన పంట ఎండిపోయి రైతుల అప్పుల ఊబిలో కూరాకు పోతున్నారు. ప్రభుత్వమే జిల్లాలో 31 మండలాలు ఉంటే 28 మండలాల్లో కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయ చర్యలు చేయి పట్టకపోవడం దారుణం, వెంటనే పంట ఏసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అలాగే వర్షాలు లేక పంట సాగు చేయని వారికి కూడా ప్రభుత్వ ఆదుకోవాలి, అలాగే బ్యాంకులో ఉన్నా క్రాప్ రుణాలను రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలి. వలసలు నివారించి వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు పెంచి రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీలో కంపచెట్లతో వనములాగ తయారైనది. ఇల్లు లేని నిరుపేదలకు జగనన్న ఇండ్లు అందని ద్రాక్ష లాగా తయారైనది. వెంటనే ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు కట్టించాలి. మండల వ్యాప్తంగా రీ సర్వే పేరుతో ప్రభుత్వం రైతులకున్న భూమి సక్రమంగా కొలవకుండా తక్కువ కొలిచి రికార్డు కన్నా తక్కువ భూమిని చూపిస్తూ రైతుల మధ్య వైరుధ్యం పెంచుతున్నది. కావున మరోసారి రి సర్వే చేసి వారి పట్టా పాస్ పుస్తకం లో ఎంత ఉంటే అంత భూమిని చూపించాలి అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ద్వారాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. పాల్గొన్నవారు:-కొరివిపల్లి, సలకంచెరువు,చిన్నమాట్లగొంది,ఇరువేందల, ఉల్లికళ్ళు,తరిమేల, గ్రామ ప్రజలు, లక్ష్మిరంగయ్య,శివశంకర,నాగరాజు,రామదాసు,శ్రీరాములు, రమణ,నరేష్,ప్రసాద్ తదితరులు

తన చెల్లెలు కీ.శే. సాకే మాధవి దేవి 8వ వర్ధంతి రోజున విద్యార్థులకు అవసరమైన పెన్నులు పెన్షన్లు స్కూల్ నందు మొక్కలు నాటిన సర్పంచ్ సాకే రామాంజనేయులు

శిద్ధరాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం మండల పరిషత్ ఉన్నత పాఠశాల నందు తన చెల్లెలు కీ,, శే సాకే మాధవి దేవి 8వ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ సాకే రామాంజనేయులు తన చెల్లెలు జ్ఞాపకార్థం పాఠశాలలోని పిల్లలు ఉపాధ్యాయులతో సమావేశమై ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నా శక్తి మేర మన స్కూల్ కి పిల్లలకి అవసరమైన సహాయం చేసే కార్యక్రమాన్ని చేస్తానని తెలిపారు ఈసారి పిల్లలకి అవసరమైన పెన్నులను పెన్సిల్లను మరియు స్కూలు ఆవరణములో ఆహ్లాదకరమైన పచ్చదనం పెంపొందించుట కొరకు మొక్కలను కుండీలను అందజేయడం జరిగినది అదేవిధంగా స్కూల్లోని ప్రతి విద్యార్థికి ఇంటి దగ్గర నాటేందుకు ఒక మొక్కను అందజేయడం జరిగినది కాలనీలోని ఆర్డిటి స్కూల్ ఆవరణ నందు మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగార్జున రెడ్డి రమేష్ రెడ్డి శివారెడ్డి గ్రామస్తులు సాకే కిరణ్ కుమార్ కురవ నారాయణస్వామి సాకే రామాంజనేయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు

ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తున్న కమిషన్ సభ్యులు బసవరాజు..

అనంతపురం నగరం నందు ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీ బసవరాజు గారు వై నాట్ 175 అనే నినాదంతో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తున్న కమిషన్ సభ్యులు బసవరాజు గారికి మద్దతు గా పాదయాత్రలో పాల్గొన్న అనంతపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ గారు ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మంజుల ఓబులేష్ గారు సర్పంచ్ సాకే రామాంజనేయులు జగన్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తనీష్ గారు మరియు దుర్గం గ్రామస్తులు అగ్రహారం పెద్దన్న కుల్లాయప్ప రామాంజనేయులు ఓబులప్ప మద్దతుగా పాల్గొనడం అయినది

సీతారాముల దేవాలయం నిర్మాణం కోసం సాంబశివుడు లక్ష రూపాయలు విరాళం..

సీతారాముల దేవాలయం నిర్మాణం కోసం లక్ష విరాళం.. యల్లనూరు మండలం బొప్పేపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల దేవాలయం పునర్నిర్మాణం కోసం రూ.1,00,000/ లక్ష విరాళంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అందజేశారు. గడపగడపలో ఇచ్చిన మాట ప్రకారం దేవాలయ నిర్మాణానికి విరాళం అందజేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మరియు ఆలూరు సాంబ శివారెడ్డి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

శ్రీ కోదండరామ చెక్కభజన గురువు B, కుల్లాయప్ప గారికి తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం..

శ్రీ కోదండరామ చెక్కభజన గురువు B, కుల్లాయప్ప గారికి తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం.. సింగనమల మండలం, చిన్న జలాలపురం B. కుళ్లాయప్ప గారికి తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్ఛంద సేవ సంస్త యొక్క స్ఫూర్తి నంది పురస్కారం ప్రముఖుల చేతుల మీదుగా బాలోత్సవ్ భవనం శ్రీకృష్ణదేవరాయ కళాక్షేత్రంలో అందుకోవడం జరిగినది , తెలుగు వెలుగు సాహితి జాతీయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మ శ్రీ పోలోజ్ రాజ్ కుమార్, సంస్థ జాతీయ కన్వీనర్, డా,,రంగి శెట్టి రమేష్, మాన్య శ్రీ సుబ్రహ్మణ్యం ias జమ్ము కాశ్మీర్, బ్రహ్మశ్రీ పంతుల వెంకటేశ్వర్లు గారు సంస్థఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారు, ఈ అవార్డునుఅందజేశారు, అవార్డు గ్రహీత మాట్లాడుతూ నంది పుష్కర అవార్డు నన్ను వరించినందుకు చాలా సంతోషంగా నేనెంతో గర్వపడుతున్నానని కళా రంగంలో రానిస్తున్న వారందరికీ అవార్డులు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో శ్రీ కోదండరామ చెక్కభజన వ్యవస్థాపకులు మేకల కుల్లాయప్ప గారు రాఘవ బండారునగేష్ తదితరులుపాల్గొనడం జరిగినది

ఏపీలో ఎన్నికలు ఈ సారి టీడీపీ అధినేత చంద్రబాబుకు నవ్ ఆర్ నెవర్ గా మారుతున్నాయి.

చంద్రబాబు కసరత్తు: ఏపీలో ఎన్నికలు ఈ సారి టీడీపీ అధినేత చంద్రబాబుకు నవ్ ఆర్ నెవర్ గా మారుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతానని శపధం చేసారు. ఇదే సమయంలో జనసేనతో పొత్తు వేళ..ప్రతీ నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా స్ఫష్టత రావటం లేదు. బీజేపీ వైఖరి పైన వచ్చే వారం స్పష్టత తీసుకొనే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్దుల ఎంపిక పైన ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు - పవన్ నిర్ణయించారు. అందులో భాగంగా పవన్ కోరుకుంటున్న స్థానాల పైన చంద్రబాబు ఇప్పటికే వివరాలు సేకరించారు. కొత్త ఎత్తుగడలు - ఎంపికలు: పవన్ కల్యాణ్ తన పార్టీకి కావాలని కోరుతున్న స్థానాల్లో ఆ పార్టీ బలం పైన చంద్రబాబు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాల్లో జనసేనకు బలం ఉందని గుర్తించిన స్థానాల్లో సీట్ల త్యాగానికి సిద్దం కావాల్సిందేనని అక్కడ పార్టీ ఇంఛార్జ్ లకు సంకేతాలు ఇస్తున్నారు. ముందుగా పార్టీ అధికారంలోకి రావాలని..తరువాత సుమచిత ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇక...ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పార్టీ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటనకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. వైసీపీ ఖరారు చేసే సీట్లు..తమ పార్టీలో ఇబ్బంది లేనివి...అదే విధంగా జనసేన నుంచి అభ్యంతరం లేని 45 స్థానాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ స్థానాల్లో అభ్యర్దులతో తొలి జాబితా ప్రకటనకు రంగం సిద్దం చేస్తున్నారు. *తొలి జాబితా సిద్దం:* ప్రస్తుతం టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా మరో 27 స్థానాలకు అభ్యర్దులు ఖరారయ్యారు. గోదావరి జిల్లాల్లోని పిఠాపురం, భీమవరం, కాకినాడ, రాజమండ్రి రూరల్, నర్సాపురం, ఆళ్లగడ్డ, తెనాలి, గాజువాక, తిరుపతి, కైకలూరు, అమలాపురం, రాజోలు, శ్రీకాకుళం, భీమిలి స్థానాలు జనసేనకు ఇప్పటికే ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన స్థానాలపైన సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. రెండు పార్టీలతో ఖరారు చేసిన అభ్యర్దుల జాబితాలను ఒకే సారి ప్రకటించటం ద్వారా ఎన్నికలకు ముందుగానే క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం పెరిగేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. దీంతో.. ఈ నెల 20న లోకేశ్ యువగళం ముగింపు సభలో చంద్రబాబు - పవన్ పాల్గొంటున్నారు. ఆ సభా వేదికగా కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నట్లు సమాచారం....

ఓటరు లిస్టు కీ సంబంధించి దొంగ ఓట్లు, కొత్త ఓట్ల అవకతవకలు గురించి డిప్యూటీ తహసీల్దారిని కలిసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు కె.రామలింగారెడ్డి

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారి ఆదేశాలు మేరకు.. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలోని ఓటరు లిస్టు కీ సంబంధించి దొంగ ఓట్లు, కొత్త ఓట్ల అవకతవకలు గురించి బుక్కరాయసముద్రం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నారాయణ స్వామి గారిని కలిసి వీటి పై చర్యలు తీసుకోవాలి అని కోరిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు*, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, మాజీసర్పంచ్ లక్ష్మినారాయణ గారు, కేశన్న గారు, మాజీఎంపీటీసీ నారాయణ స్వామి గారు, నాగభూషణ, చెన్నమయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి పేదవారికీ భూ పంపిణీ : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

అర్హులైన ప్రతి పేదవారికీ భూ పంపిణీ : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి* ప్రతి పేదవాడికీ భూమిని పంపిణీ చేయాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. 424 ఎకరాలకు సంబంధించిన పట్టాలను 302 మందికి అందజేశారు. 2003 ముందు ఇచ్చి అసైన్మెంట్ అయిన 1413 ఎకరాలకు సంబంధించిన 708 మందికి నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి అమ్ముకునే హక్కు పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేదవారికి భూహక్కు కల్పించాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఆలోచన చేసి అర్హులైన ప్రతి పేదవాడికీ భూ హక్కు కల్పిస్తున్నారన్నారు. భూముల వివాదాల్లో నలిగిపోతున్న వారికి జగనన్న భూ సర్వే భూరక్ష క్రింద వివాదాలకు తావు లేకుండా భూ సర్వే చేపించారు. గతంలో భూ పంపిణీ ద్వారా ఇచ్చిన భూములను అమ్ముకునే పరిస్థితిలో లేని పేదవాడికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భూమిని అమ్ముకునే హక్కు కల్పించిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. గత పాలకుల నిర్వాకంతో పేదలు అన్ని రంగాల్లో వెనుకబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారని వాపోయారు. జగనన్న నాలుగున్నరేళ్ల పాలనలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా పేదలే అర్హతగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి తాము ఇది చేశామని ధైర్యంగా చెబుతున్నామని, గత పాలకులు ఏమి చేసారో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రానున్న కాలంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే మరలా మన ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూశాఖ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలలో ఏజెన్సీల మాటున కోట్లాది రూపాయలు దండుకుంటున్న సేవా సుప్రీమ్, ఎస్ ఎస్ ఆర్ ఏజెన్సీలు... పి డి ఎస్ యు విద్యార్థి సంఘం..

గురుకుల పాఠశాలలో ఏజెన్సీల మాటున కోట్లాది రూపాయలు దండుకుంటున్న ( సేవా సుప్రీమ్ ,ఎస్ ఎస్ ఆర్ ఏజెన్సీ)... పి డి ఎస్ యు (ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) 9_12_2023 ఈ రోజు కణేకల్ మండలం మీడియా సమావేశం లో మాట్లాడుతున్నా అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 13 జిల్లాలలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఆవేదన ఎవరితోనైనా చెప్పితే ఉద్యోగాలు తొలగిస్తామంటూ బెదిరింపులు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వని పరిస్థితి ఇంతజరుగుతున్న ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న అంబేద్కర్ గురుకుల విద్యాశాఖ అధికారులు 2018లో సేవా సుప్రీం, ఎస్ఎస్ఆర్ అనే ఏజెన్సీ కింద సెక్యూరిటీ గార్డ్స్, స్లీపింగ్ స్కావెంజర్స్పనిచేస్తారు కానీ ప్రభుత్వ నిబంధనలను ప్రకారం కాంట్రాక్ట్ బేసిక్ కింద గాని రెగ్యులర్ పోస్టులు కానీ ఏజెన్సీ కింద కానీ వారిని విధుల్లోకితీసుకునేటప్పుడు జాయినింగ్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ తోపాటు ఉద్యోగ భద్రత కోసమై పై తెలిపిన వివరాల మేరకు ఇవన్నీ పాటిస్తారు* కానీ ఈ ఏజెన్సీలు మాత్రం ఇవేవీ పాటించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు, ఎందుకంటే వారు ప్రభుత్వంతో టెండర్లు తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఏమనంటే ప్రభుత్వ ఖజానా వద్ద శాలరీలు విషయమై ఆలస్యం అయినా కూడా ఏజెన్సీ వారు ప్రతి నెల ఒకటో తారీకు జీతాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా ఏజెన్సీ నుండి ప్రభుత్వం సంస్థలకు ఎంప్లాయిస్ ను రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క ఎంప్లాయ్ మీద 4 % పర్సెంట్ కమిషన్ ఏపీ ప్రభుత్వం ఇస్తున్నది ఇదే కాకుండా ప్రతి ఎంప్లాయ్ పేరుతోనూ అక్షరాల 13 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయలు చెల్లిస్తుంది, కానీ సెక్యూరిటీ వారికి కేవలం 8000 రూపాయలు స్లీపింగ్ పనిచేస్తున్న వారికి 7500 రూపాయలు స్కావెంజర్ గా పని చేస్తున్నటువంటి వారికి 8000 రూపాయలు ఇస్తూ ఒక్కొక్క ఎంప్లాయ్ పైన నెలకు 3000 నుంచి 5000 రూపాయల చొప్పున కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు , నెల నెల జీతాలు ఏమైనా వస్తాయా అంటే రావు ఐదు నెలలకు ఆరు నెలలకు బ్రతిమలాడితే కానీ జీతాలు పడని పరిస్థితి, జీతాలు వస్తాయని తెలిసిన వారి దగ్గర అప్పుగా తీసుకొని జీవనం గడుపుతున్నారు ఆటోలో ఛార్జీలకు బైకుల పెట్రోల్ కు అప్పులు చేసి తిప్పలు పడి ఉద్యోగం చేస్తున్న కూడా ఏమాత్రం కనికరం చూపని సేవా సుప్రీం ఎస్ ఎస్ ఆర్ ఏజెన్సీలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇదే కాకుండా ఏ ఎంప్లాయిస్ కైనా కూడా సంవత్సరంలో కొన్ని సెలవు దినాలు ఉంటాయి కానీ ఈ వర్కర్స్ కు మాత్రం సెలవులు రోజులు పాటించరు ఒకవేళ ఎవరైనా ఎంప్లాయిస్ కు వారి కుటుంబాలకు చెందిన వారికి ఆరోగ్యాలు బాగాలేక కుటుంబాల అవసరం నిమిత్తం సెలవు తీసుకుంటే చాలీసాలని జీతములో జీతం కట్ అవుతుంది సహచర ఉద్యోగి సహాయం తీసుకొని బిక్కు బిక్కు మని జీవనం గడుపుతున్నారు, ఇదే కాకుండా ఎవరైనా మహిళ ఉద్యోగి గర్భవతులు అయితే ఆరు నెలల పాటు ఆ మహిళకు జీతాలు ఇవ్వాలని భారత రాజ్యాంగంలో రాసి ఉన్న ఇవ్వనటువంటి పరిస్థితి, ఇదే కాకుండా 2019 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో కూడా ఆరు నెలలు ప్రసూతి సెలవులు ఇస్తూ ఆ మహిళకు జీతాలు ఇవ్వాలని ఏజెన్సీలకు ప్రభుత్వం స్పష్టమైన జీవోలు ఉన్నా కూడా ఇవన్నీ పట్టనట్టు వ్యవహరిస్తున్నా ఎస్ ఎస్ ఆర్ ఏజెన్సీ. కానీ ఈ ఏజెన్సీ వారు మాత్రం ప్రసూతి సెలవులు కూడా ఇవ్వకుండా వారిని తొలగించి కొత్తవారిని నియమించుకోవడం ,వారితో అందినంత దోచుకోవడం జరుగుతున్నది, ఏజెన్సీలవారు కాంట్రాక్టు ఉద్యోగులపై కోట్లాది రూపాయల దండుకోవడంతోపాటు ఎవరైనా కానీ పై తెలిపిన ఏజెన్సీ కింద పని చేస్తున్నటువంటి డిఎం గారిని ఫోన్ చేసి జీతాలు అడుగుతే విధుల్లో నుండి తొలగిస్తామని ముఖంజారీ చేస్తారు ఎందుకంటే వారి అవినీతిని ఏజెన్సీ పెద్దలకు తెలియకుండా మరింత జాగ్రత్తలు ప్రతి జిల్లాలో పనిచేస్తున్నటువంటి డిఎం లు జాగ్రత్తలు తీసుకుంటారు, వీటిపై రాబోయే రోజుల్లో అంబేద్కర్ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ గారి దృష్టికి, అదేవిధంగా లేబర్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం- పిడిఎస్ యు) , ట్రేడ్ యూనియన్లను, అంబేద్కర్ గురుకుల పాఠశాల వర్కర్స్ ని కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాం, ఈ కార్యక్రమం లో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్ పిడి.ఎసు.యు నాయకులు అంజి. మల్లేష్, వంశీ. విజయ్. చిన్న వరుణ్ తదితరులు పాల్గొన్నారు