రైతులు, రైతు కూలీలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు...
రైతులను, వ్యవసాయ కూలీలను తక్షణమే ఆదుకోవాలి: ఉపాధి హామీపనినికల్పించాలి, శింగనమల ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు సోమవారం అంబేద్కర్ సర్కిల్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తాసిల్దార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు,
ఈ సందర్భంగా CPI జిల్లా స.సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు మాట్లాడుతూ! ప్రస్తుత వర్షభావ పరిస్థితుల వల్ల రైతులు పెట్టిన పంటలు చేతికoదక పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టుబాటు కాక ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి పూర్తిగా నష్టపోయారని రైతులను రైతు కూలీలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు, రైతుకు ఎకరాకు 50, వేల రూపాయల నష్టపరిహారం అందించాలని,
అన్ని రకాల బ్యాంకు రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలను మంజూరు చేయాలని, ఇన్పుట్ సబ్సిడీ ప్రతి రైతుకు అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు, మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనిని విస్తరించి ఒక్కో కుటుంబానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించి, రోజు వేతనం 600 రూపాయలు చెల్లించాలన్నారు, పంటలు పండక రైతులు కూలీలు వలసలువెలుతూ ప్రమాదాల బారిన పడి అనేకమంది మృత్యు పాలయ్యారని,తక్షణమే ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో తరిమేల,నిదనవాడ, చాలకంచెరువు. కొరివిపల్లి,ఇరువేందల,ఉల్లికళ్ళు,చిన్నమాట్లాగొంది,పెరవలి, అల0 క్రాయపేట,శింగణామాల గ్రామాల రైతులు,వ్యవసాయ కూలీలు, లక్ష్మీ రంగయ్య, స్వరనాగప్ప, శ్రీనివాసులు, రవిశంకర్, రామదాసు శ్రీనివాసులు,మాజీ సర్పంచ్ఆదినారాయణ, మాజీ సర్పంచ్ శంకర్, ఆదినారాయణ, నాగరాజు, ఇరువెందుల శ్రీరాములు, వివిధ గ్రామాల రైతులు రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు
Dec 11 2023, 06:22