Breaking..ఇద్దరు సిఐలపై తీవ్ర ఆరోపణలు రావడంతో విఆర్ కు పంపిన జిల్లా SP..

అనంతపురం జిల్లా తాడిపత్రి అర్బన్ సి.ఐ హమీద్ ఖాన్, బుక్కరాయసముద్రం సీఐ నాగార్జున రెడ్డిని వీఆర్ కి పంపిన ఎస్పి ఆన్బురాజన్* *రెండు రోజుల కిందట ఓ దళిత యువకుడిని విచారణ పేరుతో కరెంట్ షాక్ ఇస్తూ వేధించిన తాడిపత్రి సీఐ హమీద్ ఖాన్ ఇవాళ ఓ దివ్యాంగుడిని డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించిన బుక్కరాయసముద్రం సి.ఐ నాగార్జునరెడ్డి ఇద్దరు సిఐలపై తీవ్ర ఆరోపణలు రావడంతో విఆర్ కు పంపి సమగ్ర విచారణ చేపట్టాలని అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డిని ఆదేశించిన ఎస్పీ* *నివేదిక ఆధారంగా ఇద్దరు సీఐలపై చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్పీ

మన అందరి ధ్యేయం.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ని చేయటమే మన లక్ష్యం : ఆలం నరసానాయుడు..
మన అందరి ధ్యేయం..ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ని చేయటమే మన లక్ష్యం : ఆలం నరసానాయుడు..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడమే మనందరి ధ్యేయం అని *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* పుట్లూరు మండలం సురేపల్లి గ్రామంలో *బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ* కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పతకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందని అవినీతి మాత్రం తారాస్థాయికి చేరిందని వాపోయారు.ఈ రాష్ట్రంలో దోపిడి దౌర్జన్యాలు దుర్మార్గాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి అన్నారు.పల్లె ప్రాంతం నుంచి పట్టణాల వరకు అభివృద్ధి బాటలో నడవాలన్నా బావి తరాల భవిష్యత్తు బాగుపడాలన్న ఒక్క చంద్రబాబు నాయుడు గారి తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అందుకోసం మనమందరం సమిష్టిగా సైకో వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ టిడిపి విజయానికి కృషి చేస్తూ సీఎం గా చంద్రబాబునాయుడు గారిని గెలిపించుకుందాం అంటూ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ బాలరంగయ్య, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు,ఓబుళరాపురం శ్రీనా,క్లస్టర్ ఇంచార్జ్ శివశంకర్ రెడ్డి, ఐటీడీపి రాష్ట్ర కార్యదర్శి విజయ్, మండల నాయకులు శ్రీనివాసులునాయుడు, బ్రహ్మయ్య, రామంజి, రామానాయుడు, రమేష్, పెద్దయ్య,సోమశేఖర్ నాయుడు, సదా,ex ఎంపీటీసీ సురేపల్లి వెంకట్ రెడ్డి ఓబులనాయుడు, నాగ సుబ్బరాయుడు భాస్కర్, అశోక్,ఆదినారాయణ రెడ్డి, భాస్కర్ నాయుడు, లచ్చుమయ్య, శ్రీనివాస్ నాయుడు యూనిటీ ఇంచార్జ్ లు,బూత్ కమిటీ ఇన్చార్జిలు, మండల సీనియర్ నాయకులు, సర్పంచ్లు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు
రైతులు, రైతు కూలీలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు...

రైతులను, వ్యవసాయ కూలీలను తక్షణమే ఆదుకోవాలి: ఉపాధి హామీపనినికల్పించాలి, శింగనమల ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు సోమవారం అంబేద్కర్ సర్కిల్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తాసిల్దార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు,

ఈ సందర్భంగా CPI జిల్లా స.సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు మాట్లాడుతూ! ప్రస్తుత వర్షభావ పరిస్థితుల వల్ల రైతులు పెట్టిన పంటలు చేతికoదక పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టుబాటు కాక ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి పూర్తిగా నష్టపోయారని రైతులను రైతు కూలీలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు, రైతుకు ఎకరాకు 50, వేల రూపాయల నష్టపరిహారం అందించాలని,

అన్ని రకాల బ్యాంకు రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలను మంజూరు చేయాలని, ఇన్పుట్ సబ్సిడీ ప్రతి రైతుకు అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు, మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనిని విస్తరించి ఒక్కో కుటుంబానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించి, రోజు వేతనం 600 రూపాయలు చెల్లించాలన్నారు, పంటలు పండక రైతులు కూలీలు వలసలువెలుతూ ప్రమాదాల బారిన పడి అనేకమంది మృత్యు పాలయ్యారని,తక్షణమే ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో తరిమేల,నిదనవాడ, చాలకంచెరువు. కొరివిపల్లి,ఇరువేందల,ఉల్లికళ్ళు,చిన్నమాట్లాగొంది,పెరవలి, అల0 క్రాయపేట,శింగణామాల గ్రామాల రైతులు,వ్యవసాయ కూలీలు, లక్ష్మీ రంగయ్య, స్వరనాగప్ప, శ్రీనివాసులు, రవిశంకర్, రామదాసు శ్రీనివాసులు,మాజీ సర్పంచ్ఆదినారాయణ, మాజీ సర్పంచ్ శంకర్, ఆదినారాయణ, నాగరాజు, ఇరువెందుల శ్రీరాములు, వివిధ గ్రామాల రైతులు రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు

సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి..
సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి
హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు ముగిసింది. అనారోగ్యం దృష్టిలో ఉంచుకుని భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది.. దీంతో ఆయన సెప్టెంబరు 22 నుంచి నవంబరు 30 వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌పై ఉన్నారు. గడువు ముగియడంతో శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈనెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్‌ విధించడంతో సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు..
గ్రంధాలయాలు విజ్ఞాన నిలయాలు.. నెరవేరిన 14 ఏళ్ల పాఠకుల కల.. నూతన గ్రంధాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య..

గ్రంధాలయాలు విజ్ఞాన నిలయాలు.. నెరవేరిన 14 ఏళ్ల పాఠకుల కల నూతన గ్రంధాలయం ప్రారంభం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య.. పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ ఉమా మోహన్ రెడ్డి గ్రంథాలయ వ్యవస్థను సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఆధునికంగా తీర్చిదిద్దిందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

నార్పల మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం ప్రక్కన నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు.

గత ప్రభుత్వాలలో నెరవేరని నూతన గ్రంథాలయం కల, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య సహకారంతో దాదాపు రూ.25 లక్షల నిధులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రంథాలయాలు సమాజంతో మమేకమై ఉన్నాయని, ఈ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక గ్రంథాలయాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తోందని, డిజిటల్‌ గ్రంథాలయాల వ్యవస్థను జగనన్న ప్రభుత్వం గ్రామస్థాయిలో పేదలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు.

ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన దేవాలయాలని, గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం చేయటం ద్వారా ఎంతో జ్ఞానం పెంపొందించుకోవచ్చన్నారు. గత ప్రభుత్వాలలో చేయలేని పనిని జగనన్న ప్రభుత్వంలో చేసి చూపించమన్నారు.

విద్యార్థులు తరగతి గదుల్లో నాలుగు గోడల మధ్య కూర్చుని సముపార్జించే విజ్ఞానానికి సార్థకత రావాలంటే పుసక్త పఠనం అలవర్చుకోవాలని, కాలం ఎంతటి ఆధునికత దిశగా వెళ్తున్నా..గ్రంథాలయాల విలువ శాశ్వతమైనదని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ ఉమా మోహన్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, గ్రంథాలయ సిబ్బంది, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మృతి చెందిన సచివాలయ గృహ సారధి కుటుంబాన్ని పరామర్శించి తన పుట్టినరోజున పదివేల రూ.ల ఆర్థిక సాయం చేసి భరోసా కల్పించిన ఆలూరు రమణారెడ్డి

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని విరూపాక్షేశ్వర నగర్ లోని గృహసారథి తలారి నాగరాజు గుండె పోటు వల్ల చనిపోయిననాడు. తన పుట్టినరోజున వారి కుటుంబానికి 10,000 వేల రూ.లు ఆర్థిక సాయం ఆలూరు రమణ రెడ్డి గారు చేయడం జరిగింది. పార్టీ నుండి భీమా ప్రయోజనము అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో బుల్లె రాజా చికెన్ నారాయణస్వామి శేషానంద రెడ్డి బండి పుల్లయ్య లక్ష్మీనారాయణ నూర్ మహమ్మద్ తదితరులు పాలుగొన్నారు.

తన పుట్టినరోజు 20 కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరిన శుభ సందర్భంగా ఆలూరు రమణారెడ్డి గారికి గజమాలు వేసి ఘనంగా సత్కరించారు..

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం గ్రామ పంచాయతీ జన చైతన్య కాలనీ మరియూ హమాలీ కాలనీలోని 20 కుటుంబాలు ఆలూరు సాంబశివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలూరు రమణారెడ్డి గారు తన స్వహస్తాలతో పార్టీ కండువా వేసి వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆలూరు రమణారెడ్డి గారిని శాలువా సత్కరించి పార్టీ రంగులతో కూడిన పూల గజమాలను వేసి కేక్ కట్ చేసి తినిపించి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో చికెన్ నారాయణస్వామి, బుల్లె రాజా, శేషానందరెడ్డి, లక్ష్మీ నారాయణ, నూర్ మహమ్మద్, అంజి, సర్దార్ ,బాబా, రమణ ,ప్రభాకర్ ,టిప్పు చక్రి ,రఫీ, కుమార్ మరియు మహిళలు, యువకులు పాల్గొన్నారు.

టిడిపి నుండి 20 కుటుంబాలను తన సంస్థలతో వైఎస్ఆర్సిపి పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించిన.. మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి..

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం గ్రామ పంచాయతీ జన చైతన్య కాలనీ మరియూ హమాలీ కాలనీలోని 20 కుటుంబాలు ఆలూరు సాంబశివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలూరు రమణారెడ్డి గారు తన స్వహస్తాలతో పార్టీ కండువా వేసి వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో చికెన్ నారాయణస్వామి, బుల్లె రాజా, శేషానందరెడ్డి, లక్ష్మీ నారాయణ, నూర్ మహమ్మద్, అంజి, సర్దార్ ,బాబా, రమణ ,ప్రభాకర్ ,టిప్పు చక్రి ,రఫీ, కుమార్ మరియు మహిళలు, యువకులు పాల్గొన్నారు.

వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు...

వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు...

శింగనమల మండలం ఆనందరావుపేట గ్రామనివాసి కీ"శే"శ్రీమతి గువ్వల నాగలక్ష్మి & కీ"శే"శ్రీ గువ్వల హనుమంతు గార్ల కుమార్తే లలిత (గీతాంజలి)వివాహంకు 10000 పది వేలరుపాయలు ఆర్థిక సహాయం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ... నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జ్ జి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

జగనన్న మళ్ళీ రావాలి..ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని, అందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను ఆవిష్కరించారు. గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు.

ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని బుక్లెట్ ద్వారా ఆయా కుటుంబాలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి సీఎంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.