గ్రంధాలయాలు విజ్ఞాన నిలయాలు.. నెరవేరిన 14 ఏళ్ల పాఠకుల కల.. నూతన గ్రంధాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య..
గ్రంధాలయాలు విజ్ఞాన నిలయాలు.. నెరవేరిన 14 ఏళ్ల పాఠకుల కల నూతన గ్రంధాలయం ప్రారంభం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య.. పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ ఉమా మోహన్ రెడ్డి గ్రంథాలయ వ్యవస్థను సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఆధునికంగా తీర్చిదిద్దిందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
నార్పల మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం ప్రక్కన నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు.
గత ప్రభుత్వాలలో నెరవేరని నూతన గ్రంథాలయం కల, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య సహకారంతో దాదాపు రూ.25 లక్షల నిధులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రంథాలయాలు సమాజంతో మమేకమై ఉన్నాయని, ఈ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక గ్రంథాలయాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తోందని, డిజిటల్ గ్రంథాలయాల వ్యవస్థను జగనన్న ప్రభుత్వం గ్రామస్థాయిలో పేదలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు.
ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన దేవాలయాలని, గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం చేయటం ద్వారా ఎంతో జ్ఞానం పెంపొందించుకోవచ్చన్నారు. గత ప్రభుత్వాలలో చేయలేని పనిని జగనన్న ప్రభుత్వంలో చేసి చూపించమన్నారు.
విద్యార్థులు తరగతి గదుల్లో నాలుగు గోడల మధ్య కూర్చుని సముపార్జించే విజ్ఞానానికి సార్థకత రావాలంటే పుసక్త పఠనం అలవర్చుకోవాలని, కాలం ఎంతటి ఆధునికత దిశగా వెళ్తున్నా..గ్రంథాలయాల విలువ శాశ్వతమైనదని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ ఉమా మోహన్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, గ్రంథాలయ సిబ్బంది, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Dec 02 2023, 10:20