గ్రంధాలయాలు విజ్ఞాన నిలయాలు.. నెరవేరిన 14 ఏళ్ల పాఠకుల కల.. నూతన గ్రంధాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య..

గ్రంధాలయాలు విజ్ఞాన నిలయాలు.. నెరవేరిన 14 ఏళ్ల పాఠకుల కల నూతన గ్రంధాలయం ప్రారంభం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య.. పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ ఉమా మోహన్ రెడ్డి గ్రంథాలయ వ్యవస్థను సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఆధునికంగా తీర్చిదిద్దిందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

నార్పల మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం ప్రక్కన నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు.

గత ప్రభుత్వాలలో నెరవేరని నూతన గ్రంథాలయం కల, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య సహకారంతో దాదాపు రూ.25 లక్షల నిధులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రంథాలయాలు సమాజంతో మమేకమై ఉన్నాయని, ఈ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక గ్రంథాలయాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తోందని, డిజిటల్‌ గ్రంథాలయాల వ్యవస్థను జగనన్న ప్రభుత్వం గ్రామస్థాయిలో పేదలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు.

ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన దేవాలయాలని, గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం చేయటం ద్వారా ఎంతో జ్ఞానం పెంపొందించుకోవచ్చన్నారు. గత ప్రభుత్వాలలో చేయలేని పనిని జగనన్న ప్రభుత్వంలో చేసి చూపించమన్నారు.

విద్యార్థులు తరగతి గదుల్లో నాలుగు గోడల మధ్య కూర్చుని సముపార్జించే విజ్ఞానానికి సార్థకత రావాలంటే పుసక్త పఠనం అలవర్చుకోవాలని, కాలం ఎంతటి ఆధునికత దిశగా వెళ్తున్నా..గ్రంథాలయాల విలువ శాశ్వతమైనదని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ ఉమా మోహన్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, గ్రంథాలయ సిబ్బంది, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మృతి చెందిన సచివాలయ గృహ సారధి కుటుంబాన్ని పరామర్శించి తన పుట్టినరోజున పదివేల రూ.ల ఆర్థిక సాయం చేసి భరోసా కల్పించిన ఆలూరు రమణారెడ్డి

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని విరూపాక్షేశ్వర నగర్ లోని గృహసారథి తలారి నాగరాజు గుండె పోటు వల్ల చనిపోయిననాడు. తన పుట్టినరోజున వారి కుటుంబానికి 10,000 వేల రూ.లు ఆర్థిక సాయం ఆలూరు రమణ రెడ్డి గారు చేయడం జరిగింది. పార్టీ నుండి భీమా ప్రయోజనము అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో బుల్లె రాజా చికెన్ నారాయణస్వామి శేషానంద రెడ్డి బండి పుల్లయ్య లక్ష్మీనారాయణ నూర్ మహమ్మద్ తదితరులు పాలుగొన్నారు.

తన పుట్టినరోజు 20 కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరిన శుభ సందర్భంగా ఆలూరు రమణారెడ్డి గారికి గజమాలు వేసి ఘనంగా సత్కరించారు..

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం గ్రామ పంచాయతీ జన చైతన్య కాలనీ మరియూ హమాలీ కాలనీలోని 20 కుటుంబాలు ఆలూరు సాంబశివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలూరు రమణారెడ్డి గారు తన స్వహస్తాలతో పార్టీ కండువా వేసి వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆలూరు రమణారెడ్డి గారిని శాలువా సత్కరించి పార్టీ రంగులతో కూడిన పూల గజమాలను వేసి కేక్ కట్ చేసి తినిపించి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో చికెన్ నారాయణస్వామి, బుల్లె రాజా, శేషానందరెడ్డి, లక్ష్మీ నారాయణ, నూర్ మహమ్మద్, అంజి, సర్దార్ ,బాబా, రమణ ,ప్రభాకర్ ,టిప్పు చక్రి ,రఫీ, కుమార్ మరియు మహిళలు, యువకులు పాల్గొన్నారు.

టిడిపి నుండి 20 కుటుంబాలను తన సంస్థలతో వైఎస్ఆర్సిపి పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించిన.. మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి..

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం గ్రామ పంచాయతీ జన చైతన్య కాలనీ మరియూ హమాలీ కాలనీలోని 20 కుటుంబాలు ఆలూరు సాంబశివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలూరు రమణారెడ్డి గారు తన స్వహస్తాలతో పార్టీ కండువా వేసి వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో చికెన్ నారాయణస్వామి, బుల్లె రాజా, శేషానందరెడ్డి, లక్ష్మీ నారాయణ, నూర్ మహమ్మద్, అంజి, సర్దార్ ,బాబా, రమణ ,ప్రభాకర్ ,టిప్పు చక్రి ,రఫీ, కుమార్ మరియు మహిళలు, యువకులు పాల్గొన్నారు.

వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు...

వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు...

శింగనమల మండలం ఆనందరావుపేట గ్రామనివాసి కీ"శే"శ్రీమతి గువ్వల నాగలక్ష్మి & కీ"శే"శ్రీ గువ్వల హనుమంతు గార్ల కుమార్తే లలిత (గీతాంజలి)వివాహంకు 10000 పది వేలరుపాయలు ఆర్థిక సహాయం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ... నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జ్ జి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

జగనన్న మళ్ళీ రావాలి..ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని, అందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను ఆవిష్కరించారు. గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు.

ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని బుక్లెట్ ద్వారా ఆయా కుటుంబాలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి సీఎంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

చెన్నంపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు..
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని బుక్లెట్ ద్వారా ఆయా కుటుంబాలకు వివరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి సీఎంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి  జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమము..

జగనన్న మళ్ళీ రావాలి.. ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని, అందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలోఆమె పాల్గొన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను ఆవిష్కరించారు.

పేద కళాకారుడుని కుమార్తె వివాహ కార్యక్రమంకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి..

పేద కళాకారుడుని కుమార్తె వివాహ కార్యక్రమం కు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.

ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని పేద కళాకారుడు డ్రామా అయ్యవారు రామాంజినేయులు గారి కుమార్తె వివాహకార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసి వారి కుటుంబానికి అండగా నిలిచినా *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.

ఈ కార్యక్రమం తలారి కాటమయ్య, పెద్దన్న,లక్ష్మినారాయణ, ఆది నారాయణ,తలారి నాగేంద్ర, రవి,చెన్నమయ్య, వెంకటేష్,నరసింహులు, కొండన్న, రమేష్ మరియు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ భార్య దీపికా కుCCS డెత్ రిలీఫ్ ఫండ్ కింద Rs లక్ష రూ.ల చెక్కును అందజేసిన కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్..

అనంతపురం జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ PC 760 వారి భార్య దీపికా కు CCS డెత్ రిలీఫ్ ఫండ్ కింద Rs 1,00,000 రూపాయల చెక్కును కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ చేతుల మీదుగా అందించటం జరిగింది.

ఇంకా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ మరియు కారుణ్య నియామకం కింద జాబ్ తొందరగా వచ్చేటట్లు చూస్తాము అని చెప్పటం జరిగింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, AO నాగభూషణమ్మ, అసిస్టెంట్ AO విజయ్ కుమార్, CCS ఇంచార్జీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది.