ప్రభుత్వ పాలనను సచివాలయాల ద్వారా ప్రజల చెంతకు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే.. ఆలూరు సాంబ శివారెడ్డి..
సచివాలయాలతో అందరికీ సంక్షేమం.. ఆలూరు సాంబ శివారెడ్డి.. ప్రభుత్వ పాలనను సచివాలయాల ద్వారా ప్రజల చెంతకు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. యల్లనూరు మండలం పెద్దమల్లే పల్లి, చింతకాయమంద గ్రామాల్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డా.వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను, కల్లూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం, డా. వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఆయన ప్రారంభించారు. సాంబ శివారెడ్డి మాట్లాడుతూ..
గత టీడీపీ హయాంలో సామాన్యులు తమ సమస్యలను చెప్పాలంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడేవారన్నారు. నేడు జగనన్న ప్రభుత్వ పాలనలో సచివాలయాల ద్వారా అలాంటి సమస్యలకు చెక్ పెట్టారన్నారు. రైతన్నలు పట్టణాలకు వెళ్లకుండా గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, పంట అమ్మకం వరకు సూచనలు, సలహాలు పంటరుణాలు వంటి వాటిని ఏర్పాటు చేసి వారి కష్టాలను తీర్చారన్నారు.
గ్రామాల్లోని ప్రజలు తమ ఊరు దాటి వెళ్లకుండా ఉన్న ఊరిలోనే వైద్య చికిత్సలు అందించేందుకు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. *రూ.35 లక్షల నిధులతో తారు రోడ్డు నిర్మాణం* తిమ్మంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ నుండి చింతకాయమంద గ్రామంలోకి దాదాపు రూ.35 లక్షల వ్యయంతో నూతన తారు రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం బొప్పేపల్లి పంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Dec 02 2023, 07:47