జగనన్న మళ్ళీ రావాలి..ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని, అందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను ఆవిష్కరించారు. గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు.
ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని బుక్లెట్ ద్వారా ఆయా కుటుంబాలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి సీఎంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Dec 01 2023, 07:41