చెన్నంపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు..
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని బుక్లెట్ ద్వారా ఆయా కుటుంబాలకు వివరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి సీఎంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి  జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమము..

జగనన్న మళ్ళీ రావాలి.. ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని, అందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలోఆమె పాల్గొన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను ఆవిష్కరించారు.

పేద కళాకారుడుని కుమార్తె వివాహ కార్యక్రమంకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి..

పేద కళాకారుడుని కుమార్తె వివాహ కార్యక్రమం కు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.

ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని పేద కళాకారుడు డ్రామా అయ్యవారు రామాంజినేయులు గారి కుమార్తె వివాహకార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసి వారి కుటుంబానికి అండగా నిలిచినా *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.

ఈ కార్యక్రమం తలారి కాటమయ్య, పెద్దన్న,లక్ష్మినారాయణ, ఆది నారాయణ,తలారి నాగేంద్ర, రవి,చెన్నమయ్య, వెంకటేష్,నరసింహులు, కొండన్న, రమేష్ మరియు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ భార్య దీపికా కుCCS డెత్ రిలీఫ్ ఫండ్ కింద Rs లక్ష రూ.ల చెక్కును అందజేసిన కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్..

అనంతపురం జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ PC 760 వారి భార్య దీపికా కు CCS డెత్ రిలీఫ్ ఫండ్ కింద Rs 1,00,000 రూపాయల చెక్కును కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ చేతుల మీదుగా అందించటం జరిగింది.

ఇంకా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ మరియు కారుణ్య నియామకం కింద జాబ్ తొందరగా వచ్చేటట్లు చూస్తాము అని చెప్పటం జరిగింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, AO నాగభూషణమ్మ, అసిస్టెంట్ AO విజయ్ కుమార్, CCS ఇంచార్జీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది.

ప్రభుత్వ పాలనను సచివాలయాల ద్వారా ప్రజల చెంతకు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే.. ఆలూరు సాంబ శివారెడ్డి..

సచివాలయాలతో అందరికీ సంక్షేమం.. ఆలూరు సాంబ శివారెడ్డి.. ప్రభుత్వ పాలనను సచివాలయాల ద్వారా ప్రజల చెంతకు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. యల్లనూరు మండలం పెద్దమల్లే పల్లి, చింతకాయమంద గ్రామాల్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డా.వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను, కల్లూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం, డా. వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఆయన ప్రారంభించారు. సాంబ శివారెడ్డి మాట్లాడుతూ..

గత టీడీపీ హయాంలో సామాన్యులు తమ సమస్యలను చెప్పాలంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడేవారన్నారు. నేడు జగనన్న ప్రభుత్వ పాలనలో సచివాలయాల ద్వారా అలాంటి సమస్యలకు చెక్ పెట్టారన్నారు. రైతన్నలు పట్టణాలకు వెళ్లకుండా గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, పంట అమ్మకం వరకు సూచనలు, సలహాలు పంటరుణాలు వంటి వాటిని ఏర్పాటు చేసి వారి కష్టాలను తీర్చారన్నారు.

గ్రామాల్లోని ప్రజలు తమ ఊరు దాటి వెళ్లకుండా ఉన్న ఊరిలోనే వైద్య చికిత్సలు అందించేందుకు వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. *రూ.35 లక్షల నిధులతో తారు రోడ్డు నిర్మాణం* తిమ్మంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ నుండి చింతకాయమంద గ్రామంలోకి దాదాపు రూ.35 లక్షల వ్యయంతో నూతన తారు రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం బొప్పేపల్లి పంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

ఫూలే స్ఫూర్తితో అణగారిన అభ్యున్నతి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. మహాత్మ జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్న ఫూలే విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూల మాల వేసి, నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జ్యోతిరావు ఫూలే పోరాటాలు, సంస్కరణలు ఆదర్శనీయమన్నారు. ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించారన్నారు.

బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారన్నారు. ఫూలే ఆలోచనలకు అనుగుణంగా పరిపాలనలో ముందుకెళ్తూ దేశ ప్రజల దృష్టిని సీఎం జగనన్న ఆకర్షిస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి, అత్యధిక సీట్లు వారికే కేటాయించడం గర్వంగా ఉందన్నారు. ఫూలే కలలుగన్న పాలన జగనన్నతో సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీసీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ మొదలైన ఫ్యాక్షన్.. భూ తగాదా లో నాగార్జున అనే టిడిపి కార్యకర్తను గడ్డపారలతో కొట్టి హత్య చేసిన వైసీపీ నాయకులు..

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నిట్టూరు, మరియు మేడుకుర్తి గ్రామాల పరిసర ప్రాంతాల్లో జగనన్న భూ సర్వే చేస్తున్న సందర్భంగా.. పొలం తగాదా లో నాగార్జున 30సం.లు అనే టిడిపి కార్యకర్తను గడ్డపారలతో కొట్టి హత్య చేసిన వైసీపీ నాయకులు..

గడ్డపారలతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే నాగార్జున మృతి చెందాడు మరొక వ్యక్తి కంబగిరి తీవ్ర గాయాలు.

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నాగార్జున ప్రస్తుతం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన గార్లదిన్నె మండలం కమలాపురం రజకులు..

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన రజకులు గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామ‌ రజకులు ధోబి ఘాట్ కు బోరు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కోరడం జరిగింది. స్పందించి బోరు వేయించారు.

అడిగిన వెంటనే తమ సమస్యను పరిష్కరించినందుకు అనంతపురంలోని రజకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పరిష్కారానికి కృషి చేసిన సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి యువ నాయకుడు ఆలూరు ఎర్రిస్వామిరెడ్డికి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకట నారాయణ, వైస్సార్సీపీ నాయకులు శంకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామచంద్ర, రజకులు రామంజినేయులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

గోవిందంపల్లి, రాఘవేంద్ర కాలనీ, భద్రంపల్లి, బోయ కొట్టాల గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం...

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు :ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను కుల, మత,పార్టీ, భేదం లేకుండా అందజేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, రాఘవేంద్ర కాలనీ, భద్రంపల్లి, బోయ కొట్టాల గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు.

ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవుతున్నాయా? లేదా అని తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిని ఆయా కుటుంబాలకు బుక్లెట్ ద్వారా వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగనన్న పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతోనే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. మరోసారి తమను ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవం...

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ సృష్టికర్త గౌరవనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ దాసరి సునీత గారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేద ప్రజల ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రచించారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పాటు ఈ రాజ్యాంగాన్ని రచించారు.

పరిపాలించే ప్రభుత్వాలు శరీరమైతే రాజ్యాంగం ఆత్మ లాంటిదని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు రామచంద్ర గారు శివారెడ్డి గారు అధికారులు పాల్గొన్నారు