మహాత్మ జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
ఫూలే స్ఫూర్తితో అణగారిన అభ్యున్నతి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. మహాత్మ జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్న ఫూలే విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూల మాల వేసి, నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జ్యోతిరావు ఫూలే పోరాటాలు, సంస్కరణలు ఆదర్శనీయమన్నారు. ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించారన్నారు.
బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారన్నారు. ఫూలే ఆలోచనలకు అనుగుణంగా పరిపాలనలో ముందుకెళ్తూ దేశ ప్రజల దృష్టిని సీఎం జగనన్న ఆకర్షిస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి, అత్యధిక సీట్లు వారికే కేటాయించడం గర్వంగా ఉందన్నారు. ఫూలే కలలుగన్న పాలన జగనన్నతో సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీసీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Nov 30 2023, 07:48