గోవిందంపల్లి, రాఘవేంద్ర కాలనీ, భద్రంపల్లి, బోయ కొట్టాల గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం...
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు :ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను కుల, మత,పార్టీ, భేదం లేకుండా అందజేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, రాఘవేంద్ర కాలనీ, భద్రంపల్లి, బోయ కొట్టాల గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు.
ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవుతున్నాయా? లేదా అని తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిని ఆయా కుటుంబాలకు బుక్లెట్ ద్వారా వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగనన్న పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతోనే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. మరోసారి తమను ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Nov 29 2023, 14:24