ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన గార్లదిన్నె మండలం కమలాపురం రజకులు..

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన రజకులు గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామ‌ రజకులు ధోబి ఘాట్ కు బోరు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కోరడం జరిగింది. స్పందించి బోరు వేయించారు.

అడిగిన వెంటనే తమ సమస్యను పరిష్కరించినందుకు అనంతపురంలోని రజకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పరిష్కారానికి కృషి చేసిన సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి యువ నాయకుడు ఆలూరు ఎర్రిస్వామిరెడ్డికి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకట నారాయణ, వైస్సార్సీపీ నాయకులు శంకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామచంద్ర, రజకులు రామంజినేయులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

గోవిందంపల్లి, రాఘవేంద్ర కాలనీ, భద్రంపల్లి, బోయ కొట్టాల గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం...

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు :ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను కుల, మత,పార్టీ, భేదం లేకుండా అందజేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, రాఘవేంద్ర కాలనీ, భద్రంపల్లి, బోయ కొట్టాల గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు.

ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవుతున్నాయా? లేదా అని తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిని ఆయా కుటుంబాలకు బుక్లెట్ ద్వారా వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగనన్న పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతోనే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. మరోసారి తమను ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవం...

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ సృష్టికర్త గౌరవనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ దాసరి సునీత గారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేద ప్రజల ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రచించారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పాటు ఈ రాజ్యాంగాన్ని రచించారు.

పరిపాలించే ప్రభుత్వాలు శరీరమైతే రాజ్యాంగం ఆత్మ లాంటిదని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు రామచంద్ర గారు శివారెడ్డి గారు అధికారులు పాల్గొన్నారు

భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

ప్రజాయుధం రాజ్యాంగం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. విభిన్న వర్గాలకు చెందిన భారతీయులను ఒక్కటిగా ఉంచే గొప్ప గ్రంథం భారత రాజ్యాంగమని, నిస్సహాయులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన ప్రజాయుధం అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాళులర్పించారు.

అనంతరం రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి కారణంగానే భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందన్నారు. ఆ మహనీయుని ఆశయాలను, ఆలోచనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ర్టంలో అమలు చేస్తున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న ప్రభుత్వంలో సముచిత న్యాయం జరిగిందన్నారు.

అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ తో, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి చేస్తున్నామన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఎస్సీ సెల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారి డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన మాబు..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామ సమీపంలో తాడిపత్రి నుం

చి వస్తున్న టూ వీలర్.. రెడ్డిపల్లి గ్రామం వద్ద డివైడర్ ఢీకొని అక్కడికక్కడే మాబు అనే వ్యక్తి టు వీలర్ వెనుక భాగంలో కూర్చొని ఉండటంతో ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.

టూ వీలర్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ఉండడంతో కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కనుక టూ వీలర్ లో ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ కంపల్సరిగా ధరించుకొని తక్కువ వేగంతో ప్రయాణించాలని కోరుతూ ఇట్లు మీ స్ట్రీట్ బజ్ న్యూస్ యాప్..

ఎస్.ఆర్.ఐటి. కళాశాల నందు ప్రెషర్స్ వెల్కమ్ పార్టీకి ముఖ్యఅతిథిగా భారత క్రికెట్ ఆటగాడు.. అంబటి రాయుడు

క్రమశిక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు: క్రికెటర్ అంబటి రాయుడు.. బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురంలో ఉన్న ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో 2023లో చేరిన నూతన విద్యార్థినీ విద్యార్థుల స్వాగతోత్సవం(ప్రభవ) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలోని ముసలమ్మ కట్ట దగ్గర ఉన్న దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ యువ నాయకుడు ఆలూరు ఎర్రిస్వామి రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి కళాశాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

కళాశాలలో ఏర్పాటుచేసిన స్వాగతోత్సవ(ప్రభవ) కార్యక్రమంలో ముందుగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. రాయుడు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. అనంతరం సాంబ శివారెడ్డి మాట్లాడుతూ..

కళాశాల యాజమాన్యం కల్పించే వివిధ సదుపాయాలను సక్రమంగా వినియోగించుకుంటూ, శిక్షణలను అందుకుని విద్యా పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్తుకి సోపానాలు వేసుకొని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఏపీ ఎంసెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఒంటి గంట సమయము కాకముందే మూతపడిన అంగన్వాడి కేంద్రం..

ఒంటి గంట సమయము కాకముందే మూతపడిన బుక్కరాయసముద్రం మండలం పసులూరు పంచాయతీ లోని కొత్తపల్లి అంగన్వాడి కేంద్రం.

నెలలో ఎక్కువ రోజులు మీటింగులు ఆఫీసు వర్కులని అంగన్వాడి సెంటర్ కి మూత వేయడం జరుగుజరుగుతోంది..

అంగన్వాడీ టీచర్ , ఆయా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, వీలైన తొందరగా వారి పైన పై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

వైభవంగా తెప్పోత్సవం.. గంగ పూజ చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు...

వైభవంగా తెప్పోత్సవం.. గంగ పూజ చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు భక్తుల గోవింద నామస్మరణతో శింగనమల రంగరాయల చెరువు పులకించింది. విద్యుత్ దీప కాంతులు, పూలతో అలంకరించిన తెప్పపై సీతా ఆత్మారామస్వామి, భూదేవి, శ్రీదేవి సమేత గొలకొండ వెంకటరమణస్వామి, ఆంజనేయ స్వామి, వాసవీమాత విగ్రహాలను అత్యంత వైభవంగా ఊరేగించారు.

తెప్పోత్సవానికి శింగనమల చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 4 గంటలకు స్వాముల విగ్రహాలను రామాలయం నుంచి చెరువు వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు తెప్ప పైన విగ్రహాలను కొలువు దీర్చి పూజలు చేశారు. తెప్పోత్సవం ముగిసాక గ్రామంలో విగ్రహాలను ఊరేగించారు. ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు* ప్రతి ఏటా కార్తీక మాసం ద్వాదశి రోజున ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది కూడా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తెప్ప, చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు గంగపూజ చేశారు. శింగనమల చెరువు ఎప్పుడూ నీటితో కళకళలాడుతూ, పంటలు బాగా పండాలని, రైతులు, మత్స్యకారులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుడిని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శింగనమల మండలం కల్లుమడి గ్రామంలోని చెన్నకేశవాలయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు కార్తీక మాసం ద్వాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Breaking.. గొడ్డుమర్రి గ్రామంలో కప్పల రమేష్ (29)విద్యుత్ ప్రమాదం లో వ్యక్తి మృతి. శోకసముద్రంలో కుటుంబ సభ్యులు..


అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలోని

గొడ్డుమర్రి గ్రామంలో కప్పల రమేష్ (29)విద్యుత్ ప్రమాదం లో వ్యక్తి మృతి. శోకసముద్రంలో కుటుంబ సభ్యులు

మోటార్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ తీగ రమేష్ మీద పడి అక్కడికక్కడే విద్యుత్ షాక్ తో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Flash Flash..రేకులకుంట గ్రామ సమీపంలో..ఆటో మరియు టూ వీలర్ ఢీ...

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామ సమీపంలో మంచాల రాము తోట దగ్గరలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఆటో మరియు టూ వీలర్ ఢీ కొన్నాయి ఈ ప్రమాదంలో వెంకటాపురం గ్రామానికి చెందిన వారు వున్నారు

నార్పల వైపు నుండి వస్తున్న ఓబులాపురం ఆటో వెంకటాపురం టూ వీలర్ రెండు డి కొనడంతో టు వీలర్ ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు.

విషయం తెలుసుకున్న బుక్కరాయసముద్రం పోలీసు వారు అక్కడికి చేరుకొని అంబులెన్స్ పిలిపించి గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు