భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ప్రజాయుధం రాజ్యాంగం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. విభిన్న వర్గాలకు చెందిన భారతీయులను ఒక్కటిగా ఉంచే గొప్ప గ్రంథం భారత రాజ్యాంగమని, నిస్సహాయులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన ప్రజాయుధం అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాళులర్పించారు.
అనంతరం రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి కారణంగానే భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందన్నారు. ఆ మహనీయుని ఆశయాలను, ఆలోచనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ర్టంలో అమలు చేస్తున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న ప్రభుత్వంలో సముచిత న్యాయం జరిగిందన్నారు.
అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ తో, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి చేస్తున్నామన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఎస్సీ సెల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Nov 27 2023, 07:17