ఎస్.ఆర్.ఐటి. కళాశాల నందు ప్రెషర్స్ వెల్కమ్ పార్టీకి ముఖ్యఅతిథిగా భారత క్రికెట్ ఆటగాడు.. అంబటి రాయుడు
క్రమశిక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు: క్రికెటర్ అంబటి రాయుడు.. బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురంలో ఉన్న ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో 2023లో చేరిన నూతన విద్యార్థినీ విద్యార్థుల స్వాగతోత్సవం(ప్రభవ) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలోని ముసలమ్మ కట్ట దగ్గర ఉన్న దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ యువ నాయకుడు ఆలూరు ఎర్రిస్వామి రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి కళాశాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
కళాశాలలో ఏర్పాటుచేసిన స్వాగతోత్సవ(ప్రభవ) కార్యక్రమంలో ముందుగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. రాయుడు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. అనంతరం సాంబ శివారెడ్డి మాట్లాడుతూ..
కళాశాల యాజమాన్యం కల్పించే వివిధ సదుపాయాలను సక్రమంగా వినియోగించుకుంటూ, శిక్షణలను అందుకుని విద్యా పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్తుకి సోపానాలు వేసుకొని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఏపీ ఎంసెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Nov 26 2023, 13:49