కులగణన సర్వేపై గ్రామ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, మండల స్థాయి సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు...

కులగణన సర్వేపై మండల పరిషత్ కార్యాలయంలో ని మీటింగ్ హాల్ నందు గ్రామ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, మండల స్థాయి సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడమైనది. ఈనెల 27వ తేదీ నుంచి జరగబోయే కులగణన సర్వే పై శిక్షణ తరగతులను సిపిఓ అశోక్ కుమార్ గారు,ఎంపీడీవో తెజ్యోష్ణ గారు,ఎమ్మార్వో రమాదేవి గారు, ఏఎస్ఓ పోతిరెడ్డి గారు శిక్షణ తరగతులు నిర్వహించారు. అందులో భాగంగా కులగణన సర్వేన పకడ్బందీగా చేపట్టాలని తెలపటం జరిగింది.

సర్వేని ఎలా నిర్వహించాలి అనే విషయాలపైన, మరియు యాప్ ఎలా వాడాలో ఏ ఫార్మాట్లో నిర్వహించాలో అని విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. 27వ తేదీ నుంచి ఈ సర్వే ప్రారంభం అవుతుందని,ఈ సర్వే వారం రోజుల్లో మండల వ్యాప్తంగా ఈ సర్వే పూర్తి చేయాలని సూచించడం జరిగింది.

ఈఈ హౌసింగ్ క్రిష్ణారావు గారు, డిఈ హౌసింగ్ శ్రీమన్నారాయణ గారు విరూపాక్ష నగర్ నందు లబ్ధిదారులతో సమావేశం
ఈఈ హౌసింగ్ క్రిష్ణారావు గారు, డిఈ హౌసింగ్ శ్రీమన్నారాయణ గారు బుక్కరాయసముద్రం మండల పరిధిలోని విరూపాక్ష నగర్ నందు లబ్ధిదారులతో సమావేశం జరపడమైంది. లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకొని పూర్తి చేయమని చెప్పియున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ హౌసింగ్ రాజశఖర్ రెడ్డి, బల్లే రాజ గారు , వర్క్ ఇన్స్పెక్టర్ , ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు
ఈద్గా మినార్లకు 30 వేల రూపాయలు విరాళంగా అందజేసిన మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి..
బుక్కరాయసముద్రం మండలం పొడ్రాళ్ల గ్రామం నందు ఈద్గా మినార్లకు గ్రామ ముస్లిం సోదరులు అడిగిన వెంటనే 30 వేల రూపాయలు విరాళంగా అందజేసిన మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి కార్యక్రమంలో జడ్పిటిసి నీలం భాస్కర్, మండల మాజి సింగిల్ విండో అధ్యక్షులు నాగలింగారెడ్డి, మండల కన్వీనర్ అంకె నరేష్, వైస్ ఎంపీపీ రాంగోపాల్ సర్పంచులు ఎర్రిస్వామి, నాగిరెడ్డి , ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, అప్పిరెడ్డి అనంత వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామిరెడ్డి, పురుషోత్తం, ముత్యాల శ్రీనివాసులు సాకే లక్ష్మీనారాయణ ముస్లిం సోదరులు ఎస్ షేక్షావలి, సాదిక్ వలి, రసూల్, పి షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
వడియంపేట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం...

బుక్కరాయసముద్రం మండలం వడియంపేట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఉన్న వడియంపేట, B కొత్తపల్లి, పొడరాల్ల, రేగడికొత్తూరు ప్రజలకు జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు DBT&NonDBT ద్వారా సుమారు 45కోట్ల 72లక్షలు51వేలు రూపాయలు మన సచివాలయానికి రావడం జరిగింది అని తెలియజేయడం జరిగింది

మన గ్రామాల్లో పిల్లల భవిష్యత్ బాగా ఉండాలంటే మళ్ళీ జగనన్న సీఎం కావాలి. అదేవిధంగా రైతులు బాగుండాలి అని శింగనమల చెరువు లోకలైజేసన్ చేయించిన ఘనత మన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతమ్మ గారిది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నీలం భాస్కర్, ఎంపీపీ సునీత మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి, మాజి సింగిల్ విండో అధ్యక్షులు నాగలింగారెడ్డి మండల కన్వీనర్ అంకె నరేష్, జెసిఎస్ మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి, వైస్ ఎంపీపీ రాంగోపాల్ సర్పంచులు ఎర్రిస్వామి, నాగిరెడ్డి , ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, అప్పిరెడ్డి Eord దామోదరమ్మ, సచివాలయ కన్వీనర్లు అనంత వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామిరెడ్డి, పురుషోత్తం, సాకే లక్ష్మీనారాయణ ముత్యాల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ అధికారులు వాలంటీర్లు, గృహసారదులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సంక్షేమ సారథిని మరోసారి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి...

నాలుగున్నరేళ్లుగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

శింగనమల మండలం తరిమెల, చింతమేకలపల్లి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నాలుగేళ్లల్లో ప్రభుత్వం నుంచి పొందిన లబ్దిని ఆయా కుటుంబాలకు బుక్లెట్ ద్వారా వివరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇంటి వద్దకే అందుతున్నాయో బేరీజు వేసుకొని ప్రజలు రానున్న ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా నష్టపోయిన ప్రతి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి, ఉపాధి హామీ పనులు 200 రోజులు కలిపించి,రోజు కూలీ రూ.600లు ఇవ్వాలని కోరుతూ.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా నష్టపోయిన ప్రతి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి. వాస్తవంగా సాగులో ఉన్న కౌలు రైతులకు పరిహారం చెల్లించాలి. బ్యాంకు రైతుల అప్పులు మాఫి చేయాలి. ఉపాధి హామీ పనులు 200 రోజులు కలిపించి, రోజు కూలీ రూ.600లు ఇవ్వాలని కోరుతూ సిపిఎం మెమొరాండం ఈరోజు సిపిఎం బుక్కరాయ సముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ గారికి జిల్లాలో కరువు పరిస్థితుల రీత్యా పంటలు పెట్టిన ప్రతి రైతుకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము నష్టపరిహారం ఇవ్వాలని రైతుల అప్పులు రద్దు చేయాలని ఇతర సమస్యలపై మండల తాసిల్దార్ గారికి సిపిఎం మండల కమిటీ విజ్ఞప్తి చేసింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓనల్లప్ప మండల నాయకులు నాగేంద్ర పుల్లయ్య రాముడు వెంకటేష్ శ్రీరాములు కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు రాకపోవడంతో వేరుశెనగ, కంది, పత్తి, ఆముదం, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు పూర్తిగా నష్టపోయాయి. జిల్లాలోని మొత్తం 31 మండలాలకు గాను 28 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31న ప్రకటించింది. పంట నష్టపరిహారం అంచనాల కోసం ఈ నెల 14న జీవో నెంబర్ 5 విడుదల చేసింది. ఇందులోని నిబంధనలు రైతులకు ఉపసమనం కలిగించే విధంగా లేకపోగా తీవ్ర నష్టం చేస్తాయి. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సమయంలో 33 శాతం పైగా పంటనష్టం జరిగి ఉండాలని, గరిష్టంగా రెండు హెక్టార్లకు మాత్రమే పరిహారం ఇవ్వాలని, వేరుశెనగ, పత్తి పంటల పెట్టుబడి ఖర్చు ఎకరాకు రూ.45 వేలు అవుతుండగా ప్రస్తుత నిబంధనల వల్ల ఎకరాకు కేవలం రూ.6,800 లు మాత్రమే అందుతుందన్నారు. అలాగే ఇతర పంటల పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా రైతులను ఆదుకునే విధంగా లేదన్నారు. పంటల సాగుకు బ్యాంకులు పెట్టుబడి రుణం ఇవ్వడానికి నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా పంట నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం మండల కమిటి కోరుతున్నది. వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని, రోజుకు రూ.600 ల వేతనం ఇవ్వాలి. పంటసాగుచేసిన కౌలు రైతులకే పంటనష్టపరిహారం అందివ్వాలని, రైతుల బ్యాంకు అప్పులు మాఫి చేయాలని కోరుతున్నాము. క్రింది సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వము తక్షణము చొరవ చూపాలని సిపిఎం మండల కమిటీ కోరుతున్నది. 1. నష్టపోయిన ప్రతి పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా పంట నష్టపరిహారం ఇవ్వాలి. 2. పంటనష్టపరిహారం గరిష్టంగా రెండు హెక్టార్ల వరకు ఇవ్వాలి. 3. పంటసాగుచేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు గరిష్టంగా రూ.50వేలు, వర్షాభావం వల్ల విత్తనం కూడా వేయలేని రైతులకు ఎకరాకు రూ. 30 వేలు పరిహారం ఇవ్వాలి 4. వాస్తవ సాగుదార్లులైన కౌలు రైతులకు పంటనష్టపరిహారం చెల్లించాలి 5. వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని, రోజుకు రూ.600 ల వేతనం ఇవ్వాలి. 6. పట్టణాల్లో ఉపాధి హామీ పనులు పెట్టాలి. 7. రైతుల బ్యాంకు అప్పులు మాఫీ చేయాలి 8. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక కుటుంబాల విద్యార్థుల అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలి 9. రెవిన్యూ గ్రామాలలో పశుగ్రాసకేంద్రాలు ఏర్పాటు చేయాలి 10. ఆత్మహత్య చేసుకున్న రైతు, కౌలు రైతులకు పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలి పై డిమాండ్లను పరిష్కరించి జిల్లా ప్రజలను ఆదుకోవాలని తహసిల్దార్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
నార్పల మండల కేంద్రంలో సచివాలయం, 1, గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమం
నార్పల మండల కేంద్రంలో సచివాలయం, 1, గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ జగనన్న ఎందుకు కావాలని అనే ప్రోగ్రాం లో పాల్గొన్న జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ గారు మండల అధ్యక్షులు నాగేశ్వరావు గారు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సుప్రియ గారు ఉప సర్పంచ్ గవ్వల శ్రీరాములు గారు పంచాయతీ సెక్రెటరీ అశ్వత్థామ నాయుడు గారు ఎంపీటీసీ సభ్యులు వార్డు మెంబర్లు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొన్న బుక్కరాయసముద్రం మండల ఎంపీపీ దాసరి సునీత..
గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత గారు. 56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం బుక్కరాయసముద్రం గ్రామంలో గల గ్రంధాలయం నందు గ్రంధాలయ అధికారి విజయభాస్కర్ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దాసరి సునీత గారు సర్పంచ్ పార్వతి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రజలు సెల్ఫోన్ వాడకము తగ్గించి పుస్తక పఠనం చేసి తగినంత విజ్ఞానాన్ని సేకరించవచ్చని అన్నారు గ్రంథాలయము నందు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వాటిని చదివి విజ్ఞానవంతులు కావాలని పేర్కొన్నారు చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరు వీరేశలింగం పంతులుగారు చెప్పినవి నినాదాన్ని పాటిద్దాం అని చెప్పారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు పెద్దపీట వేశారని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యారంగంలో మంచి ర్యాంకులు సాధించి మనకు మన జగనన్నకు గిఫ్టుగా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడలలో ప్రావీణ్యమును చూపించిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీటీడబ్ల్యు ప్రిన్సిపల్ ప్రభాకర్ గారు రిటైర్డ్ గ్రంథాలయ అధికారి సత్యనారాయణ గారు ఉపాధ్యాయులు గోపాల్, చంద్ర, శ్రీ నాయక్ గారు పాల్గొన్నారు
సిద్ధరాంపురం సచివాలయ పరిధిలో ప్రజలకు జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు DBT&NonDBT ద్వారా సుమారు 28కోట్ల 61లక్షలు రూ.లు
బుక్కరాయసముద్రం మండలం సిద్దారాంపురం సచివాలయం ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సిద్ధరాంపురం సచివాలయ పరిధిలో ప్రజలకు జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు DBT&NonDBT ద్వారా సుమారు 28కోట్ల 61లక్షలు రూపాయలు శిద్దరాంపురం గ్రామానికి రావడం జరిగింది అని తెలియజేయడం జరిగింది మన గ్రామంలో ప్రజలు పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మళ్ళీ జగనన్న సీఎం కావాలి అదేవిధంగా పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే జగనన్న ఉంటేనే జరుగుతుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నీలం భాస్కర్, ఎంపీపీ సునీత ఆలూరు రమణారెడ్డి, మండల కన్వీనర్ అంకె నరేష్, జెసిఎస్ మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి, సర్పంచులు కొండన్న కల్పన, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు కాలువ వెంకటలక్ష్మి, శివారెడ్డి,Eord దామోదరమ్మ, సచివాలయ కన్వీనర్ జగదీశ్వర్ రెడ్డి పిట్టు సూర్యనారాయణ రెడ్డి, బండి భాస్కర్ రెడ్డి, డీలర్ శివ, నాగముని, డీలర్ భాస్కర్ చికెన్ నారాయణస్వామి బుల్లె నారాయణస్వామిసెక్రటరీ రవికుమార్, సచివాలయ అధికారులు వాలంటీర్లు నాయకులు గృహసారదులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
నార్పల మండలంలో అదృశ్యమయిన మహిళల కేసులను 24 గంటల్లోనే ఛేదించిన నార్పల పోలీసులు..

అదృశ్యమయిన మహిళల కేసులను 24 గంటల్లోనే ఛేదించిన నార్పల పోలీసులు.. నార్పల మండల పరిధిలోని మాలవాండ్లపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ మూగే తిమ్మంపల్లి గ్రామనికి చెందిన ఒక మహిళ అదృశ్యం అయినట్లు నార్పల పొలీస్ స్టేషన్లో శనివారం రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి నార్పల పోలీసులను రెండు బృందాలుగా ఏర్పాటు చేసి అదృశ్యమైనటువంటి ఇరువురు మహిళలను వారు ఉన్న ప్రదేశాలను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొని 24 గంటల్లోనే ఆ కేసులను ఛేదించి వారి వారి కుటుంబ సభ్యులకు మహిళలను అప్పగించారు. అర్షం వ్యక్తం చేస్తున్న ఇరు గ్రామ ప్రజలు