సంక్షేమ సారథిని మరోసారి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి...
నాలుగున్నరేళ్లుగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
శింగనమల మండలం తరిమెల, చింతమేకలపల్లి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నాలుగేళ్లల్లో ప్రభుత్వం నుంచి పొందిన లబ్దిని ఆయా కుటుంబాలకు బుక్లెట్ ద్వారా వివరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇంటి వద్దకే అందుతున్నాయో బేరీజు వేసుకొని ప్రజలు రానున్న ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Nov 22 2023, 12:02