59 వ గ్రంథాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవ వేడుకల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ..
అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా గ్రంథాలయ ప్రాంగణం నందు గ్రంథాలయ చైర్ వర్సన్ శ్రీమతి యల్.యం ఉమా మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన 59 వ గ్రంథాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ
గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో మొదటగా దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి మరియు ఇందిరాగాంధీ చిత్ర పటాలకు పూల మాలలతో నివాళులు అర్పించి, అనంతరం చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ విద్య సమాజంలో మార్పు తీసుకురావడమే కాకుండా అభివృద్ధికి మార్గం చూపుతుందని, మరి అలాంటి విద్య కు గ్రంథాలయాలు జ్ఞానాన్ని పంచే కేంద్రాలుగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులలో భాగంగా గ్రంథాలయాల అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ,
మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా పాఠకులకు అందుబాటులో డిజిటల్ లైబ్రరీలను సచివాలయ పరిధిలో ఏర్పాటు చేయడం వలన, ప్రస్తుత సమాజంలో మగ వారికి దీటుగా ఆడవారు అన్ని రంగాలలో రాణిస్తున్నారు, విద్యలో కూడా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకుంటున్నారని,
ఈ డిజిటల్ లైబ్రరీల ద్వారా గ్రామీణ మహిళలు కూడా సమాచారాన్ని అవగతం చేసుకుని వారు మరింత ముందడుగువేయడానికి గొప్పగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ, పాఠకులందరూ గ్రంథాలయాల సేవలను సద్వినియోగ పరచుకోవాలని పిలునిచ్చారు.
తదనంతరం కన్నుల పండుగగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను చైర్ పర్సన్ గారు వీక్షించారు. ఈ కార్యక్రమంలో లెక్షరర్ శ్రీమతి చిట్టెమ్మ గారు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ గోవిందరాజులుగారు, జిల్లా గ్రంథాలయ సిబ్బంది, ఇతర పుర ప్రముఖులు పాల్గొన్నారు.
Nov 22 2023, 12:01