నార్పల మండల కేంద్రంలో సచివాలయం, 1, గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమం
నార్పల మండల కేంద్రంలో సచివాలయం, 1, గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ జగనన్న ఎందుకు కావాలని అనే ప్రోగ్రాం లో పాల్గొన్న జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ గారు మండల అధ్యక్షులు నాగేశ్వరావు గారు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సుప్రియ గారు ఉప సర్పంచ్ గవ్వల శ్రీరాములు గారు పంచాయతీ సెక్రెటరీ అశ్వత్థామ నాయుడు గారు ఎంపీటీసీ సభ్యులు వార్డు మెంబర్లు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొన్న బుక్కరాయసముద్రం మండల ఎంపీపీ దాసరి సునీత..
గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత గారు. 56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం బుక్కరాయసముద్రం గ్రామంలో గల గ్రంధాలయం నందు గ్రంధాలయ అధికారి విజయభాస్కర్ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దాసరి సునీత గారు సర్పంచ్ పార్వతి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రజలు సెల్ఫోన్ వాడకము తగ్గించి పుస్తక పఠనం చేసి తగినంత విజ్ఞానాన్ని సేకరించవచ్చని అన్నారు గ్రంథాలయము నందు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వాటిని చదివి విజ్ఞానవంతులు కావాలని పేర్కొన్నారు చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరు వీరేశలింగం పంతులుగారు చెప్పినవి నినాదాన్ని పాటిద్దాం అని చెప్పారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు పెద్దపీట వేశారని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యారంగంలో మంచి ర్యాంకులు సాధించి మనకు మన జగనన్నకు గిఫ్టుగా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడలలో ప్రావీణ్యమును చూపించిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీటీడబ్ల్యు ప్రిన్సిపల్ ప్రభాకర్ గారు రిటైర్డ్ గ్రంథాలయ అధికారి సత్యనారాయణ గారు ఉపాధ్యాయులు గోపాల్, చంద్ర, శ్రీ నాయక్ గారు పాల్గొన్నారు
సిద్ధరాంపురం సచివాలయ పరిధిలో ప్రజలకు జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు DBT&NonDBT ద్వారా సుమారు 28కోట్ల 61లక్షలు రూ.లు
బుక్కరాయసముద్రం మండలం సిద్దారాంపురం సచివాలయం ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సిద్ధరాంపురం సచివాలయ పరిధిలో ప్రజలకు జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు DBT&NonDBT ద్వారా సుమారు 28కోట్ల 61లక్షలు రూపాయలు శిద్దరాంపురం గ్రామానికి రావడం జరిగింది అని తెలియజేయడం జరిగింది మన గ్రామంలో ప్రజలు పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మళ్ళీ జగనన్న సీఎం కావాలి అదేవిధంగా పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే జగనన్న ఉంటేనే జరుగుతుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నీలం భాస్కర్, ఎంపీపీ సునీత ఆలూరు రమణారెడ్డి, మండల కన్వీనర్ అంకె నరేష్, జెసిఎస్ మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి, సర్పంచులు కొండన్న కల్పన, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు కాలువ వెంకటలక్ష్మి, శివారెడ్డి,Eord దామోదరమ్మ, సచివాలయ కన్వీనర్ జగదీశ్వర్ రెడ్డి పిట్టు సూర్యనారాయణ రెడ్డి, బండి భాస్కర్ రెడ్డి, డీలర్ శివ, నాగముని, డీలర్ భాస్కర్ చికెన్ నారాయణస్వామి బుల్లె నారాయణస్వామిసెక్రటరీ రవికుమార్, సచివాలయ అధికారులు వాలంటీర్లు నాయకులు గృహసారదులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
నార్పల మండలంలో అదృశ్యమయిన మహిళల కేసులను 24 గంటల్లోనే ఛేదించిన నార్పల పోలీసులు..

అదృశ్యమయిన మహిళల కేసులను 24 గంటల్లోనే ఛేదించిన నార్పల పోలీసులు.. నార్పల మండల పరిధిలోని మాలవాండ్లపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ మూగే తిమ్మంపల్లి గ్రామనికి చెందిన ఒక మహిళ అదృశ్యం అయినట్లు నార్పల పొలీస్ స్టేషన్లో శనివారం రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి నార్పల పోలీసులను రెండు బృందాలుగా ఏర్పాటు చేసి అదృశ్యమైనటువంటి ఇరువురు మహిళలను వారు ఉన్న ప్రదేశాలను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొని 24 గంటల్లోనే ఆ కేసులను ఛేదించి వారి వారి కుటుంబ సభ్యులకు మహిళలను అప్పగించారు. అర్షం వ్యక్తం చేస్తున్న ఇరు గ్రామ ప్రజలు

కురువ కులస్తుల ఆరాధ్య దైవమైన 256 గుడి కట్ల సంబరాలలో రాష్ట్ర మంత్రివర్యులు ఉషాశ్రీ చరణ్, బుక్కరాయ సముద్రం మండల ఎంపీపీ దాసరి సునీత..
అనంతపురం జిల్లాలో ఉన్న కురువ కులస్తుల ఆరాధ్య దైవమైన 256 గుడి కట్ల సంబరాలు స్థానిక జూనియర్ కాలేజ్ మైదానం నందు జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు ఉషా శ్రీ చరణ్ తో పాటు
పాల్గొన్న బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత గారు
కొల్లాపురమ్మ ఆలయానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు 10 లక్షల విరాళం..!
కొల్లాపురమ్మ ఆలయానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు 10 లక్షల విరాళం..!

చెన్నేకొత్తపల్లి మండల కేంద్రములో ఉన్న కొల్లాపురమ్మ అలయ అభివృద్ధికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు 10 లక్షలు రూపాయలు విరాళం ప్రకటించారు.

ఈ మొత్తాన్ని వైఎస్ఆర్సిపి రాప్తాడు నియోజకవర్గం సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారు ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
59 వ గ్రంథాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవ వేడుకల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ..

అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా గ్రంథాలయ ప్రాంగణం నందు గ్రంథాలయ చైర్ వర్సన్ శ్రీమతి యల్.యం ఉమా మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన 59 వ గ్రంథాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో మొదటగా దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి మరియు ఇందిరాగాంధీ చిత్ర పటాలకు పూల మాలలతో నివాళులు అర్పించి, అనంతరం చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ విద్య సమాజంలో మార్పు తీసుకురావడమే కాకుండా అభివృద్ధికి మార్గం చూపుతుందని, మరి అలాంటి విద్య కు గ్రంథాలయాలు జ్ఞానాన్ని పంచే కేంద్రాలుగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులలో భాగంగా గ్రంథాలయాల అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ,

మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా పాఠకులకు అందుబాటులో డిజిటల్ లైబ్రరీలను సచివాలయ పరిధిలో ఏర్పాటు చేయడం వలన, ప్రస్తుత సమాజంలో మగ వారికి దీటుగా ఆడవారు అన్ని రంగాలలో రాణిస్తున్నారు, విద్యలో కూడా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకుంటున్నారని,

ఈ డిజిటల్ లైబ్రరీల ద్వారా గ్రామీణ మహిళలు కూడా సమాచారాన్ని అవగతం చేసుకుని వారు మరింత ముందడుగువేయడానికి గొప్పగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ, పాఠకులందరూ గ్రంథాలయాల సేవలను సద్వినియోగ పరచుకోవాలని పిలునిచ్చారు.

తదనంతరం కన్నుల పండుగగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను చైర్ పర్సన్ గారు వీక్షించారు. ఈ కార్యక్రమంలో లెక్షరర్ శ్రీమతి చిట్టెమ్మ గారు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ గోవిందరాజులుగారు, జిల్లా గ్రంథాలయ సిబ్బంది, ఇతర పుర ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి మరియు బుక్కరాయసముద్రం మండలం వైసిపి శ్రేణులు..

తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి మరియు ఆలూరు రమణారెడ్డి గార్లతో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా 2024 ఎలక్షన్ లో శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతమ్మ గారు అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఏడుకొండలవారు శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది.

స్వామివారి దర్శనం కల్పించినందుకు ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతమ్మ గారికి మరియు ఆలూరు సాంబశివారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

స్వామివారిని దర్శించుకున్న వారిలో నాగలింగారెడ్డి , జే.సి.ఎస్ మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి, చెదుల్ల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ శివారెడ్డి, నీలంపల్లి సాంబశివారెడ్డి, వడియం

పేట సుబ్బరాయుడు..

షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..!

అనంతపురం రూరల్ మండలం ఓం నగర్ (బళ్లారి రోడ్డు)లో నూతనంగా నిర్మించిన శిరిడి సాయిబాబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే గారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల్లో అద్యాత్మికత పెరగాలని తద్వారా సుఖశాంతుల జీవనం పొందాలని కోరారు. నాగరికత పెరిగేకొద్దీ సనాతన ధర్మాలు, ఆచారాలు మరిచిపోతున్నారని, అలాంటి సమయం లోనే సాయిబాబా లాంటి అవధూతలు పుట్టి మనకు మన ధర్మాన్ని ఆచారాలను గుర్తు చేస్తుంటారు. దిన చర్యల్లో భాగంగా కనీసం 20 నిమిషాలైనా భగవంతుని స్మరిస్తూ మనందరం అనుగ్రహం పొందాలని తెలిపారు...

ఆలాగే ఈ షిర్డీ సాయి బాబా ఆలయ నిర్మాణం కోసం స్థల సేకరణ లో భాగంగా కీలక పాత్ర పోషించి స్థల యజమానులతో చర్చించి ఆలయ నిర్మించాలని పట్టుపట్టి మరీ స్థల సేకరణ లో కీలక పాత్ర పోషించి, సీసీ రోడ్డుకుడా మంజూరు చేసిన శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారికి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తాదులు, ఈ ప్రాంత ప్రజలు ధన్యవాదములు తెలిపారు.. #OnceAgainThopudurthiPrakashReddy #ThopudurthiPrakashReddy #RapthaduMLA #TeamTPR

ఈనెల 22న రాష్ట్రపతి పుట్టపర్తి పర్యటన-ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ జవహర్ రెడ్డి..

ఈనెల 22న రాష్ట్రపతి పుట్టపర్తి పర్యటన-ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ జవహర్ రెడ్డి. అన్ని శాఖలు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేసినందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయుచున్నాము. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22వ తేదీ శ్రీసత్య సాయి జిల్లా పుట్టపర్తి సందర్శించనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెస్.జవహర్ వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22న మధ్యాహ్నం 12.30 గం.లకు బెంగుళూరు నుండి భారత వాయుసేన విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకుని అక్కడి నుండి ప్రశాంతి నిలయానికి చేరుకుని అక్కడ జరిగే శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కేంద్రం 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు.కావున రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ముందుగా వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు,ఎస్పి మాధవ రెడ్డిలతో సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.అలాగే బందోబస్తు ఇతర ఏర్పాట్లపై వీడియో లింక్ ద్వారా పాల్గొన్న పోలీసు డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డితో ఆయన సమీక్షించారు.

రాష్ట్రపతి పర్యటనలో వైద్య ఆరోగ్యశాఖ పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిఎస్ మాట్లాడుతూ డిఎంఇని స్వయంగా మంగళవారం పుట్టపర్తి వెళ్ళి జిల్లా కలెక్టర్,ఎస్పి తదితర అధికారుల సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.అలాగే ప్రోటోకాల్ విభాగం ద్వారా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన టూర్ ప్రోగ్రాం సహా ఆహ్వాన కార్డులు సక్రమంగా అందరికీ అందేలా చూడాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ యం.బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని ఆయన ఆదేశించారు. ఇంకా సంబంధిత శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న ఆయా శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని విధంగా రాష్ట్రపతి పర్యటన విజయవంతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మధ్యాహ్నం సమయంలో రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను జిల్లా కలెక్టర్, పి అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, శ్రీ సత్య సాయి ట్రస్ట్ రత్నాకర్, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి, పుట్టపర్తి విమానాశ్రయం, సాయి హేరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్, సాయి శ్రీనివాస్ అతిథిగృహమును పరిశీలించి, అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు జారీ చేశారు, పట్టిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉన్నత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డి ఐ పి ఆర్ ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారీ.