ఈనెల 22న రాష్ట్రపతి పుట్టపర్తి పర్యటన-ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ జవహర్ రెడ్డి..
ఈనెల 22న రాష్ట్రపతి పుట్టపర్తి పర్యటన-ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ జవహర్ రెడ్డి. అన్ని శాఖలు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేసినందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయుచున్నాము. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22వ తేదీ శ్రీసత్య సాయి జిల్లా పుట్టపర్తి సందర్శించనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెస్.జవహర్ వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22న మధ్యాహ్నం 12.30 గం.లకు బెంగుళూరు నుండి భారత వాయుసేన విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకుని అక్కడి నుండి ప్రశాంతి నిలయానికి చేరుకుని అక్కడ జరిగే శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కేంద్రం 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు.కావున రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
ముందుగా వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు,ఎస్పి మాధవ రెడ్డిలతో సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.అలాగే బందోబస్తు ఇతర ఏర్పాట్లపై వీడియో లింక్ ద్వారా పాల్గొన్న పోలీసు డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డితో ఆయన సమీక్షించారు.
రాష్ట్రపతి పర్యటనలో వైద్య ఆరోగ్యశాఖ పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిఎస్ మాట్లాడుతూ డిఎంఇని స్వయంగా మంగళవారం పుట్టపర్తి వెళ్ళి జిల్లా కలెక్టర్,ఎస్పి తదితర అధికారుల సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.అలాగే ప్రోటోకాల్ విభాగం ద్వారా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన టూర్ ప్రోగ్రాం సహా ఆహ్వాన కార్డులు సక్రమంగా అందరికీ అందేలా చూడాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ యం.బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని ఆయన ఆదేశించారు. ఇంకా సంబంధిత శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న ఆయా శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని విధంగా రాష్ట్రపతి పర్యటన విజయవంతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మధ్యాహ్నం సమయంలో రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను జిల్లా కలెక్టర్, పి అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, శ్రీ సత్య సాయి ట్రస్ట్ రత్నాకర్, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి, పుట్టపర్తి విమానాశ్రయం, సాయి హేరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్, సాయి శ్రీనివాస్ అతిథిగృహమును పరిశీలించి, అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు జారీ చేశారు, పట్టిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉన్నత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డి ఐ పి ఆర్ ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారీ.
Nov 21 2023, 07:04