షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..!

అనంతపురం రూరల్ మండలం ఓం నగర్ (బళ్లారి రోడ్డు)లో నూతనంగా నిర్మించిన శిరిడి సాయిబాబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే గారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల్లో అద్యాత్మికత పెరగాలని తద్వారా సుఖశాంతుల జీవనం పొందాలని కోరారు. నాగరికత పెరిగేకొద్దీ సనాతన ధర్మాలు, ఆచారాలు మరిచిపోతున్నారని, అలాంటి సమయం లోనే సాయిబాబా లాంటి అవధూతలు పుట్టి మనకు మన ధర్మాన్ని ఆచారాలను గుర్తు చేస్తుంటారు. దిన చర్యల్లో భాగంగా కనీసం 20 నిమిషాలైనా భగవంతుని స్మరిస్తూ మనందరం అనుగ్రహం పొందాలని తెలిపారు...

ఆలాగే ఈ షిర్డీ సాయి బాబా ఆలయ నిర్మాణం కోసం స్థల సేకరణ లో భాగంగా కీలక పాత్ర పోషించి స్థల యజమానులతో చర్చించి ఆలయ నిర్మించాలని పట్టుపట్టి మరీ స్థల సేకరణ లో కీలక పాత్ర పోషించి, సీసీ రోడ్డుకుడా మంజూరు చేసిన శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారికి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తాదులు, ఈ ప్రాంత ప్రజలు ధన్యవాదములు తెలిపారు.. #OnceAgainThopudurthiPrakashReddy #ThopudurthiPrakashReddy #RapthaduMLA #TeamTPR

ఈనెల 22న రాష్ట్రపతి పుట్టపర్తి పర్యటన-ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ జవహర్ రెడ్డి..

ఈనెల 22న రాష్ట్రపతి పుట్టపర్తి పర్యటన-ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ జవహర్ రెడ్డి. అన్ని శాఖలు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేసినందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయుచున్నాము. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22వ తేదీ శ్రీసత్య సాయి జిల్లా పుట్టపర్తి సందర్శించనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెస్.జవహర్ వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22న మధ్యాహ్నం 12.30 గం.లకు బెంగుళూరు నుండి భారత వాయుసేన విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకుని అక్కడి నుండి ప్రశాంతి నిలయానికి చేరుకుని అక్కడ జరిగే శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కేంద్రం 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు.కావున రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ముందుగా వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు,ఎస్పి మాధవ రెడ్డిలతో సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.అలాగే బందోబస్తు ఇతర ఏర్పాట్లపై వీడియో లింక్ ద్వారా పాల్గొన్న పోలీసు డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డితో ఆయన సమీక్షించారు.

రాష్ట్రపతి పర్యటనలో వైద్య ఆరోగ్యశాఖ పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిఎస్ మాట్లాడుతూ డిఎంఇని స్వయంగా మంగళవారం పుట్టపర్తి వెళ్ళి జిల్లా కలెక్టర్,ఎస్పి తదితర అధికారుల సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.అలాగే ప్రోటోకాల్ విభాగం ద్వారా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన టూర్ ప్రోగ్రాం సహా ఆహ్వాన కార్డులు సక్రమంగా అందరికీ అందేలా చూడాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ యం.బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని ఆయన ఆదేశించారు. ఇంకా సంబంధిత శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న ఆయా శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని విధంగా రాష్ట్రపతి పర్యటన విజయవంతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మధ్యాహ్నం సమయంలో రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను జిల్లా కలెక్టర్, పి అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, శ్రీ సత్య సాయి ట్రస్ట్ రత్నాకర్, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి, పుట్టపర్తి విమానాశ్రయం, సాయి హేరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్, సాయి శ్రీనివాస్ అతిథిగృహమును పరిశీలించి, అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు జారీ చేశారు, పట్టిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉన్నత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డి ఐ పి ఆర్ ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారీ.

ఘర్షణలో గాయపడినటీడీపీ కార్యకర్త సుబ్బారాయుడునీ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ రామలింగారెడ్డి..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలోని అనంతసాగర కాలనీలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడి అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యాశాల నందు చికత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త సుబ్బారాయుడునీ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా..

వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా 

అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్లైన్ యాప్ లు గుర్తింపు

ఈ యాప్ లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ గారు సిఫారసు లేఖ

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించం

క్రికెట్ బెట్టింగు నిర్వాహకులు, పందేలు కాచే వారెరవర్నీ వదలకండి...క్రికెట్ బెట్టింగ్ జోలికెళితే కఠిన చర్యలు తప్పవు

జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగులతో సంబంధాలు ఉన్న పాత నేరస్తులు 50 మందిపై బౌండోవర్ కేసులు

-- జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారు

 2023 వర్ల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతున్న విషయం తెలిసిందే

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దిగ్గజ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ జరుగుతుండటంతో అందరి దృష్టి అటువైపే ఉంటుంది. 

క్రికెట్ ఆటను వీక్షిస్తూ ఆనందించాలే తప్ప బెట్టింగుల జోళికి వెళ్లకూడదు

జిల్లాలో క్రికెట్ బెట్టింగు నిర్వాహకులు, పందెంరాయుళ్లపై ప్రత్యేక నిఘా వేయాలి

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి

మరూరు పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు లక్షా 116 రూపాయలు విరాళం..!
మరూరు పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు లక్షా 116 రూపాయలు విరాళం..! రాప్తాడు మండలం మరూరు గ్రామంలో కొత్తగా వెలిసిన పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట కోసం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు లక్షా 116 రూపాయలు విరాళం అందజేశారు. వైసిపి రాప్తాడు మండల sc cell అధ్యక్షుడు నారాయణస్వామి తదితరులు ఎమ్మెల్యేను కలిశారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము.ఈనెల 19న ఉదయం 6 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
కుచువారి పల్లి గ్రామ వేణుగోపాల్ నాయుడు గారి కుటుంబీకులను పరామర్శించిన.. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు..
శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం కూచువారి పల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వేణుగోపాల్ నాయుడు గారి తల్లి రామలక్ష్మమ్మ గారు ఇటీవల అకాల మరణం చెందారు. దీంతో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు గారు* ఈ రోజు కుచువారి పల్లి గ్రామానికి వచ్చి వేణుగోపాల్ నాయుడు గారి కుటుంబీకులను పరామర్శించారు. అలాగే గ్రామంలోని ప్రస్తుత పరిస్థితి పై *ఎమ్మెస్ రాజు* గ్రామస్తులతో ఆరా తీశారు. వివిధ గ్రామాలకు చెందిన యువకులు ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామాంజనేయులు, జంగంపల్లి సర్పంచ్ కుల్లాయప్ప, శివకుమార్ నాయుడు, కోడుమూర్తి తిరుపతి నాయుడు తోపాటు పలు గ్రామాలకు చెందిన నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యల్లనూరు కన్వీనర్ బొడ్లో రామాంజినేయులు, వేణుగోపాల్ నాయుడు,యూనిట్ ఇంచార్జ్ పవన్,జంగంపల్లి సర్పంచ్ కుళ్లాయప్ప నాయుడు,జిల్లా అధికార ప్రతినిధి డేగల క్రిష్ణమూర్తి, యూనిట్ ఇంచార్జ్ శివకుమార్ నాయుడు,వాసాపురం హరి నాథ్, వాసాపురం పాపారాయుడు, తిరుపతి నాయుడు, రమేష్,గొడ్డుమరి శివ,ఓబులాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయుడు, తుంపేర ఎంపీటీసీ బయపరెడ్డి, నడింపల్లి భాస్కర్, బోడపాటి ఆదినరసింహులు, రాఘవ నాయుడు, రాగే పరుశురాముడు,తెలుగు జిల్లా అధికార ప్రతినిధి బింగి విజయ్, మాజీ ఎంపీటీసీ వేణు, బాలనాగి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రెడ్డిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం
బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి సచివాలయం ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రెడ్డిపల్లి సచివాలయ పరిధిలో ప్రజలకు జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు DBT ద్వారా11,78,19128 రూపాయలు మరియు non DBT ద్వారా3,80,18233 రూపాయలు మొత్తం DBT&NonDBT ద్వారా15,58,37 361 రెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నీలం భాస్కర్, ఆలూరు రమణారెడ్డి, జెసిఎస్ మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి,Eord దామోదరమ్మ, సచివాలయ కన్వీనర్లు రామచంద్రారెడ్డి, అహోబిలేసు, లీలావతి దసరా బుల్లోడు, జయరాం రెడ్డి, సెక్రటరీ సృజన, సచివాలయ అధికారులు వాలంటీర్లు నాయకులు గృహసారదులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ ఆత్మీయ సమన్వయ సమావేశం..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని A R ఫంక్షన్ హాల్ నందు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారి, ముంటిమడుగు కేశవరెడ్డి గారు మరియు శింగనమల నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మురళి కృష్ణ గారి* ఆధ్వర్యంలో *తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ* ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించి ఉమ్మడి భవిష్యత్తు కార్యాచరణ మరియు పలు అంశాలపై చర్చించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో *sc సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు ,జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి , తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధులు పర్వాతనేని శ్రీధర్ బాబు, డేగల కృష్ణమూర్తి, మాజీజడ్పీటీసీ విశాలాక్షి, జిల్లా సీనియర్ నాయకులు వెంకట నరసనాయుడు, ఆవుల కిష్టయ్య, వెంకటేశ్వరా నాయుడు, మండల కన్వీనర్ అశోక్ కుమార్, లక్ష్మి నారాయణ, కేశన్న*, శింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
కరుణించు..వరుణదేవా.. వర్షం కోసం హోమం పూజలు చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు..
కరుణించు..వరుణదేవా.. వర్షం కోసం హోమం పూజలు చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, నియోజకవర్గ ప్రజలు సస్యశ్యామలంగా ఉండడానికి వరుణయాగం నిర్వహించామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. శింగనమల మండల కేంద్రంలోని ఆత్మారామ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వరుణయాగాన్ని ప్రారంభించారు. పంచగవ్య సిద్ధి, పుణ్యాహ వచనం, పర్జన్య జపం, కంకణ బంధనం, గుణయాగం, నవగ్రహ హోమం, నవగ్రహ జపం, రిత్విక్ యాగం చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..2019లో వర్షాలు లేక కరువుతో ఇబ్బంది పడుతున్న సమయంలో వరుణయాగం చేశామన్నారు. దేవుడి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా పడటంతో ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా పడి శింగనమల నియోజకవర్గం ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని వరుణయాగం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం జడ్పీ హైస్కూల్ విద్యార్థి దుర్మరణం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థి చరణ్ 15 సం. స్కూల్ కు వెళుతున్న మార్గంలో

పోతుల స్వామి గుడి సమీపం నందు అటువైపు స్పీడ్ గా వస్తున్న ట్రాక్టర్ విద్యార్థి పైనుంచి వెళ్లడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది