వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా..

వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా 

అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్లైన్ యాప్ లు గుర్తింపు

ఈ యాప్ లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ గారు సిఫారసు లేఖ

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించం

క్రికెట్ బెట్టింగు నిర్వాహకులు, పందేలు కాచే వారెరవర్నీ వదలకండి...క్రికెట్ బెట్టింగ్ జోలికెళితే కఠిన చర్యలు తప్పవు

జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగులతో సంబంధాలు ఉన్న పాత నేరస్తులు 50 మందిపై బౌండోవర్ కేసులు

-- జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారు

 2023 వర్ల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతున్న విషయం తెలిసిందే

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా దిగ్గజ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ జరుగుతుండటంతో అందరి దృష్టి అటువైపే ఉంటుంది. 

క్రికెట్ ఆటను వీక్షిస్తూ ఆనందించాలే తప్ప బెట్టింగుల జోళికి వెళ్లకూడదు

జిల్లాలో క్రికెట్ బెట్టింగు నిర్వాహకులు, పందెంరాయుళ్లపై ప్రత్యేక నిఘా వేయాలి

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి

మరూరు పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు లక్షా 116 రూపాయలు విరాళం..!
మరూరు పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు లక్షా 116 రూపాయలు విరాళం..! రాప్తాడు మండలం మరూరు గ్రామంలో కొత్తగా వెలిసిన పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట కోసం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు లక్షా 116 రూపాయలు విరాళం అందజేశారు. వైసిపి రాప్తాడు మండల sc cell అధ్యక్షుడు నారాయణస్వామి తదితరులు ఎమ్మెల్యేను కలిశారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము.ఈనెల 19న ఉదయం 6 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
కుచువారి పల్లి గ్రామ వేణుగోపాల్ నాయుడు గారి కుటుంబీకులను పరామర్శించిన.. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు..
శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం కూచువారి పల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వేణుగోపాల్ నాయుడు గారి తల్లి రామలక్ష్మమ్మ గారు ఇటీవల అకాల మరణం చెందారు. దీంతో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు గారు* ఈ రోజు కుచువారి పల్లి గ్రామానికి వచ్చి వేణుగోపాల్ నాయుడు గారి కుటుంబీకులను పరామర్శించారు. అలాగే గ్రామంలోని ప్రస్తుత పరిస్థితి పై *ఎమ్మెస్ రాజు* గ్రామస్తులతో ఆరా తీశారు. వివిధ గ్రామాలకు చెందిన యువకులు ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామాంజనేయులు, జంగంపల్లి సర్పంచ్ కుల్లాయప్ప, శివకుమార్ నాయుడు, కోడుమూర్తి తిరుపతి నాయుడు తోపాటు పలు గ్రామాలకు చెందిన నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యల్లనూరు కన్వీనర్ బొడ్లో రామాంజినేయులు, వేణుగోపాల్ నాయుడు,యూనిట్ ఇంచార్జ్ పవన్,జంగంపల్లి సర్పంచ్ కుళ్లాయప్ప నాయుడు,జిల్లా అధికార ప్రతినిధి డేగల క్రిష్ణమూర్తి, యూనిట్ ఇంచార్జ్ శివకుమార్ నాయుడు,వాసాపురం హరి నాథ్, వాసాపురం పాపారాయుడు, తిరుపతి నాయుడు, రమేష్,గొడ్డుమరి శివ,ఓబులాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయుడు, తుంపేర ఎంపీటీసీ బయపరెడ్డి, నడింపల్లి భాస్కర్, బోడపాటి ఆదినరసింహులు, రాఘవ నాయుడు, రాగే పరుశురాముడు,తెలుగు జిల్లా అధికార ప్రతినిధి బింగి విజయ్, మాజీ ఎంపీటీసీ వేణు, బాలనాగి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రెడ్డిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం
బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి సచివాలయం ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రెడ్డిపల్లి సచివాలయ పరిధిలో ప్రజలకు జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు DBT ద్వారా11,78,19128 రూపాయలు మరియు non DBT ద్వారా3,80,18233 రూపాయలు మొత్తం DBT&NonDBT ద్వారా15,58,37 361 రెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నీలం భాస్కర్, ఆలూరు రమణారెడ్డి, జెసిఎస్ మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి,Eord దామోదరమ్మ, సచివాలయ కన్వీనర్లు రామచంద్రారెడ్డి, అహోబిలేసు, లీలావతి దసరా బుల్లోడు, జయరాం రెడ్డి, సెక్రటరీ సృజన, సచివాలయ అధికారులు వాలంటీర్లు నాయకులు గృహసారదులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ ఆత్మీయ సమన్వయ సమావేశం..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని A R ఫంక్షన్ హాల్ నందు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారి, ముంటిమడుగు కేశవరెడ్డి గారు మరియు శింగనమల నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మురళి కృష్ణ గారి* ఆధ్వర్యంలో *తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ* ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించి ఉమ్మడి భవిష్యత్తు కార్యాచరణ మరియు పలు అంశాలపై చర్చించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో *sc సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు ,జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి , తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధులు పర్వాతనేని శ్రీధర్ బాబు, డేగల కృష్ణమూర్తి, మాజీజడ్పీటీసీ విశాలాక్షి, జిల్లా సీనియర్ నాయకులు వెంకట నరసనాయుడు, ఆవుల కిష్టయ్య, వెంకటేశ్వరా నాయుడు, మండల కన్వీనర్ అశోక్ కుమార్, లక్ష్మి నారాయణ, కేశన్న*, శింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
కరుణించు..వరుణదేవా.. వర్షం కోసం హోమం పూజలు చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు..
కరుణించు..వరుణదేవా.. వర్షం కోసం హోమం పూజలు చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, నియోజకవర్గ ప్రజలు సస్యశ్యామలంగా ఉండడానికి వరుణయాగం నిర్వహించామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. శింగనమల మండల కేంద్రంలోని ఆత్మారామ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వరుణయాగాన్ని ప్రారంభించారు. పంచగవ్య సిద్ధి, పుణ్యాహ వచనం, పర్జన్య జపం, కంకణ బంధనం, గుణయాగం, నవగ్రహ హోమం, నవగ్రహ జపం, రిత్విక్ యాగం చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..2019లో వర్షాలు లేక కరువుతో ఇబ్బంది పడుతున్న సమయంలో వరుణయాగం చేశామన్నారు. దేవుడి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా పడటంతో ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా పడి శింగనమల నియోజకవర్గం ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని వరుణయాగం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం జడ్పీ హైస్కూల్ విద్యార్థి దుర్మరణం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థి చరణ్ 15 సం. స్కూల్ కు వెళుతున్న మార్గంలో

పోతుల స్వామి గుడి సమీపం నందు అటువైపు స్పీడ్ గా వస్తున్న ట్రాక్టర్ విద్యార్థి పైనుంచి వెళ్లడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగనన్నదే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగనన్నదే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే పద్మావతి కొనియాడారు. శింగనమల మండలం పెరవలి గ్రామ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన "ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే " కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎమ్మెల్యే, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాలుగున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో పేదలకు అందించిన లబ్ది బోర్డును ఆవిష్కరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చాయన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. సచివాలయ పరిధిలో ఈ నాలుగున్నరేళ్లలో నేరుగా పేద ప్రజలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.11.51 కోట్లు అందాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల నాయకులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మనసారా ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే పద్మావతి..

మంచి పాలన..మనసారా ఆశీర్వదించండి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మనసారా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం, దయ్యాలకుంటపల్లి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిని క్షుణ్ణంగా ఆయా కుటుంబాలకు వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తోందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎలాంటి సిఫారసు లేకుండా పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పేదల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగనన్నదే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి* ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే పద్మావతి కొనియాడారు. శింగనమల మండలం పెరవలి గ్రామ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన "ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే " కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎమ్మెల్యే, పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం నాలుగున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో పేదలకు అందించిన లబ్ది బోర్డును ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చాయన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. సచివాలయ పరిధిలో ఈ నాలుగున్నరేళ్లలో నేరుగా పేద ప్రజలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.11.51 కోట్లు అందాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల నాయకులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

జగనన్నతోనే ప్రజల అభ్యున్నతి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్.

జగనన్నతోనే ప్రజల అభ్యున్నతి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రజల అభ్యున్నతి సాధ్యమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం పాపినేపాల్యం, తిమ్మంపేట, కనంపల్లి గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం నుంచి అందిన లబ్దిని బుక్ లెట్ ద్వారా ఆయా కుటుంబాలకు వివరించారు. అర్హులందరికీ పథకాలు అందించిన ఘనత సీఎం జగనన్నదే అన్నారు. చంద్రబాబు హయాంలో నాయకులు ఎంపిక చేసిన వారికి మాత్రమే పథకాలు అందయన్నారు.

ఇప్పుడు నేరుగా నిధులు, లబ్ధిదారుల ఖాతాలకే చేరుతున్నాయన్నారు. *రూ.2 కోట్లుతో నిర్మించిన కనంపల్లి నుంచి ఏకులనాగేపల్లి రోడ్డు ప్రారంభం* గార్లదిన్నె మండలం కనంపల్లి నుంచి ఏకులనాగేపల్లి వరకు రూ.2కోట్లతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ,ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ప్రారంభించారు. కనంపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థము ఏడీసీసీ బ్యాంకు, నాబార్డ్ సహకారంతో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదామును ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి,

ఏడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ యం.లిఖిత ప్రారంభించారు. అనంతరం జగనన్న ఇళ్లు పథకంలో భాగంగా యన్. జయలక్ష్మి లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఏడిసీసీ బ్యాంకు సిబ్బంది,సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.