ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగనన్నదే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగనన్నదే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే పద్మావతి కొనియాడారు. శింగనమల మండలం పెరవలి గ్రామ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన "ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే " కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎమ్మెల్యే, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాలుగున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో పేదలకు అందించిన లబ్ది బోర్డును ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చాయన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. సచివాలయ పరిధిలో ఈ నాలుగున్నరేళ్లలో నేరుగా పేద ప్రజలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.11.51 కోట్లు అందాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల నాయకులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Nov 16 2023, 10:13