జగనన్నతోనే ప్రజల అభ్యున్నతి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్.
జగనన్నతోనే ప్రజల అభ్యున్నతి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ
. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రజల అభ్యున్నతి సాధ్యమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం పాపినేపాల్యం, తిమ్మంపేట, కనంపల్లి గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం నుంచి అందిన లబ్దిని బుక్ లెట్ ద్వారా ఆయా కుటుంబాలకు వివరించారు. అర్హులందరికీ పథకాలు అందించిన ఘనత సీఎం జగనన్నదే అన్నారు. చంద్రబాబు హయాంలో నాయకులు ఎంపిక చేసిన వారికి మాత్రమే పథకాలు అందయన్నారు.
ఇప్పుడు నేరుగా నిధులు, లబ్ధిదారుల ఖాతాలకే చేరుతున్నాయన్నారు. *రూ.2 కోట్లుతో నిర్మించిన కనంపల్లి నుంచి ఏకులనాగేపల్లి రోడ్డు ప్రారంభం* గార్లదిన్నె మండలం కనంపల్లి నుంచి ఏకులనాగేపల్లి వరకు రూ.2కోట్లతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ,ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ప్రారంభించారు. కనంపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థము ఏడీసీసీ బ్యాంకు, నాబార్డ్ సహకారంతో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదామును ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి,
ఏడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ యం.లిఖిత ప్రారంభించారు. అనంతరం జగనన్న ఇళ్లు పథకంలో భాగంగా యన్. జయలక్ష్మి లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఏడిసీసీ బ్యాంకు సిబ్బంది,సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
Nov 16 2023, 10:11