సంక్షేమ పాలనకు..జగనన్న కావాల్సిందే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి...
సంక్షేమ పాలనకు..జగనన్న కావాల్సిందే: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
సంక్షేమ పాలన కొనసాగాలంటే రాష్ట్రానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం గ్రామ సచివాలయ-1 నందు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో " ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే " కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరణ కార్యక్రమం
చేపట్టి పార్టీ జెండా ఎగురవేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పాలనతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారన్నారు. గ్రామ సచివాలయ-1 పరిధిలో నాలుగున్నరేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ క్రింద దాదాపు రూ.40.07 కోట్లను పేదలకు అందించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమం సాగాలని.. రాష్ట్రానికి మళ్లీ జగనే కావాలని ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. ఇంటింటికీ ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు." వై ఏపీ నీడ్స్ జగన్" బుక్ లెట్ లను పంపిణీ చేశారు. *పల్లెలకు వెలుగులు..గ్రామ సచివాలయాలు: ఆలూరు సాంబ శివారెడ్డి*
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సచివాలయాల వ్యవస్థ ద్వారా పల్లెలకు వెలుగులు నింపారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మునుపెన్నడు లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ఇంటి ముంగిటికే సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా మన్నలను పొందారన్నారు. *ప్రతి కుటుంబానికి జగనన్న అండ* నాలుగున్నరేళ్ల సూపరిపాలనలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో "ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే"కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా మహిళలకే పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డకే దక్కుతుందన్నారు.
ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపు రూ.26.25 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. పారదర్శక పాలన అందిస్తున్న సీఎం జగనన్న మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, మండల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Nov 15 2023, 07:28