కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..
Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..
Neredumet:ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది.. కానీ ఆ తరువాత కుటుంబంలో ఆర్థిక సమస్యలతో గొడవలు మొదలయ్యాయి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన స్రవంతి చాలా రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం ఆమె అద్దె ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు భర్త మహేందర్.. ఈ క్రమంలోనే..
హైదరాబాద్, నవంబర్14; దీపావళి పండుగ రోజే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ను హత్య చేసాడు కట్టుకున్న భర్త…కులాలు వేరే అయిన కలిసి జీవించాలి అనుకున్నారు.. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు.. సుఖ సంతోషాలతో కలిసి జీవించాలి అనుకున్న ఆ ఇద్దరి మధ్య అనంతర కాలంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో భర్త ప్రవర్తనలో మార్పులు రావడం తో ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసాయి.. క్రమ క్రమంగా ఈ సమస్యలు మరింత ఎక్కువ అవ్వడంతో పుట్టింటికి వెళ్ళింది భార్య. అయినప్పటికీ అతనిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత బలపడ్డాయి… పలుమార్లు కుటుంబ సభ్యులు హెచ్చరించిన మార్పు మాత్రం రాలేదు. చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని హత్య చేశాడు ఓ భర్త. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకుంది.
నేరేడుమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి రోజున ఇంటి ఇల్లాలిని హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన స్రవంతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీగిరి పల్లి కి చెందిన మహేందర్ తో వివాహం జరిగింది. మహేందర్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. వీరు ఏడాది క్రితం ఉప్పల్ పరిధిలోని జవహర్ నగర్ లోని కందిగూడా లో నివసిస్తున్నారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు గొడవలు చోటు చేసుకోవడంతో స్రవంతి చాలా రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం సమతా నగర్లో అద్దె ఇంటికి వెళ్లి చూడగా భర్త తన వస్తువులు తీసుకెళ్లి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో భర్త పై ఆగ్రహం వ్యక్తం చేసింది స్రవంతి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహేందర్ కోపంతో భార్య స్రవంతి ముఖంపై, తలపై బలంగా కొట్టాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అనంతరం ఆమె మెడకు చున్ని చుట్టి తీసుకెళ్లి మంచం కింద దాచాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
వస్తువుల్ని తీసుకోవడానికి వెళ్ళినటువంటి చెల్లి తిరిగి రాకపోవడంతో స్రవంతి అన్న ప్రశాంత్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చి డోర్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా పడివుంది. దీంతో పోలీసులు మహేందర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఈ విధంగా హత మార్చడంతో స్రవంతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..
Telangana Election: స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ చూసి ఎన్నికల అధికారుల షాక్.. ఎందుకో తెలుసా..?
సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేని శూన్యతను కలిగించిందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘ప్రముఖ తెలుగు నటుడు శ్రీ చంద్ర మోహన్ గారు మృతి చెందడం అత్యంత బాధాకరం. సినీ ప్రపంచంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. వారి ఉత్తమమైన నటన మరియు ప్రత్యేకమైన తేజస్సు తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వారి నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేన ఒక శూన్యతను కలిగించింది. నా ఆలోచనలు వారి కుటుంబం మరియు అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి’’ అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని ఇంగ్లిష్‌లోనూ ట్వీట్ చేశారు.
Telangana Election: సీఎం కుర్చీపై సీనియర్ నేతల ఆశలు.. అన్ని పార్టీల్లోనూ అదే తంతూ.. తేడా కొడితే..?
BREAKING
కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి ఖాయం
ఎన్నికల్లో వృద్ధులకు దివ్యాంగులకు లైన్‌లో ఉండి ఓటు నమోదు చేసుకోవాలంటే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద నుంచే ఓటు నమోదు చేసుకునే విధంగా సువర్ణ అవకాశాన్ని కల్పించింది. మంచాన పడ్డ వారు, కదులలేని, బయటకు రాలేని పరిస్ధితులున్నా...
అలాంటి వారితోనూ ఓటు వేయించడం ద్వారా ఓటింగ్ శాతం పెంచే సరికొత్త ఆధికారులు ఈసారి రూపొందించారు. సంబంధిత వ్యక్తుల నుంచి అంతగా స్పందన లేకపోవడం గమనార్హం. అధిక శాతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి ఇష్టపడుతుండగా, సుముఖంగా ఉన్న కొద్దిమంది నుంచి అవసరమైన ధృవీకరణ పత్రాలు వస్తున్నాయి. చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు సైతం పోలింగ్ కేంద్రాల వద్దకే వచ్చేందుకు ఇష్టపడుతున్నట్లు తెలస్తుంది.

Nov 14 2023, 18:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.5k