గుడిలో విగ్రహం కోసం సర్పంచ్ పదవికి వేలం... మేటర్ సీరియస్!

గుడిలో విగ్రహం కోసం సర్పంచ్ పదవికి వేలం... మేటర్ సీరియస్!

ఈ సమయంలో గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయా కుల సంఘాల పెద్దలు నవంబర్ 22ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా ఒకపక్క తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. అధికార విపక్షాలు ఎవరికి వారు పోటాపొటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పదవులు పొందాలని అభ్యర్థులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు.. ఓటర్ల మెప్పుకోసం తలకిందులుగా తపస్సులు చేస్తున్నారు! ఈ సమయంలో గుడిలో విగ్రహం కోసం ఉన్న పదవిని వేళానికి పెట్టాడు ఒక సర్పంచ్.. ఆ వెలంలో వచ్చిన సొమ్ముతో ఆ గ్రామంలోని గుడిలో విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాడు.

అవును... గ్రామంలో కొత్తగా కట్టిన పోచమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏకంగా తన పదవిని వేలానికి పెట్టారు ఒక సర్పంచ్. విగ్రహ ప్రతిష్ఠకు సుమారు రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని లెక్క కట్టి మరీ వేలం పాట నిర్వహించడం మరొకెత్తు. దీంతో ఈ విషయం చర్చనీయాశం అయ్యింది. ఎన్నికల సీజన్, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అధికారులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది!


వివరాళ్లోకి వెళ్తే... ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా త్వరలో ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం అంకుషాపురంగ్రామంలో కొత్తగా పోచమ్మ గుడి కట్టారు. అయితే ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. చందాలు వేసుకొని పోచమ్మ గుడి అయితే నిర్మించుకున్నాం కానీ.. మళ్లీ అంతపెద్దమొత్తంలో విగ్రహానికంటే కష్టం అనే మాటలు వినిపించాయి!

ఈ సమయంలో గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయా కుల సంఘాల పెద్దలు నవంబర్ 22ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకూ సేకరించిన చందాల ద్వారా వచ్చిన మొత్తం గుడి నిర్మాణానికే సరిపోవడంతో విగ్రహ ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ సమయంలో సర్పంచ్ పదవిని వేలం వేయాలని నిర్ణయించారు.

దీంతో... గ్రామంలోని పెద్దలంతా స్థానిక హనుమాన్ టెంపుల్ సమీపంలో కూర్చుని వేలం పాట మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. రూ.3 లక్షలతో మొదలైన వేలంపాట రూ.9 లక్షల 35 వేల దగ్గర ముగిసింది. పాటలో ఆరుగురు పాల్గొనగా.. ఓ కుల సంఘం పెద్ద ఈ పదవి దక్కించుకున్నాడని అంటున్నారు! దీంతో విషయం అధికారులకు చేరింది.. మేటర్ సీరియస్ అయ్యిందని సమాచారం.

ముందుగా ఈ వేలంపాట విషయాలు పంచాయతీ సెక్రటరీకి తెలిసాయని, న్నికల కోడ్ అమల్లో ఉన్నందున విషయాన్ని మండల నోడల్ ఆఫీసర్ (ఎంపీడీవో)కి సమాచారం అందించారని సమాచారం. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఎస్ఐ సిబ్బందిని పంపించగా.. అప్పటికే అందరూ ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారని అంటున్నారు. దీంతో... ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో చెబుతున్నారు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి..

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి

  AITUC ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించిన నాయకులు

   సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 2021 ఏప్రిల్ నుంచి చెల్లించాల్సిన పెండింగ్ ఏరియర్స్ ను తక్షణమే చెల్లించాలని అందుకు సింగరేణి సివిల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్-AITUC ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేట్ సివిల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మంగళవారం నాడు కార్పొరేట్ సివిల్ డివైజియం శ్రీ పి రాజశేఖర్ గారికి ఏఐటీయుసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య లు కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం పెరిగిన డిఏ బాపతు ఏరియర్స్ డబ్బులను కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్ల ద్వారా మరియు సింగరేణి కంపెనీ డైరెక్టుగా చెల్లించాల్సి ఉన్నది.వాటిని కొందరికి చెల్లించి ఇంకా అనేక మందికి చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర అసహనంతో ఉన్నారని, ఆందోళన చెందుతున్నారని తక్షణమే పెండింగ్ ఏరియర్స్ చెల్లింపుకు సింగరేణి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి శ్రీను,కిరణ్, అజయ్,పెద్దబాబు,సూర్య, బి,సైదుబాబు,నీలకంఠం,శంకర్,సవీన్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి..

కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి

ఉమ్మడి జిల్లాలో రెడ్ల కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ

బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే రెబల్ గానైన పోటీ చేస్తా

మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంగ్రెస్స్ ఓబీసీ సెల్ అధ్వర్యంలో రోగులకు,పండ్లు బ్రేడ్లు పంపిణీ

కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించడంలేదని ఆ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర సీనియర్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 శాతానికి పైగా ఉన్న బీసీలను కాదని, జనాభాలో తక్కువ శాతం ఉన్న అగ్రకులాల వారికే పార్టీ స్థానం కల్పిస్తుందని, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారికి ఆ స్థాయిలో అవకాశాలు కల్పించడంలేదని అన్నారు. ఇతర పార్టీలు బీసీలను గుర్తించి ఎమ్మెల్యే , ఎంపిల సీట్లను ఇస్తుంటే కాంగ్రెస్ లో కేవలం రెడ్డిలు రాజ్యమేలుతున్నారని, దీనిని గమనించి మూడవ విడత అభ్యర్థుల ఎంపికలో బీసీ సీనియర్ నాయకులకు టిక్కెట్ లను కేటాయించాలన్నారు.సుధీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకులకు గుర్తింపు లేదని అన్నారు .బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే కాంగ్రెస్స్ పార్టీ రెబల్ గా అభ్యర్థి గా హుజుర్ నగర్ లేదా కోదాడ నుండి పోటీ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు.ఉక్కు మనిషి ఇందిరమ్మ ఆశయ సాధనలో,తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పని చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యన్ని స్థాపించుటకు ప్రతి కార్య కర్త సైనికులు గా పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్, ఓబిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటి సైదులు, నాయకులు పేర్ల గిరి యాదవ్, సిద్ధి పరుశురాములు, రమేష్ యాదవ్, గుద్దేటి శ్యామ్, మాల బంటి, మట్టపల్లి శంభయ్య, తదితరులు పాల్గొన్నారు.

గత గ్రామపంచాయతీ ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తగుళ్ల శ్రీను 200 కుటుంబాలతో కలిసి మూకుమ్మడిగా బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక

బ్రేకింగ్ న్యూస్...

తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు... గత గ్రామపంచాయతీ ఎన్నికల లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన తగుళ్ల శ్రీను.... 200 కుటుంబాలతో కలిసి నేడు మూకుమ్మడిగా... ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు గారు, నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు... ఈ సందర్భంగా కంచర్ల,వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధర పూర్వకంగా ఆహ్వానించారు.... ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు గారు మాట్లాడుతూ... కన్న తల్లి లాంటి పార్టీని.. ఎన్నికలు  మరోనెల రోజులు ఉందనగా... పార్టీ నుంచి వెళ్లిపోవటం అంటే... అది ఏ రకమైన నీతో అర్థం చేసుకోవాలని కేవలం డబ్బులు ఆశించి... ప్రజల కొరకు పనిచేస్తున్న నాయకుడిని పార్టీని వదలటం న్యాయం కాదని... అలాంటివారికి పదిలే సరైన బుద్ధి చెప్తారని అన్నారు. కంచర్ల మాట్లాడుతూ... సర్వారం గ్రామాన్ని తాను ఎప్పుడు ప్రత్యేకంగా చూశానని... సర్వారం సర్పంచ్ ఏ పని అడిగిన వెంటనే అమలు చేశామని కోటి 25 లక్షల రూపాయలతో గ్రామం ల్లో సిసి రోడ్లు ఏర్పాటు చేశామని, ఇంటింటికి మంచినీరు ఇచ్చామని... విద్యుత్ లైన్ లు ఏర్పాటు చేశామని 63 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించామని అన్నారు.. ఇలా గ్రామానికి అన్ని విధాలుగా సహాయం చేస్తుంటే... నమ్మించి గొంతు కోశాడని... అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా... ఇంతమంది పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరమైన విషయం అని... సర్వారం ప్రజలు అలాంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్తారని.. నేను నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ప్రజలను నమ్ముకున్నాను కానీ కోమటిరెడ్డి నోట్ల కట్టలతో ... నాయకులను కొని వారి నమ్ముకున్నారని... ప్రజలుఈ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని తెలియజేశారు...

ఈ కార్యక్రమంలో... ఇంకా.. మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి.. లొడంగి గోవర్ధన్ వనపర్తి నాగేశ్వరరావు.. జీడిపల్లి వెంకటరెడ్డి , ఎంపీటీసీ సందీప్ రెడ్డి,కందుల లక్ష్మయ్య... తదితరులు పాల్గొన్నారు పార్టీలో చేరిన వారిలో... తగుల శీను తో పాటు.. గంట వెంకన్న, (పెద్ద గొల్ల ) గంట పద్మ వార్డ్ మెంబర్, రాస మల్ల నాగయ్య గంట సైదులు మరి శేఖర్ చిరుబోయిన కోటయ్య దారమళ్ళ మస్తాన్, బొల్లం వెంకన్న... లతోపాటు 200 కుటుంబాలకు చెందిన వారు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

యాదాద్రి భువనగిరి బి ర్ స్ పార్టీ కార్యలయం మరియు ఆలేరు లోపత్రిక సమావేశం బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్

యాదాద్రి భువనగిరి బి ర్ స్ పార్టీ కార్యలయం మరియు ఆలేరు లోపత్రిక సమావేశం బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ 

దుబ్బాక సంఘటన ను ఖండించిన మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ చేసారో చెప్పాలి..

రాజకీయ వ్యభిచారం కోమటిరెడ్డి బ్రదర్స్..

ప్రజలు ఆలోచించాలి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వస్తున్నాయి..

ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

భువనగిరి పార్లమెంట్ స్థాయి లో అన్ని బారి మెజార్టీ తో గెలుస్తారు

బీఎస్పీ పార్టీ నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జిగా లోకనబోయిన రమణ ముదిరాజ్

బీఎస్పీ పార్టీ నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జిగా లోకనబోయిన రమణ ముదిరాజ్

బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ముదిరాజు మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యువనేత బీసీ బిడ్డ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన లోకనబోయిన రమణ ముదిరాజ్ గారిని* నియమించడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎంపికయిన బిఎస్పీ పార్టీ నల్లగొండ అసెంబ్లీ నియోకవర్గ ఇంచార్జ్ లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ తనను ఎంపిక చేసిన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మరియూ సహకరించినటువంటి జిల్లా కమిటీ సభ్యులు అసెంబ్లీ కమిటీ సభ్యులు వివిధ మండలాల అధ్యక్షులకు మరియు బీసీ ముదిరాజ్ సంఘం నుండి వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా ఉద్యమాభి వందనాలు తెలియచేస్తూ నల్లగొండ నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ మన్యవార్ కాన్సిరాం గారి సిద్ధాంతాలను పునికి పుచ్చుకున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ తరపున సబ్బండ వర్గాలను అందరినీ కలుపుకొని నల్లగొండ నియోజకవర్గంలో బిఎస్పి నీలి జెండాను ఎగరవేసి అసెంబ్లీకి వెళ్ళటానికి బీసీ నాయకునిగా పోరాడతానని తెలియజేస్తున్నానన్నారు, నల్లగొండలో నియోజకవర్గ ప్రజలకు బీసీ బిడ్డలుగా మేము బహుజన్ సమాజ్ పార్టీలోకి వస్తున్నాము అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు వివిధ పార్టీలో ఉండి అగ్ర కులస్థుల పార్టీల జెండాలు మోస్తున్న బడుగు బలహీవర్గాలు బహుజనులు అందరు కూడా బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ లోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు, బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని బీసీ లకు 60 ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి ప్రొత్స హిస్తుంది రేపు జరగబోయే ఎలక్షన్లో నీలి జెండా ఏనుగు గుర్తుకు బిఎస్పీ కి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటరు దేవుళ్ళకు విజ్ఞప్తి చేసారు

ఇట్టి కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఇన్చార్జీలు పంబాల అనిల్ కుమార్, ఆదిమల్ల గోవర్ధన్ జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్ ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్సిరాం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒంటెపాక యాదగిరి మైనార్టీ నాయకులు షేక్ చాంద్ పాష గారు జిల్లా ఈసీ మెంబర్ గార మారయ్య నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చింత శివరామకృష్ణ అంకేపాక శ్రీనివాస్ మరియు నూతనంగా అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పెరిక అభిలాష్ ప్రధాన కార్యదర్శి సూరారం రాంప్రసాద్ గారు మండల అధ్యక్షులు బొజ్జ నరసింహ కొండా నరేందర్ లింగస్వామి భాను ప్రసాద్ అభినవ్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులో నగదు తరలింపు..

ఆర్టీసీ బస్సులో నగదు తరలింపు

ఎన్నికల నియమావళి లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆదివారం ఓ వ్యక్తి వద్ద భారీగా నగదు లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.

 ఎన్నికల నియమావళి లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆదివారం ఓ వ్యక్తి వద్ద భారీగా నగదు లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బాసర మండల కేంద్రంలోని గోదావరి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సును తనిఖీ చేస్తున్న పోలీసులకు బస్సులో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నాయకం గ్రామానికి చెందిన బాలాజీ మేడేవర్ వద్ద 13 లక్షల రూపాయలు నగదు లభ్యమైంది. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల నియమావళి ప్రకారం నగదును సీజ్ చేసి పంచనామ జరిపారు. బాసర పోలీసులు వాహనాల తనిఖీలలో సీఐ వినోద్ రెడ్డి, బాసర ఎస్సై గణేష్ తో పాటు బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ వివరాలు...

ముగిసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ

చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలు. 15 సెంటిమిటర్లపై కడుపును కట్ 10 సెంటిమిటర్లు చిన్న ప్రేగును తొలగించిన యశోద వైద్యులు. 

గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేది.

రక్తం అంత కూడా కడుపులో పేరుకుపోయింది. అందుకే 15 సెంటిమిటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం అంత క్లీన్ చేశాము. లోపల రక్తం పెరుకుపోవడం, ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఇంత ఆలస్యం అయింది - యశోద ఆసుపత్రి వైద్యులు

కెసిఆర్ సినిమా కోసం మా అమ్మకు ఇష్టంగా కొనిచ్చిన ఇంటిని తాకట్టు పెట్టా..

 జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక షో లు చేస్తూ.. వెండితెరపై కూడా తన టాలెంట్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో రాకింగ్ రాకేష్ ఒకడు. చిన్న కంటెస్టెంట్‌గా జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టి.. తన టాలెంట్‌తో కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం బిగ్ స్క్రీన్‌పై తన అదష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ మేరకు ఓ సినిమాను రూపొందిస్తూ అందులో హీరోగా నటిస్తున్నాడు.

తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కేసీఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) సినిమాకు రాకేష్ హీరోగా నటించడంతో పాటు తానే నిర్మిస్తున్నాడు. మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా రీసెంట్‌గా ‘కేసీఆర్’ సినిమా లాంఛ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా గురించి రీసెంట్‌గా రాకేష్ మాట్లాడుతూ.. ‘హీరోలు, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్‌కి ఎందుకు ఉండకూడదు? నేను కేసీఆర్‌కి పెద్ద అభిమానిని. అందుకే ఆయన పేరుతో సినిమా తీస్తున్నా. నేను బినామీ డబ్బులతో ఈ సినిమా నిర్మిస్తున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ‘కేసీఆర్‌’ సినిమా కోసం మా అమ్మకు ఎంతో ఇష్టమైన నేను కట్టించిన ఇల్లును తాకట్టు పెట్టా. నా కారు కూడా అమ్మేశా. ఇంటికి సంబంధించిన ఇంటి పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. తాను ఎందుకు ఈ సినిమాకు నిర్మాతగా ఉండాల్సి వచ్చిందంటే ‘గతంలో ఈ సినిమాను తీసేందుకు కొందరు వ్యక్తులు మాటిచ్చి తర్వాత హ్యాండ్ ఇచ్చారు. ఈ కారణంగానే తాను నిర్మాతగా మారాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో మా అమ్మతో పాటు నా భార్య నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు అంటూ వాళ్ల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాకేష్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండియాతో ఫైనల్‌కు వచ్చే జట్టు అదే.. కానీ ...

ఇండియాతో ఫైనల్‌కు వచ్చే జట్టు అదే.. కానీ అక్కడ మాత్రం'

వన్డే ప్రపంచకప్‌-2023 రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నీలో అతిథ్య భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 6 విజయాలు సాధించిన టీమిండియా సెమీస్‌ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ పరిస్థితి మాత్రం మరీ ఘోరంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమిపాలైన ఇంగ్లండ్‌.. సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 

కాగా పాయింట్ల పట్టికలో టాప్‌-4లో వరుసగా భారత్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్‌ పోరుకు అర్హత సాధించే రెండు జట్లను ఆస్ట్రేలియా స్పిన్నర్‌ అస్టన్‌ అగర్‌ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అగర్‌ జోస్యం చెప్పాడు.

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ కచ్చితంగా భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అయితే టీమిండియా టైటిల్‌ ఫేవరేట్‌ అంతా భావిస్తున్నారు. కానీ స్వదేశంలో వరల్డ్‌కప్‌ జరుగుతుండడంతో భారత జట్టుపై కచ్చితంగా ఒత్తడి ఉంటుంది.

ఒత్తడి ఎంత పెద్ద జట్టు అయినా తప్పులు చేస్తుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ సాధిస్తే.. ప్రత్యర్ధిపై పై చేయి సాధించే ఛాన్స్‌ ఉందని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అగర్‌ పేర్కొన్నాడు. కాగా అగర్‌ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.