చనిపోయిన టిడిపి కార్యకర్తకు రెండు లక్షల బీమా.. వర్తింపజేసిన రాష్ట్ర టిడిపి అధిష్టానం.. హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
చనిపోయిన టిడిపి కార్యకర్తకు రెండు లక్షల బీమా.. వర్తింపజేసిన రాష్ట్ర టిడిపి అధిష్టానం.. హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వడియం పేట గ్రామం నందు జీవనం చేస్తున్న టిడిపి కార్యకర్త తలారి లక్ష్మీనారాయణ గత కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాస్తూ చనిపోవడం జరిగింది. జిల్లా టిడిపి సీనియర్ నాయకులు బుక్కరాయసముద్రం మండల మాజీ జడ్పిటిసి కె రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి భీమ చేయడం జరిగినది. అందులో భాగంగా వడియంపేట గ్రామం నందు తలారి లక్ష్మీనారాయణ కూడా బీమా చేయడంతో మరణాంతరం వడియం పేట సర్పంచ్ నాగార్జున తక్షణమే స్పందించి తమ నాయకుడు రామలింగారెడ్డి గారికి సమాచారం అందించి రెండుసార్లు విజయవాడ కెళ్ళి దగ్గరుండి తలారి లక్ష్మీనారాయణ గారి బీమా సమస్యను అధిష్టానంతో కలిసి ఆ కుటుంబానికి బీమా మొత్తం అందేలా చేశాడు ఇలా ముందస్తుగా టిడిపి అధిష్టానం మేరకు కే రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో బీమా చేయడం వల్ల ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సౌకర్యం దేశంలో ఏ పార్టీకి లేదంటూ తలారి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి జిల్లా సీనియర్ నాయకులు రామలింగారెడ్డి గారికి మరియు సర్పంచి నాగార్జున గారికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు
Oct 31 2023, 07:21