నార్పల మండల కేంద్రంలో మూడ్రోజుల కిందట జరిగిన హత్య కేసును ఛేదించిన నార్పల పోలీసులు
నార్పల మండల కేంద్రంలో మూడ్రోజుల కిందట జరిగిన హత్య కేసును ఛేదించిన నార్పల పోలీసులు
ఆరుగురు నిందితులు అరెస్టు... మద్యం తాగించి కడతేర్చినట్లు వెల్లడి
అరెస్టు నిందితుల వివరాలు :
1) పెరవలి కుళ్లాయప్ప నడిమిదొడ్డి కుళ్లాయప్ప, 25 సం., నార్పల మండల కేంద్రం
2) ఆకుల మణికంఠ, వయస్సు 31 సం., నార్పల మండల కేంద్రం
3) ఆసాది జయరాం, వయస్సు 32 సం., నార్పల మండల కేంద్రం
4) వరికూటి శివ, వయస్సు 26 సం., నార్పల మండల కేంద్రం
5) కడపల నాగన్న, వయస్సు 55 సం., నార్పల మండల కేంద్రం
6) ఎగువ కుళ్లాయస్వామి, వయస్సు 30 సం., నార్పల మండల కేంద్రం
ఈనెల 24 వ తేదీన సిద్ధవటం నారాయణస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే
అనంతపూర్ రురల్ డీస్పీ వెంకట శివారెడ్డి గారి ఆధ్వర్యంలో శింగనమల సి.ఐ అస్రార్ బాషా, నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు ఈ హత్య కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు
ఈ క్రమంలో పక్కా రాబడిన సమాచారంతో నార్పల గ్రామ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఈ ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు
* నేపథ్యం :
అరెస్టయిన నిందితుల్లో పెరవలి కుళ్ళాయప్ప ముఖ్యుడు. ఈచర్ వ్యాన్ డ్రైవరు గా పనిచేస్తున్నాడు. ఈతను సిద్దవటం నారాయణ స్వామి మంచి స్నేహితులు. ఇద్దరూ అప్పుడప్పుడు కొంతమంది స్నేహితులతో కలసి మద్యం సేవించే పార్టీలకు వెళ్ళుతుంటారు. పెరవళి కుళ్లాయప్పకు నార్పలకు చెందిన ఓ వివాహిత మహిళతో గత మూడు సంవత్సరాల నుండి సాన్నిహిత్యం వుంది. ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనే దాకా వెళ్లింది. ఈక్రమంలో సదరు వివాహిత పట్ల సిద్ధవటం నారాయణస్వామి అసభ్యంగా ప్రవర్తించాడని... ఈ విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుండీ సిద్ధవటం నారాయణస్వామిని ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్నాడు. 24.10.2023 న పథకం పన్ని మణికంఠ, జయరాం, నాగన్న, శివ, కుళ్లయిస్వామిలను కూడగట్టుకొని నారాయణస్వామిని మద్యం త్రాగుదామని కేశవరెడ్డి తోటకు పెరవలి కుళ్లాయప్ప తీసుకెళ్లాడు. మద్యం సేవించిన తర్వాత నారాయణస్వామికి మత్తు ఎక్కువ కావడం వలన అక్కడే పడిపోయాడు. . ఇదే అదునుగా భావించిన పెరవలి కుళ్లాయప్ప అకస్మాత్తుగా రాయితో సిద్ధవటం నారాయణస్వామిపై దాడి చేసి చంపినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ఈ విషయంలో మిగితా వారిని ఎవరికైనా చెబితే నేరం మీ మీదకు వస్తుందని బెదిరించాడు. అయినప్పటికీ పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారు.
Si Narpala ps
Oct 30 2023, 21:50