వడియం పేట్ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రం వైద్య సిబ్బంది తో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వడియం పేట సచివాలయం నందు జరిగినది. ఈ కార్యక్రమం ను గ్రామ సర్పంచ్ నాగార్జున గారు, మరియు ముఖ్య అతిథులుగా ఎంపీపీ సునీత గారు, వైస్ ఎంపీపీ రాంగోపాల్ గారు, పొడరాళ్ల గ్రామ సర్పంచ్ ఏర్రి స్వామి, ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఈ బి దేవి గారు, జిల్లా ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాం నోడల్అధికారిగా డాక్టర్ సుజాత గారు, జిల్లా మలేరియా అధికారి ఒబులు గారు, మండల ప్రత్యేక అధికారి B.N. శ్రీ దేవీ వారు,డా. స్వాతి లక్ష్మి, ,డా.M శ్రీ హర్ష, డా. తహీరున్నిసా ,డాక్టర్ జిలాన్ జనరల్ సర్జన్,డా. విష్ణువర్ధన్ పిడి యట్రీషన్ గారు మరియు అభివృద్ధి అధికారి తేజ్యోశ్న , తాసిల్దార్ రమాదేవి గారు, దామోదరమ్మ EORD, YRCP నాయకులు అనంత వెంకట్ రెడ్డి, శంకరయ్య, నాగి రెడ్డి, రామ సుబ్బారెడ్డి, మండల సామాజిక ఆరోగ్య అధికారి మోహన్ రావు , ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది గ్రామ ప్రజలకు పలు వ్యాధులపై , పౌష్ఠిాహారం లోపాలపై,గర్భవతులకు ,బాలల బాలికలకు గల అనీమీయా గురించి అవగాహన కార్యక్రమాలు కలిగించి, 508 మంది కి చికిత్స అందించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగినది. మరియు 19 మందికి మెరుగైన వైద్యం కొరకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపడం జరిగినది.మరియు 86 కంటి పరీక్షలు నిర్వహించి 21 కంటిపొర చిక్సిచ కొరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ,అనంతపురం నకు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్స్ ఈశ్వరమ్మ,, సచివాలయం కార్య దర్శి రంగా రెడ్డి, మరియు సచివాలయం సిబ్బంది, మహిళపోలీస్ సిబ్బంది,MLHPS , ANMs, ఆశాలు పాల్గొన్నారు.
Oct 30 2023, 06:36