జగనన్నకు అండగా నిలబడుదాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
జగనన్నకు అండగా నిలబడుదాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
![]()
కుల,మత,పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడదామని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు.
బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట, అమ్మవారిపేట గ్రామాల్లో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు.
అధికారులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులతో కలసి ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి చేకూరిన లబ్దిని ఆయా కుటుంబాలకు ఎంత చేకూరిందో బుక్ లెట్ ద్వారా వివరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ మాట తప్పకుండ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హామీలను నెరవేర్చక పోగా మేనిఫెస్టోని సైతం తొలగించివేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ చక్కటి సువర్ణ పాలన జరగాలంటే జగనన్నకు మనమందరం అండగా నిలబడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు.
నాలుగున్నారేళ్ల పరిపాలనలో ప్రభుత్వం నుంచి బండారు బాల కుల్లాయప్పకు దాదాపు రూ.8,40,553 లబ్ది చేకూరిందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Oct 29 2023, 10:28